
బీసీలకు సరైన న్యాయం

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనతో బీసీలకు రాబోయే రోజుల్లో సరైన న్యాయం జరుగుతుంది. జెండాలు మోయడం, ధర్నాలు చేయడానికే పరిమితమైన బీసీలకు విజ యమ్మ ప్రకటనతో రాజకీయంగా మంచి జరుగుతుంది.
-వెంకటస్వామి నాయుడు, గౌరకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
బీసీల్లో స్పూర్తి నింపారు

చట్ట సభల్లో వంద స్థానాలు రిజర్వేషన్ చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ చేసిన ప్రకటన బీసీల్లో స్ఫూర్తి నింపింది. వైఎస్‌చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్నప్పటికీ, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం అమలుకావడంలేదు. వైఎస్ పోయిన తర్వాత ఆయన వెంటే 108లాంటి మంచి మంచి పథకాలూ పోయాయి. వైఎస్ అందరిమాదిరిగా బతకలేదు. చరిత్రలో నిలిచిపోయేట్లుగా జీవించారు. జగన్ కూడా తండ్రి మాదిరిగా మంచి పేరు తెచ్చుకోవాలి.
-రాంకోటి (ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేత)
అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం

విజయమ్మ చేసిన ప్రతిపాదనతో ఇన్నాళ్లూ చట్ట సభలకు దూరమైన బలహీనవర్గాల వారు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం రానుంది. దీన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. మిగతా పార్టీలు అందుకు ప్రయత్నం చేయాలి.
-లాల్‌కోట వెంకటాచారి
(విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
అన్ని పార్టీల వైఖరి కోరాలి

బీసీల కోసం విజయమ్మ చేసిన ప్రతిపాదనపై వైఖరి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ సమావేశాలప్పుడు అన్ని పార్టీలను నిలదీయాలి. లక్షలాదిమంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు విజయమ్మ చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ దీక్ష వంటి పోరాటాలకు బీసీలు మద్దతివ్వాలి.
-డి.గిరిబాబు (క ళింగ సంఘం రాష్ట్ర నేత)
ఆ రెండు నియోజకవర్గాలూ ఉండొచ్చు కదా!

అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బోయ వ్యక్తికి అవకాశం కల్పిస్తామని ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటన కలిగించిన ఆనందానికి విజయమ్మ ప్రకటన తోడయింది. 100 మంది బీసీలను పంపుదామని విజయమ్మ చేసిన ప్రతిపాదనలోకి ఆమె ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల స్థానం కూడా రావొచ్చు.. లేదా కుప్పం సైతం ఉండవచ్చు కదా! ఆ చరిత్రాత్మక ప్రకటనను సైతం వక్రీకరించడం సరికాదు.
-గోపి (బోయ హక్కుల పోరాట సమితి నేత)
ఆ ప్రతిపాదనలో స్త్రీల కోటా ఉంచండి

విజయమ్మ ప్రతిపాదన బీసీలకు వరం లాంటిది. అయితే బీసీల్లోని అణగారిన కులాలకు సరైన ప్రాధాన్యం కల్పించే దిశగా కూడా కృషి చేయాలి. బీసీలకు ఇవ్వనున్న వంద సీట్లలో మహిళా కోటాను సైతం దృష్టిలో ఉంచుకోవాలి.
-శైలజ (వడ్డెర హక్కుల అభివృద్ధి సంఘం గౌరవాధ్యక్షురాలు)
నిజమైన బీసీలకే టిక్కెట్లు ఇవ్వాలి

అసెంబ్లీకి పంపించే వంద మందిలో నిజమైన బీసీలే ఉండాలి. పెట్టుబడిదారులు, ఎన్నారై, వ్యాపారవేత్తలు ఉండకూడదని వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేయకపోతే అసెంబ్లీకి 150 మందిని పంపినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎన్నారైలు, వ్యాపారవేత్తలు వారి వ్యాపారాలు చూసుకుంటారే తప్ప బీసీల సమస్యలపై మాట్లడలేరు. ఎన్నికలకు సంవత్సరం ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు ప్రకటించాలి.
-నారాయణ గౌడ్, గౌడ సంఘాల ఐక్యవేదిక
కృష్ణయ్య పోరాట ఫలితమే

రాష్ట్రంలో 35 ఏళ్లుగా ఆర్.కృష్ణయ్య చేస్తున్న నిర్విరామ పోరాట ఫలితంగానే నేడు వంద స్థానాల ప్రకటన వెలువడింది. రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా లక్ష్య సాధన కోసం బీసీలు కలసికట్టుగా పోరాడాలి. బీసీ రాజ్యాధికార లక్ష్యం కోసం ఏ పార్టీ ముందుకొచ్చినా కలుపుకొనిపోవాలి.
-జాజుల శ్రీనివాస్‌గౌడ్
(బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
బీసీలను ఓడించే కుట్ర చేయొచ్చు

