‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై ఎలాంటి విచారణల్లేవు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చాక మాత్రం సీబీఐ జగన్‌పై విచారణ చేపట్టింది’ అని బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ అన్నారు. శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైట్లీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ చార్జిషీటు, రాష్ట్రంలో అవినీతి తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఆయన పైవిధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై విచారణ చాలా ఆలస్యంగా జరుగుతోందని, అవినీతి జరిగినప్పుడే విచారణ చేసుంటే బాగుండేదని జైట్లీ అభిప్రాయపడ్డారు. ధర్మాన వ్యవహారంపై మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment