బీసీలకు వంద టిక్కెట్లుకాదు.. అసెంబ్లీలో వంద సీట్లిద్దామంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీలు రిజర్వ్‌డ్, మైనార్టీలు అధికంగా ఉండే స్థానాలు మినహాయించి బీసీ జనాభా అధికంగా ఉండే స్థానాలను వారికే కేటాయిద్దామని ప్రతిపాదించారు. వైఎస్ జగన్ మాటగా తాను ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ దీనికి కట్టుబడితే కాంగ్రెస్‌సహా మిగతా పార్టీలూ అంగీకరిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల విషయంలో జగన్ ఇలాంటి ప్రతిపాదనే చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదని విజయమ్మ గుర్తు చేశారు. 2009లో బీసీలకు వందటిక్కెట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు 47 మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ 67 టిక్కెట్లను బీసీలకు కేటాయించారని తెలిపారు. బీసీలపై ప్రేమ మాటల్లో కాదు.. చేతల్లో చూపే పార్టీ తమదని విజయమ్మ స్పష్టం చేశారు.

No comments:
Post a Comment