బీసీలను చట్ట సభలకు పంపాలన ప్రతిపాదన అభినందనీయం. అయితే కొన్ని పార్టీలు దీనికి మొక్కుబడి మద్దతునిస్తూ అగ్రవర్ణాలకు మద్దతిచ్చే ప్రయత్నం చేస్తాయి. బీసీలను ఓడించే కుట్ర చేయొచ్చు. గతంలో కొన్ని పార్టీలు ఇలా చేశాయి.
-డి.మధు (కర్నూలు)
అణగారిన వర్గాలకూ అవకాశమివ్వాలి

కొన్ని కులాలు ఎద గటమే బీసీలు అభివృద్ధి చెందినట్లు కాదు. ఆ విభాగం కిందికి వచ్చే అణగారిన వర్గాలకూ మంచి వేదిక కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఎంత ఆలోచిస్తోందో విజయమ్మ ప్రకటన ద్వారా స్పష్టమయింది. వెనకబడిన వర్గాలలోని ఎదగని కులాలు పైకి వచ్చేందుకు ఈ ప్రకటన అవకాశం కల్పించాలి.
-పుల్లయ్య (నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకుడు)
క్షేత్రస్థాయి యువతకు మంచి అవకాశం

వందమంది బీసీలను శాసన సభకు పంపించాలనే వైఎస్సార్ కాంగ్రెస్ ఆలోచన క్షేత్రస్థాయి నుంచి ఎదగాలని కోరుకుంటున్న యువతకు మంచి అవకాశం. వాస్తవికతకు దగ్గరగా ఉన్న ఈ నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆ పార్టీకి ధన్యవాదాలు.
-కె.వేణుమాధవ్ (కృష్ణా జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు)
బీసీలకు మంచి రోజులు

విజయమ్మ ప్రకటనతో బీసీలకు మంచి రోజులు వచ్చాయి. వారికి రాజ్యాంగబద్ధ వేదికల్లో అవకాశం పొందేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేదికగా నిలుస్తుంది.
-రమాదేవి (బీసీ సంక్షేమ సంఘం మహిళా నేత)
బీసీలకు 100 స్థానాలు కచ్చితంగా ఇవ్వాలి

అసెంబ్లీలో బీసీలకు వంద స్థానాలు రిజర్వు చేయాలనే ప్రతిపాదన అమలుకు ఏ పార్టీలూ ముందుకు రాకపోయినా, వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం వంద మందిని చట్ట సభలకు పంపేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అలా చేస్తేనే బీసీలు ఆ పార్టీని హర్షిస్తారు. గతంలో ఓబీసీల కోటాలోని 27 శాతం నుంచి 4 శాతం మైనారిటీలకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదన చేసినప్పుడు రాష్ట్రంలోని ప్రధానపార్టీలు మౌనంగా ఉన్నాయి.
-దుర్గయ్య గౌడ్ (బీసీ సంఘం)
బీసీల గురించి ఆలోచించడం చాలా సంతోషం

రాష్ట్రంలో 65 ఏళ్ల తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు బీసీల గురించి ఆలోచించడం చాలా సంతోషం. విజయమ్మ ప్రతిపాదనతో ఇన్నాళ్లూ పార్టీల జెండాలు మోయడానికే పరిమితమైన బీసీలు ఇక నుంచి చట్ట సభల్లో ఎక్కువ సంఖ్యలో ప్రవేశించే అవకాశం కలిగింది. బీసీలు ఐక్యంగా ఉండి వందకంటే ఎక్కువ స్థానాలు సాధించుకునేలా కృషి చేయాలి. దివంగత రాజశేఖరరెడ్డి పేదలకు చేసిన మంచి వల్లే ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. గుడిసెలో పుట్టినవాడు కూడా ఆయన చలువతో ఈరోజు డాక్టర్, ఇంజినీర్ అవుతున్నాడు.
-ఎ.ఎల్.మల్లయ్య, మత్స్యకారుల సంఘం
విజయమ్మ ఆలోచన చరిత్రాత్మకమైంది

బీసీలపట్ల వై.ఎస్.విజయమ్మ చేసిన ఆలోచన చరిత్రాత్మకమైనది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో వంద మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో బీసీల గొంతు వినిపించే అవకాశం ఉంటుంది. చట్ట సభల్లో బీసీలు అడుగుపెడితే, రిజర్వేషన్ల చట్టం తప్పకుండా ఆమోదం పొందుతుంది. ప్రజలపక్షాన పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ చట్టం కోసం పోరాడాలి.
-భాగ్యలక్ష్మి, జి.సుధాకర్, శ్రీకాంత్, ఆరె కటికె సంఘం రాష్ట్ర నేతలు
వంద స్థానాల కోసం ఒత్తిడి చేయాలి

బీసీల అభివృద్ధి కోసం అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నేతలు ఐకమత్యంతో ఉండాలి. 52 శాతం జనాభా ఉన్న బీసీలు అందుకుతగ్గ సీట్లను సాధించుకోవాలి. వంద స్థానాల కోసం అన్ని పార్టీల్లోనా బీసీ నేతలు వారి నాయకత్వాలపై ఒత్తిడి తేవాలి. ఇన్నాళ్లూ పార్టీల అధినేతలు మనల్ని గమనించారు. ఇక నుంచి వాళ్లని మనం గమనించాలి.
-మొగిలిచర్ల వీరన్న, ఎం.పురుషోత్తం, శాలివాహన సంఘం రాష్ట్ర నాయకులు
మీ చిత్తశుద్ధిని బీసీలు గమనిస్తున్నారు

జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట సభల్లో 150 మందికి అవకాశం కల్పించాలి. బీసీల సంక్షేమం కోసం కృషిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆలోచనలను ప్రతి వెనకబడిన తరగతికి చెందిన ప్రజలు గమనిస్తున్నారు. విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో వారంతా సరైన నిర్ణయం తీసుకుంటారు.
-రాజేశ్వరరావు (వీరభద్రయ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
బీసీలను గుర్తించింది ఎన్టీఆర్, వైఎస్సే

రాష్ట్రంలో బీసీలను గుర్తించి వారికి లబ్ధి చేకూర్చిన ఘనత దివంగత నేతలైన ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లకే దక్కుతుంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ బీసీలను పట్టించుకోలేదు. అయితే ఆయనిప్పుడు వంద స్థానాలు ఇస్తామనడం ఆహ్వానించదగ్గ పరిణామం. బీసీల అభివృద్ధికి వైఎస్ చాలా కృషిచేశారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదనకు మేమంతా స్వాగతిస్తున్నాం.
-నీల వెంకటేష్ (బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు)
మంచి ఆశయం

రాజశేఖరరెడ్డి ఆశయాలతో వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల కోసం మంచి ప్రతిపాదన చేసింది. వంద స్థానాల్లో కూడా తక్షణమే అభ్యర్థులను ప్రకటించాలి. ప్రస్తుతం అన్ని పార్టీలు రైతుల గురించి మాట్లాడుతున్నందున అందులోనూ బీసీ రైతులకు నిర్దిష్ట ప్రణాళిక ఉండేట్లుగా చూడాలి.
-హనుమంతరావు (బీసీ ఎప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
కుల సంఘాల పోరాట ఫలితమే
బీసీ కుల సంఘాలు చేసిన పోరాటం ఫలితంగానే ఈరోజు చట్టసభల్లో వంద స్థానాలు ఇవ్వడానికి ప్రధాన పార్టీలు ముందుకొచ్చాయి. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చేదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను అన్ని పార్టీలు పెద్ద మనసుతో ఆచరిస్తే మంచిది. బీసీలపట్ల ప్రేమ ఉంటే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు కూడా విజయమ్మ ప్రతిపాదనకు ముందుకురావాలి.
-జి.మల్లేష్ (బీసీ ఫ్రంట్ చైర్మన్)
సంఘటితంగా ఉండాలి
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనపై బీసీలందరూ కులాలుగా చీలిపోకుండా సంఘటితంగా ఉంటే మరింతగా లబ్ధి కలుగుతుంది.
-ముసలయ్య (చేనేత సంఘం నేత)
ఎనలేని మేలు చేసిన వైఎస్
సంచారజాతికి చెందిన మా కులాన్ని అగ్రవర్ణాలు ఉండే బీసీ-డి కోటా నుంచి బీసీ-ఎలోకి మార్చాలని ఎందరికో మొరపెట్టుకున్నాం ఫలితం లేకపోయింది. ఆ వరం మాకు అందించిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన నిర్ణయంతో అనేకమంది డాక్టర్లు, విద్యావంతులు అవడమే కాకుండా పదోన్నతులు కూడా పొందారు. అంతేకాకుండా రూ.5.5 కోట్లతో ఏర్పాటుచేసిన ఫెడరేషన్ వల్ల మాకు ఆర్థిక సాంత్వన కలిగింది. వైఎస్ నిర్ణయాలకు కొనసాగింపుగా విజయమ్మ చేసిన ప్రకటనకు బీసీలందరి తరపున ధన్యవాదాలు.
-కోల శ్రీనివాస్ (పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
బీసీలందరికీ మేలు
విజయమ్మ ప్రకటనకు మద్దతిస్తే బీసీలందరికీ మేలు కలుగుతుంది. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందనే కొన్ని పార్టీలు ముందుకురావడంలేదు.
-శివరాఘవయ్య (కృష్ణ బలిజ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు)
అన్నివర్గాల్లోనూ చలనం

విజయమ్మ ప్రకటనతో అన్ని వర్గాల్లోనూ చలనం వచ్చింది. తమకు అధికారం దక్కుతుందని బీసీల్లో గర్వం, సీటు కదిలిపోతుందని అగ్రకులాల్లో గుబులు, తమ ఉనికి ఏమౌతుందోనని పార్టీల్లో వణుకు ప్రారంభమయింది.
-దివాకర్ (వైజాగ్ జిల్లా బీసీ ప్రతినిధి)
వీరితోపాటు మరికొన్ని సంఘాలకు చెందిన తిరుపతిరావు, లక్ష్మి, రవి, సాగర్, మహబూబ్‌నగర్ వాసి వేణుగోపాల్ తదితరులు కూడా ప్రసంగించారు.
No comments:
Post a Comment