విజయవాడ, న్యూస్‌లైన్: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలంటూ కృష్ణా నది ఇసుక తిన్నెలపై శనివారం టీడీపీ నిర్వహించిన మహాధర్నాకు రైతులు షాకిచ్చారు. కృష్ణా జిల్లా నుంచి రైతులు నామమాత్రంగానే రాగా, పొరుగు జిల్లాల నుంచీ స్పందన కరువై సభా స్థలి వెలవెలపోయింది. పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి ఒకరిద్దరు నాయకులు మాత్రమే హాజరయ్యారు. పైగా ఈ రెండు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టడం మరింత చర్చనీయాంశమైంది. పోలీసులు మాత్రం భారీగా పికెట్లు ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారు. చివర్లో ప్రకాశం బ్యారేజీ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండ వేసి వినతిపత్రం ఇస్తామంటూ నేతలు హైడ్రామా సృష్టించారు. దాంతో వారు బ్యారేజీ గేట్లను ముట్టడిస్తారేమోనని పోలీసులు అరెస్టు చేశారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 510 అడుగుల కంటే తక్కువుంటే నీరు విడుదల చేయొద్దన్న హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులను రద్దు చేయించాలని అంతకుముందు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు డిమాండ్ చేశారు. లేదంటే 13 లక్షల ఎకరాల్లో పంటలెండి ఆహార సంక్షోభం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలంలో 760 అడుగులు, సాగర్‌లో 490 అడుగులున్నా కృష్ణా డెల్టాకు నీరివ్వొచ్చని మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు అన్నారు.
Saturday, 25 August 2012
టీడీపీకి రైతుల షాక్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment