"టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు. ఆయననే పార్టీ నుంచి గెంటేశారు. తర్వాత ఎన్నికల కమిషన్ నుంచి ఎన్టీఆర్ సింహం గుర్తు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకందరికీ తెలుసు'' అని కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరి అన్నారు. విశాఖ- ముంబై కొత్త రైలు ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను విలేకరులు టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించారు.
తొలుత దాని గురించి అడిగినప్పుడు.. టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంతో తనకు సంబంధం లేదని, అది పార్టీకి సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు. అయితే.. నందమూరి వంశీయులే టీడీపీ పగ్గాలను చేపడతారని జరుగుతున్న ప్రచారంపై.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా ఎలా స్పందిస్తారని అడిగినప్పుడు పై విధంగా సమాధానమిచ్చారు.

No comments:
Post a Comment