హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా జైలు నుంచి విడుదల కోవాలని అమ్మవారిని కోరుకున్నానని ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ తెలిపారు. పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఆమె లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పాతబస్తీ బోనాల ఉత్సవాలను తాను తొలిసారిగా తిలకించానని, ఈ పండుగ వాతావరణం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి నిర్దోషిగా విడుదలైతే వచ్చే ఏడాది ఒడిబియ్యం సమర్పిస్తానని అమ్మవారిని మొక్కుకున్నానని సురేఖ వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కొండాసురేఖ ఉప్పుగూడ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment