న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన రెడ్డి బెయిలుపై విడుదలైతే కలిసి వచ్చి రాష్ట్రపతికి అభినందనలు తెలుపుదామని అనుకున్నామని చెప్పారు. అయితే సీబిఐ అడ్డుపడటం వల్ల బెయిల్ రాకపోవడంతో తామే వచ్చి రాష్ట్రపతిగా గెలిచిన ప్రణబ్‌ను అభినందించామన్నారు. సీబీఐ వ్యవహారశైలిని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు.
విజయమ్మ వెంట రాష్ట్రపతిని కలిసిన ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి మాట్లాడుతూ సీబీఐ కక్షపూరిత వైఖరిని రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. వైఎస్ జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుపడుతోందన్నారు. గతంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు తెలిపిన విషయాలనే రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. బెయిల్ విచారణకు ముందు రోజు కాంగ్రెస్ పెద్దలను టీడీపీ
నేతలు కలిశారు. టీడీపీ నేతల భేటీ తర్వాతే ఈడీ ఆస్తుల జప్తు వ్యవహారం జరిగిందని మేకపాటి వివరించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయిన విషయాన్నే రాష్ట్రపతికి తెలిపామన్నారు.

No comments:
Post a Comment