రాష్ట్రంలోని ఎయిడెడ్, మున్సిపల్ టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీవైఎస్సార్‌టీఎఫ్) స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కె.ఓబుళపతి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 010 పద్దు కింద వేతనాలు పొందుతున్న వారికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చినపుడు ఎయిడెడ్, మున్సిపల్ టీచర్లను కలపకపోవడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment