ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు ఎవరికి అంతుబట్టడం లేదు. జగన్ ఆస్తుల కేసులో ప్రభుత్వంలో ఎవరూ తప్పు చేయలేదని అంటున్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు ఎలా వచ్చాయన్నదానిపై సిబిఐ విచారణ జరుపుతోందని ఆయన చెబుతున్నారు. తమ మంత్రులు ఎవ్వరూ క్విడ్‌ప్రొకోకు పాల్పడలేదని స్పష్టం చేశారు. మంత్రుల పాత్రపై ఇన్నాళ్లు జరుగుతోన్న చర్చకు ముఖ్యమంత్రి మాటలు స్పందనగా వచ్చాయి. వివాదాస్పద 26 జీవోలకు సంబంధించి ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు ఏనాడో నోటీసులు జారీచేసినా ప్రబుత్వం స్పందించలేదు. కాని ఇప్పుడు మంత్రులను సమర్ధిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. మరి అయితే ఇప్పటికే ఒక మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎందుకు జైలులో ఉన్నారో కూడా ముఖ్యమంత్రి చెబితే బాగుంటుంది.
Sunday, 25 November 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment