హైదరాబాద్: కాంగ్రెసు పార్టీని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొదట ఆయన పార్టీలో వలసలు లేకుండా చూసుకోవాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఏడు సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ ఎన్.తులసి రెడ్డి సోమవారం సూచించారు. మొదట ఆయన పార్టీని సరిదిద్దుకుంటే మంచిదన్నారు.
చంద్రబాబు పాదయాత్రను ప్రజలు ఎవరూ నమ్మటం లేదన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దేశం నుండి పారద్రోలాలి అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. చంద్రబాబు తన నాలుకను అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెసు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్విట్ కాంగ్రెస్ అన్న వ్యాఖ్యలు ఆయన రాజకీయ విలువలకు అద్దం పడుతోందన్నారు. చంద్రబాబుకు జన్మనిచ్చింది కాంగ్రెసు పార్టీయేనని, దానిని గుర్తుంచుకుంటే మంచిదన్నారు.
పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర విప్‌లు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో జరిగిన తప్పులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు పాదయాత్రను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు.
కూర్చీ కోసమే.. హరీష్ రావు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూర్చీ కోసమే వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. చంద్రబాబు పాదయాత్రతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని, కానీ అది కుదిరే పని కాదన్నారు. రెండు ప్రాంతాలలో ఆయన తన ప్రాభవాన్ని కోల్పోయారన్నారు.
http://telugu.oneindia.in/news/2012/10/08/andhrapradesh-congress-suggested-chandrababu-106733.html
No comments:
Post a Comment