రాష్ట్ర ప్రభుత్వం చేత కాని తనం వల్లే కర్నూలు జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి దుయ్యబట్టారు. కర్ణాటక రైతులు తుంగభద్ర డ్యాం ఎల్‌ఎల్‌సీ గేట్లను దౌర్జన్యంగా మూసేసి నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా.. జిల్లాకు చెందిన మంత్రులు మొద్దునిద్ర వీడటంలేదని ఆమె ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తుంగభద్ర నుంచి కర్ణాటక అక్రమంగా నీటిని తరలించుకుపోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆమె తెలిపారు. ఇన్నాళ్లు డ్యామ్‌లో నీరులేక అల్లాడిన రైతులు పరిస్థితి ఇప్పుడు సమృద్ధిగా ఉనప్పటికీ మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు చెందిన మంత్రులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం తీసుకొని తుంగభద్ర నీటిని రైతులకు సక్రమంగా అందించాలని ఆమె కోరారు. అవసరమైతే జిల్లాకు చెందిన మంత్రులు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేకూర్చాలని శోభానాగిరెడ్డి సూచించారు.
Sunday, 19 August 2012
పాలకుల అసమర్థత వల్లే కర్నూలుకు కష్టాలు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment