శాసనసభకు వంద మంది బీసీలను పంపిద్దాం అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లక్డీకపూల్ సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 40 బీసీ సంఘాలు,50కి పైగా కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ బీసీ నేతలు బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్దతతో పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యా, ఉద్యోగం, సామాజికంగా, రాజకీయంగా వారు ఎదగడానికి పార్టీ తోడ్పడుతుందన్నారు. అంతేకాక అందరి సూచనలు, సలహాలను దృష్టిలో ఉంచుకుని అన్ని బీసీ కులాలు హర్షించేలా పార్టీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తుందని బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు చెప్పారు.

No comments:
Post a Comment