YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 16 July 2012

వైఎస్ఆర్ పథకాలకు ఉద్వాసన పలకాలని భావించడం నీతిమాలిన చర్య

ఏలూరు: వైఎస్ బొమ్మతో గెలిచిన మంత్రులు వైఎస్ఆర్ పథకాలకు ఉద్వాసన పలకాలని భావించడం నీతిమాలిన చర్య అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొయ్యె మోషెన్‌రాజు విమర్శించారు. మంత్రులకు సిగ్గుంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన మంత్రులు చనిపోయిన వైఎస్‌ను విమర్శించడం సరికాదని అన్నారు. మీడియా కో ఆర్డినేటర్ బీవీ రమణతో కలిసి మోషెన్‌రాజు సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. కరెంట్‌ కోతలు ఎత్తివేయాలంటూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రేపు వైఎస్‌ఆర్ సీపీ నిర్వహించనున్నధర్నాలు విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలు, అభిమానులను కోరారు.

మంత్రులపై పిల్‌ కొట్టివేత

వివాదస్పద 26 జీవోల వ్యవహారంలో మంత్రులకు ప్రభుత్వ న్యాయసహాయాన్ని ప్రశ్నిస్తూ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున కల్పించుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఓఎం దుబేరా ఈ పిల్ వేశారు.

Sunday, 15 July 2012

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో ఓటు వేసేందుకు అనుమతించాలంటూ న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్ లో ఆయన కోరారు.

పులివెందులలో వైఎస్ విజయమ్మ ధర్నా

పులివెందుల(వైఎస్సార్ జిల్లా): నష్టపోయిన పండ్ల రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఉదయం స్థానిక సీఎస్‌ఐ మైదానంలో ధర్నా చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ ధర్నాలో పాల్గొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన తర్వాత ఆమె ధర్నాలో కూర్చున్నారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, శ్రీనివాసులు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు.

Bhuma Meet in Allagadda Constituency Peoples

ఎన్నికల కమిషన్ నుంచి ఎన్టీఆర్ సింహం గుర్తు తెచ్చుకున్నారు

 "టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు. ఆయననే పార్టీ నుంచి గెంటేశారు. తర్వాత ఎన్నికల కమిషన్ నుంచి ఎన్టీఆర్ సింహం గుర్తు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకందరికీ తెలుసు'' అని కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరి అన్నారు. విశాఖ- ముంబై కొత్త రైలు ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను విలేకరులు టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించారు. 

తొలుత దాని గురించి అడిగినప్పుడు.. టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంతో తనకు సంబంధం లేదని, అది పార్టీకి సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు. అయితే.. నందమూరి వంశీయులే టీడీపీ పగ్గాలను చేపడతారని జరుగుతున్న ప్రచారంపై.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా ఎలా స్పందిస్తారని అడిగినప్పుడు పై విధంగా సమాధానమిచ్చారు.

శ్రమకు ఫలం దక్కక అన్నదాత దిగాలు



శ్రమకు ఫలం దక్కక రైతు దిగాలు
పెట్టుబడి ఖర్చులూ రాని దైన్యం
వ్యాపారిలా వ్యవహరిస్తున్న సర్కారు
ఏ మూలకూ చాలని మద్దతు ధర
అన్ని పంటలకూ మద్దతు తక్కువే
చుక్కలనంటుతున్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు
తడిసి మోపెడవుతున్న వ్యయం
దిగుబడి ఏమాత్రం తగ్గినా వ్యయం మరింత పెరుగుతుంది
అన్ని పంటలదీ ఇదే పరిస్థితి


కొండంత పెట్టుబడి పెడితే, వచ్చేది గోరంత ప్రతిఫలం. తెలంగాణ, కోస్తా, సీమ, ఉత్తరాంధ్ర.. ప్రాంతంతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల దుస్థితి ఒకేలా ఉంది. దుక్కి దున్నడం మొదలుకుని పంట చేతికొచ్చేదాకా సీజన్ పొడవునా కుటుంబంతో కలిసి రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా.. పెడుతున్న ఖర్చుకు, కళ్లజూస్తున్న ఆదాయానికి పొంతనే లేని దైన్యంతో అన్నదాత దిగులే మిగులుతోంది. మచ్చుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్క వరిసాగు తీరుతెన్నులనే తీసుకుంటే పరిస్థితి ఇదీ..

క్వింటాలు వరి ధాన్యం పండించేందుకు రైతుకయ్యే ఖర్చు సగటున 1,600 రూపాయల పై చిలుకే. ఎకరాకు కనీస దిగుబడి 19 క్వింటాళ్లు దాటని పక్షంలో ఖర్చు మరింతగా పెరుగుతుంది.

కానీ వరికి సర్కారు వారు నిర్ణయించిన కనీస మద్దతు ధర.. కేవలం 1,280 రూపాయలు! అందులోనూ కనీసం రూ.200 దాకా వ్యాపారుల కోత పోను అన్నదాతకు దక్కేది కనాకష్టంగా వెయ్యికి కాస్త అటూ ఇటుగా ఉంటుంది.

లాభాలు దేవుడెరుగు, కనీసం పెట్టుబడి ఖర్చులకే దిక్కు లేని దిక్కుమాలిన పరిస్థితులకు తాళలేక వరి రైతు వెన్నెముక నిలువునా వంగి, కుంగిపోతోంది.
ఇది కేవలం వరికే పరిమితమైన దుస్థితి కాదు. రాష్ట్రంలో ప్రధానంగా సాగవుతున్న అన్ని పంటలనూ పీడిస్తున్న పెను సమస్యగా మారి చాలాకాలమైంది. దడ పుట్టిస్తున్న ఎరువుల ధరలు, సబ్సిడీకి సర్కారు కోతతో భారమైన విత్తనాలు, పురుగుమందుల ధరలు, తీవ్రమైన కూలీల కొరత తదితరాల పుణ్యాన సాగుపై పెట్టుబడి ఖర్చులు ఏడాదిలోనే 25 నుంచి 30 శాతం పెరిగినట్టు వ్యవసాయ శాఖ లెక్కలే చెబుతున్నాయి. అయితే కరువు, కాకుంటే వరదల బారిన పడి అల్లాడుతున్న రైతుకు, ఆరుగాలం శ్రమించిన పంటకు చివరికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం పక్కా వ్యాపారిలా ప్రవర్తిస్తోంది. ఏ శాస్త్రీయతా పాటించకుండా, దేశీయ మార్కెట్‌లో డిమాండ్-గోదాముల్లోని నిల్వల లెక్కల ఆధారంగా, పెట్టుబడి ఖర్చులు కూడా రానంత తక్కువగా కనీస మద్దతు ధరలను ఖరారు చేసి రైతు ఉసురు పోసుకుంటోంది. వారిని చేజేతులా మరింతగా అప్పుల ఊబిలోకి నెడుతోంది. పంటల పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వాలు పంపుతున్న ప్రతిపాదనలను, క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రం పట్టించుకుంటున్న దాఖలాలే కన్పిం చడం లేదు. ఫలితంగా రైతు కష్టనష్టాల పాలవడమే గాక వ్యవసాయ రంగమే పెను సంక్షోభంలో కూరుకుపోతోంది.


పొంతన లేని ‘మద్దతు’...

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో వరి సాగు ఖర్చును పరిశీలించినా మిగిలేది నిరాశే. క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యం పండించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సగటున రూ.1,638 ఖర్చవుతోంది. అది కూడా ఎకరాకు సగటు దిగుబడి 19.2 క్వింటాళ్లుంటేనే! అంతకంటే ఏ మాత్రం తగ్గినా పెట్టుబడి ఖర్చు కూడా ఆ మేరకు పెరిగిపోతుంది. పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం మొత్తం కలిపి ఎంఎస్‌పీగా నిర్ణయించాలన్న జాతీయ రైతు కమిషన్ (స్వామినాథన్) సిఫార్సును కేంద్రం పట్టించుకోవడం లేదు. సరికదా కనీసం పెట్టుబడికి సమానంగానైనా ఎంఎస్‌పీని నిర్ణయించడం లేదు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఏ గ్రేడ్ ధాన్యం ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.1,280. ఈ లెక్కన కాలం కరుణించి రైతు సాధారణ దిగుబడి కళ్లజూసినా ఒక్క క్వింటాల్ మీదే రూ.358 చొప్పున నష్టపోతున్నాడు! ఇక ఎకరాకు నష్టం రూ.6,873 పైచిలుకే. గతేడాది రూ.4,777 ఉన్న ఈ నష్టం అంతలోకే రూ.2,000కు పైగా పెరిగిపోయింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తిగా తమ గుప్పిట్లో ఉంచుకున్న వ్యాపారులు, మిల్లర్లు.. ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు తప్ప రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వరు. క్వింటాల్‌కు కనీసం రూ.100 నుంచి రూ.200 తక్కువకే కొనుగోలు చేస్తుంటారు.

పంటలన్నింటిదీ అదే తీరు..

మితిమీరిన పెట్టుబడి ఖర్చులు, వ్యాపారుల మార్కెట్ మాయాజాలంతో వాణిజ్య పంటల సాగు కూడా జూదంగానే మారింది. రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంటయిన పత్తి గతేడాది క్వింటాల్ రూ.3,300 పలికింది. ఉత్పత్తి ఖర్చేమో క్వింటాలుకు రూ.4,239 అవుతుందని వ్యవసాయ శాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఆ ఖర్చుకు 50 శాతం అదనంగా, రూ.6,359 ఎంఎస్‌పీని నిర్ధారిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుంది. కేంద్రం మాత్రం పత్తికి కేవలం రూ.3,900 ఎంఎస్‌పీగా నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలైన మిరప, ఉల్లి, పసుపులకు కూడా కేంద్రం ఎంఎస్‌పీ ప్రకటించకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గతేడాది క్వింటాల్‌కు రూ.18,000 పలికిన పసుపుకు ఇప్పుడు రూ.4,000 రావడమే గగనమైంది. గతేడాది క్వింటాల్‌కు రూ.9 వేలు అమ్మిన మిరప ఇప్పుడు రూ.3 వేలకు పడిపోయింది. ఉల్లి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి క్వింటాల్‌కు రూ.4,000 ఉండగా ఇప్పుడు 1,000 కూడా రావడం లేదు.



ఎరువుల మంట...

కంపెనీలకిచ్చే రాయితీని స్థిరంగా ఉంచి, అమ్మకం ధరలను పెంచేలా రెండేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన పోషకాధారిత ఎరువుల విధానంతో ఎరువుల ధరలు అనూహ్యంగా ఎగబాకాయి. యూరియా మినహా అన్ని ఎరువుల ధరలు రెండేళ్లలోనే 12 సార్లు పెరిగాయి! రైతులు ఎక్కువగా వాడే 50 కిలోల డీఏపీ బస్తా రూ.486 నుంచి రూ.1,260కి పెరిగింది. కాంప్లెక్సుల్లో ఎక్కువగా వాడే 17:17:17 కూడా బస్తాకు రూ.301 నుంచి రూ.1,021కి చేరింది. దిగుబడి పెంచడంలో కీలకమైన పొటాష్ కూడా రూ.231 నుంచి రూ.885కు పెరిగింది. 28:28:0 ధర బస్తాకు రూ.389 నుంచి రూ.1,297కు పెరిగింది. ఇంతా చేసి అవి ఎమ్మార్పీకి దొరకడమే లేదు.






విత్తనాలూ భారమే..

ప్రస్తుత ఖరీఫ్‌కు ముందు సబ్సిడీ విత్తనాల ధరలను ప్రభుత్వం అమాంతంగా పెంచింది. గతేడాది రూ.1,540కి పంపిణీ చేసిన క్వింటా సోయాబీన్ విత్తనాల ధరను రూ.2,680కి పెంచింది. వేరుశనగ విత్తనాల ధర కూడా క్వింటాల్‌కు రూ.3,600 నుంచి రూ.3,950కి పెరిగింది. వరిదీ అదే దారి. బీపీటీ-5204 రకం విత్తనాల ధర గతేడాది క్వింటాల్‌కు రూ.1,950 ఉండగా ఇప్పుడు రూ.2,100కి పెరిగింది. బాస్మతిని పోలిన ఆర్‌ఎన్‌ఆర్-2332 విత్తనాల ధరా రూ.1,850 నుంచి 2,300లకు ఎగబాకింది. ఎక్కువగా సాగు చేసే ఎంటీయూ-1010, ఎంటీయూ-1001 రకం రూ.1,850 నుంచి 2,000కు పెరిగింది. మొక్కజొన్న, ఆముదం, నువ్వులు, జొన్నలు, సజ్జ విత్తనాలపై గతేడాది క్వింటాల్‌కు రూ.2,500 చొప్పున సబ్సిడీ ఇచ్చిన సర్కారు, దాన్నిప్పుడు రూ.1,200కు తగ్గించింది. దాంతో వాటిని సాగు చేసే రైతులపై రూ.100 కోట్ల అదనపు భారం పడింది. ఇక పత్తి విత్తనాల ప్యాకెట్ ఎమ్మార్పీ రూ.930 అని ఎక్కడా పొరపాటున కూడా లేదు. కంపెనీలు, డీలర్లు కలిసి ఒక్కో ప్యాకెట్‌ను రూ.2 వేలకు అమ్మి రైతులను దోచుకున్నారు.

పురుగు మందులూ ప్రియమే..: పురుగు మందులు, పంట సంరక్షణ ఉత్పత్తుల ధరలు కూడా రైతును కంటతడి పెట్టిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే పురుగుమందుల ధరలను అన్ని కంపెనీలూ 10 నుంచి 15 శాతం పెంచాయి. దాంతో రాష్ట్ర రైతులపై రూ.240 కోట్ల అదనపు భారం పడుతోంది.

- న్యూస్‌లైన్ ,హైదరాబాద్, న్యూస్‌లైన్ నెట్‌వర్క్

సీఎం కిరణ్‌కు పలుచోట్ల నిరసనలు


రంపచోడవరం (తూర్పు గోదావరి), న్యూస్‌లైన్: తాగునీటి కష్టాలను సీఎంకు చెప్పుకుని పరిష్కరించుకోవాలని ఆశించిన రంపచోడవరం ఏజెన్సీ బోర్నగూడెం గిరిజన మహిళలకు చేదు అనుభవమే మిగిలింది. సీఎం బస చేసిన ఆశ్రమ పాఠశాల గేటు ముందు ఖాళీ బిందెలతో ఆదివారం ఉదయమే వారు బైఠాయించారు. సీఎం కాన్వాయ్ బయల్దేరే సమయానికి పోలీసులు భారీగా వచ్చి వారిని తొలగించబోయారు. తోపులాట జరిగిఇరు వర్గాలూ బిందెలు, లాఠీలతో నెట్టుకోవడంతో పలువురు మహిళలు గాయపడ్డారు. సీఎం పట్టించుకోకుండానే వెళ్లిపోయారంటూ హతాశులయ్యారు. అలాగే అమలాపురం మండలం భట్నవిల్లి అంబేద్కర్ కాలనీలో సీఎం పర్యటనను చివరి క్షణంలో రద్దు చేసుకోవడంతో స్థానిక దళితులు కోపోద్రిక్తులయ్యారు. సీఎం వ్యతిరేక నినాదాలతో ఆందోళనకు దిగారు. స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లను ధ్వంసం చేశారు. కిరణ్ దిష్టిబొమ్మను, ఆయన ఫొటోలున్న ఫ్లెక్సీలను తగలబెట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అంబేద్కర్ విగ్రహానికైనా నివాళులర్పించకుండా దళితులను, అంబేద్కర్‌ను అవమానించారని ఆగ్రహించారు.

బీసీలపై ‘బాబు’ పాత పాట,2009 మహానాడులో 100 సీట్లు

ఇస్తామని చెప్పి 50కి మించి ఇవ్వలేదు
కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం తగదు

కర్నూలు, న్యూస్‌లైన్: వచ్చే ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తానంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాత పాట పాడుతూ కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో 2009లో నిర్వహించిన మహానాడులో బీసీలకు 100 సీట్లు ఇస్తామన్న బాబు 50కి మించి ఇవ్వలేదన్నారు. 

నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇస్తే బీసీలకు శాశ్వతమైన పనులు చేయకుండా కేవలం పాల క్యాన్లు, సైకిళ్లు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి వాటినే గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాల వల్ల శాశ్వతమైన లబ్ధి చేకూరిందన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులకు బకాయిలు రద్దు చేసేందుకు రూ.350 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇలాంటి పథకాలను చంద్రబాబు నాయుడు అప్పట్లోనే అమలు చేసి ఉంటే బీసీల్లో పేదరికం ఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాల వారిని ఆదుకున్నారని, ఆయన పరిపాలన తిరిగి రావాలంటే జగన్ ముఖ్యమంత్రిని చేయడమే ఏకైక మార్గమని ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారు. వైఎస్ కంటే బాగా పని చేస్తున్నానని గొప్పలు చెప్పే సీఎం విద్యుత్, ఎరువులు, విత్తనాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించ కుండా సమస్యలు గాలికొదిలిన ముఖ్యమంత్రి చేపడుతున్న ఇందిరమ్మ బాట ద్వారా ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.

జగన్ నిర్దోషిగా రావాలి:కొండా సురేఖ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్దోషిగా జైలు నుంచి విడుదల కోవాలని అమ్మవారిని కోరుకున్నానని ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ తెలిపారు. పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఆమె లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పాతబస్తీ బోనాల ఉత్సవాలను తాను తొలిసారిగా తిలకించానని, ఈ పండుగ వాతావరణం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. జగన్‌మోహన్ రెడ్డి జైలు నుంచి నిర్దోషిగా విడుదలైతే వచ్చే ఏడాది ఒడిబియ్యం సమర్పిస్తానని అమ్మవారిని మొక్కుకున్నానని సురేఖ వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కొండాసురేఖ ఉప్పుగూడ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. 

పులివెందులలో నేడు విజయమ్మ ధర్నా

పులివెందుల(వైఎస్సార్ జిల్లా): నష్టపోయిన పండ్ల రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందులలోని సీఎస్‌ఐ మైదానంలో సోమవారం ధర్నా చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ధర్నా నిర్వహిస్తారు. ఈ ఏడాది పులివెందుల బ్రాంచ్ కాలువకు నీటిని వదలక పోవడం వల్ల చీనీ, అరటి సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు.

టీజీని బర్తరఫ్ చేయండి

విశాఖపట్నం: టీజీ వెంకటేశ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గొల్లబాబూరావు డిమాండ్ చేశారు. ఐఏఎస్ లపై అలాంటి వ్యాఖ్యలు చేయడం అన్యాయమనిన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం ఉన్నవారు అలా మాట్లాడరని ఆయన చెప్పారు. ఐఏఎస్ లకు వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని చెప్పారు. టీజీ వెంకటేశ్ రాజకీయ అజ్ఞాని అని గొల్లబాబూరావు విమర్శించారు.

'పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడింది'

ఏలూరు: ప్రభుత్వ విధానాల వల్లే పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు బీవీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగంపై అవగాహనలేని ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నదని తెలిపారు. ఆరు లక్షల 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తామని సీఎం గొప్పలకు పోయారని విమర్శించారు. ఇప్పటివరకు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాలేదన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు విద్యుత్ సంక్షోభం ఏర్పడలేదన్నారు. జనరేటర్ల కొనుగోలుకు సబ్సిడీతో పావలావడ్డీ రుణాలు ఇవ్వాలని కోరారు. డీజిల్‌, వ్యాట్‌పై సబ్సిడీ ఇవ్వాలన్నారు. నెలాఖరులోగా పరిశ్రమల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంక్‌లకు రుణ బకాయిలు, విద్యుత్ బిల్లులు, వ్యాట్ చెల్లించలేమన్నారు.

YS Vijayamma to Dharna Against Power Crisis at Vijayawada on 17th July

అమ్మవారికి బోనం సమర్పించిన సురేఖ

మాజీ మంత్రి కొండా సురేఖ లాల్‌దర్వాజ్‌లో అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నిర్దోషిగా బయటకు రావాలి కోరుకున్నట్లు తెలిపారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు చెప్పారు. 

జగన్ ని విడుదల చేయాలి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలని పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. 26 జీ వోలపై మంత్రులు అడ్డం తిరిగితేనే ప్రభుత్వం న్యాయసహాయం అందిస్తోందన్నారు. దివంగ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని దోషిగా నిలబెట్టాలని ఈ ప్రభుత్వం విఫలయత్నం చేసిందని విమర్శించారు. సుప్రీం కోర్టు నోటీసులతోనే మంత్రులకు ప్రభుత్వం న్యాయసాయం అందిస్తోందన్నారు.

17న వైఎస్ఆర్ సిపి రాష్ట్రవ్యాప్త ధర్నా

విద్యుత్ సంక్షోభాన్ని నిరసిస్తూ ఈనెల 17న రాష్ట్రవ్యాప్త ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. విజయవాడలో జరిగే ధర్నాకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరవుతారని ఆ పార్టీ నేతలు నేతలు సామినేని ఉదయభాను, జలీల్‌ ఖాన్, తలశిల రఘురాం తెలిపారు. బందర్‌రోడ్డు ఎస్ ఇ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో విజయమ్మ పాల్గొంటారు.

జగన్‌ విడుదల కోసం పాదయాత్ర

వైఎస్ జగన్‌ను విడుదల చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత గౌతంరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూపూడి ప్రభాకరరావు, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!