తాము ఎప్పుడూ వాసిరెడ్డి చంద్రబాలను కించపరచలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుచరిత, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మలు డిజిపి దినేష్ రెడ్డికి చెప్పారు. ఈరోజు సాయంత్రం వారు డిజిపిని కలిశారు. వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాసిన లేఖని ఆయనకు అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మహిళల పట్ల తమకు గౌరవం ఉందని తెలిపారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఎంపిక చేసిన మీడియాకు కాల్ చేసిన విధంగానే చంద్రబాల కూడా కాల్ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జెడి లక్ష్మీనారాయణ, చంద్రబాల ఫోన్ కాల్స్ పై దర్యాప్తు జరిపించాలని వారు కోరారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు కూడా చంద్రబాల ఫోన్ చేశారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని వారు డిజిపిని కోరినట్లు చెప్పారు.
భద్రతలేని వాహనంలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కోర్టుకు తీసుకెళ్లడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో జగన్ ని అరెస్ట్ చేయడం, ఈ విధంగా భద్రతలేని వాహనంలో తీసుకువెళ్లడం వంటి పరిణామాల వల్ల కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

No comments:
Post a Comment