YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 30 May 2012

స్వల్పంగా తగ్గనున్న పెట్రోలు ధర!

న్యూఢిల్లీ : పెట్రోల్‌ రేటు స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. లీటరుకు రెండు రూపాయిల వరకు ధర తగ్గించేందుకు ఆయిల్‌ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. నాలుగో త్రైమాసికంలో చమురు కంపెనీలకు కళ్లు చెదిరే రీతిలో లాభాలు వచ్చాయి. ఈ కారణంగా ధర తగ్గించవచ్చని వార్తలు వస్తున్నాయి. లీటర్‌కు రూపాయి 67 పైసలు తగ్గించే అవకాశముందని హెచ్ పీసీఎల్ సీఎండీ ఎస్‌ రాయ్‌ చౌధురి ఢిల్లీలో తెలిపారు. ట్యాక్సులు కలుపుకుంటే ధర 2 రూపాయల దాకా తగ్గొచ్చు. 

బహుశా వచ్చే వారం ధర తగ్గింపు నిర్ణయం ఉండవచ్చు. ఎన్నడూ లేని రీతిలో గత వారం ఒకేసారి పెట్రోల్‌ ధర 8 రూపాయలు పెరిగింది. కాగా ఇప్పుడు ఆయిల్‌ కంపెనీలకు మంచి లాభాలు వచ్చినందున ఆ లాభాల్లో కొంత మొత్తాన్ని వినియోగదారులకు అందించాలని భావిస్తున్నట్లు ఐవోసీ చెబుతోంది. అయితే 8 రూపాయలు పెంచి 2 రూపాయిలు తగ్గించడం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి తగ్గేలా లేదు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!