వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇదే కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి(కాంగ్రెస్)తోపాటు మేడ్చల్ నియోజకవర్గ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు వైస్సార్ సీపీలో చేరనున్నారు. వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను విజయమ్మ వివరించే అవకాశం ఉంది.
భారీ స్వాగత సన్నాహాలు...
గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగతానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, జనార్దన్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్ ఏర్పాట్లను పరిశీలించారు.

No comments:
Post a Comment