ఇస్తామని చెప్పి 50కి మించి ఇవ్వలేదు
కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం తగదు
కర్నూలు, న్యూస్‌లైన్: వచ్చే ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తానంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాత పాట పాడుతూ కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో 2009లో నిర్వహించిన మహానాడులో బీసీలకు 100 సీట్లు ఇస్తామన్న బాబు 50కి మించి ఇవ్వలేదన్నారు.
నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇస్తే బీసీలకు శాశ్వతమైన పనులు చేయకుండా కేవలం పాల క్యాన్లు, సైకిళ్లు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి వాటినే గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాల వల్ల శాశ్వతమైన లబ్ధి చేకూరిందన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులకు బకాయిలు రద్దు చేసేందుకు రూ.350 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇలాంటి పథకాలను చంద్రబాబు నాయుడు అప్పట్లోనే అమలు చేసి ఉంటే బీసీల్లో పేదరికం ఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాల వారిని ఆదుకున్నారని, ఆయన పరిపాలన తిరిగి రావాలంటే జగన్ ముఖ్యమంత్రిని చేయడమే ఏకైక మార్గమని ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారు. వైఎస్ కంటే బాగా పని చేస్తున్నానని గొప్పలు చెప్పే సీఎం విద్యుత్, ఎరువులు, విత్తనాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించ కుండా సమస్యలు గాలికొదిలిన ముఖ్యమంత్రి చేపడుతున్న ఇందిరమ్మ బాట ద్వారా ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.

No comments:
Post a Comment