ఏలూరు: ప్రభుత్వ విధానాల వల్లే పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు బీవీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగంపై అవగాహనలేని ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నదని తెలిపారు. ఆరు లక్షల 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తామని సీఎం గొప్పలకు పోయారని విమర్శించారు. ఇప్పటివరకు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాలేదన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు విద్యుత్ సంక్షోభం ఏర్పడలేదన్నారు. జనరేటర్ల కొనుగోలుకు సబ్సిడీతో పావలావడ్డీ రుణాలు ఇవ్వాలని కోరారు. డీజిల్, వ్యాట్‌పై సబ్సిడీ ఇవ్వాలన్నారు. నెలాఖరులోగా పరిశ్రమల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంక్‌లకు రుణ బకాయిలు, విద్యుత్ బిల్లులు, వ్యాట్ చెల్లించలేమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment