రంపచోడవరం (తూర్పు గోదావరి), న్యూస్‌లైన్: తాగునీటి కష్టాలను సీఎంకు చెప్పుకుని పరిష్కరించుకోవాలని ఆశించిన రంపచోడవరం ఏజెన్సీ బోర్నగూడెం గిరిజన మహిళలకు చేదు అనుభవమే మిగిలింది. సీఎం బస చేసిన ఆశ్రమ పాఠశాల గేటు ముందు ఖాళీ బిందెలతో ఆదివారం ఉదయమే వారు బైఠాయించారు. సీఎం కాన్వాయ్ బయల్దేరే సమయానికి పోలీసులు భారీగా వచ్చి వారిని తొలగించబోయారు. తోపులాట జరిగిఇరు వర్గాలూ బిందెలు, లాఠీలతో నెట్టుకోవడంతో పలువురు మహిళలు గాయపడ్డారు. సీఎం పట్టించుకోకుండానే వెళ్లిపోయారంటూ హతాశులయ్యారు. అలాగే అమలాపురం మండలం భట్నవిల్లి అంబేద్కర్ కాలనీలో సీఎం పర్యటనను చివరి క్షణంలో రద్దు చేసుకోవడంతో స్థానిక దళితులు కోపోద్రిక్తులయ్యారు. సీఎం వ్యతిరేక నినాదాలతో ఆందోళనకు దిగారు. స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లను ధ్వంసం చేశారు. కిరణ్ దిష్టిబొమ్మను, ఆయన ఫొటోలున్న ఫ్లెక్సీలను తగలబెట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అంబేద్కర్ విగ్రహానికైనా నివాళులర్పించకుండా దళితులను, అంబేద్కర్‌ను అవమానించారని ఆగ్రహించారు.
Sunday, 15 July 2012
సీఎం కిరణ్‌కు పలుచోట్ల నిరసనలు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment