వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలికి బీసీ సంఘాల ఘన సన్మానం
పులివెందుల (వైఎస్సార్ కడప) న్యూస్‌లైన్: రాష్ట్రంలో బీసీలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రశ్నించారు. ‘బీసీ జనాభా ప్రాతిపదికన వంద అసెంబ్లీ స్థానాలను లాటరీ ద్వారా నిర్ణయిద్దాం.. ఆ సీట్లల్లో బీసీ అభ్యర్థులను మాత్రమే నిలబెడదాం’ అంటూ విజయమ్మ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో.. సోమవారం పులివెందులలో పలువురు బీసీ సంఘాలకు చెందిన నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలువురు నాయకులు పులివెందులలోని విజయమ్మ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ మిఠాయిలు పంచి విజయమ్మకు శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల చదువుల గురించి పట్టించుకున్నారా.. కళాశాలలకు ఎప్పుడైనా వెళ్లారా.. రైతులకు ప్రయోజనం చేకూర్చే ఏదైనా మంచి ఆలోచన చేశారా.? అని నిలదీశారు. చివరకు సాధారణ ప్రజలను కూడా పట్టించుకోలేదని చెప్పారు. పైగా ఇప్పుడు వైఎస్‌ఆర్ పథకాలన్నీ తనవే అంటున్నారని, దీన్నిబట్టి ఆయన మానసిక స్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు.

No comments:
Post a Comment