YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 16 February 2013

ఈ సర్కారుపై బాబుకే భరోసా

టీడీపీ అధినేతకు తప్ప ప్రజలెవరికీ ఈ ప్రభుత్వంపై భరోసా లేదు
ఇది అసమర్థ ప్రభుత్వం అని తిడుతూనే అవిశ్వాసం పెట్టకుండా కాపాడుతున్నారు
అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు చీకట్లో చిదంబరాన్ని కలుస్తారు
ప్రజాభిమానమే జగనన్నకు అండ.. వర్షంలోనే తడుస్తూ షర్మిల కోసం ఎదురు చూసిన జనం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 68, కిలోమీటర్లు: 978.6


‘‘వైఎస్సార్ సిసలైన వారసుడిగా జగనన్నను ప్రజలు స్వాగతించారు.. అందుకే చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుట్రలు చేసి, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను నాలుగు గోడల మధ్య బంధించారు. మీ ప్రేమాభిమానాల వల్లే జగనన్న జైల్లో కూడా ధైర్యంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ మీద ప్రజలెవరికీ భరోసా లేదు. ఎవరికైనా భరోసా ఉందీ అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే..’’ అని ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ఓవైపు ఇది అసమర్థ ప్రభుత్వం.. చేతగాని ప్రభుత్వం.. అని చంద్రబాబు తిడుతూనే మరోవైపు అవిశ్వాసం పెట్టకుండా సర్కారును కాపాడుతున్నారని విమర్శించారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు చీకట్లో చిదంబరాన్ని కలుసుకొని మ్యానేజ్ చేసుకుంటారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం 68వ రోజు నల్లగొండ జిల్లా నాగర్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో సాగింది. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భారీ వర్షం కురవడంతో పాదయాత్ర టెంట్లు కూలిపోయాయి. షర్మిల కోసం ఏర్పాటు చేసిన టెంటు వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. టెంటు చుట్టూ నీళ్లు చేరాయి. షెడ్యూల్ ప్రకారం ఆమె పాదయాత్రకు సిద్ధమైనప్పటికీ వాతావరణం అనుకూలించ లేదు. మరోసారి వర్షం కురవడంతో పాదయాత్ర బస్సు మట్టిలో కూరుకుపోయింది. 

మధ్యాహ్నం 12.30 గంటలకు వర్షం తెరిపినివ్వడంతో షర్మిల ముకుందాపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. త్రిపురారం గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తుంగపాడు చేరుకొని అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే వేదిక మీద నుంచి ప్రసంగించారు. ఇంతటి వర్షంలోనూ తనతోపాటు కలిసి నడిచేందుకు వచ్చినవారందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, మీ అభిమానమే జగనన్నకు అండ అని అన్నారు. తుంగపాడు నుంచి తిరిగి నడక మొదలుపెట్టిన కాసేపటికే మళ్లీ ఆకాశం మేఘావృతమైంది. దీంతో పార్టీ నేతలు పాదయాత్రను కుదించుకోవాలని షర్మిలకు సూచించారు. దీంతో శ్రీనివాసనగర్‌లోని ఓ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. శనివారం మొత్తం 6.2 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 978.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, బాలమణెమ్మ, బండారు మోహన్‌రెడ్డి, స్థానిక నాయకులు శ్రీకళారెడ్డి, జిల్లా మహిళా కన్వీనర్ సూరపల్లి సత్యకుమారి, విరిగినేని అంజయ్య, ఇరిగి సునీల్‌కుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, బోయపల్లి అనంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రపై కలెక్టర్‌తో చర్చ

 వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించనుండటంతో జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌తో ఆ పార్టీ నాయకులు చర్చించారు. శనివారం పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకటరమణ, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నేతలు కావటి మనోహరనాయుడు, బండారు సురేష్ తదితరులు కలెక్టర్‌ను కలిశారు. షర్మిల పాదయాత్ర వివరాలు వెల్లడించారు. 

షెడ్యూల్ ప్రకారం ఈనెల 18న షర్మిల గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనున్నారని, 13 నియోజకవర్గాల్లో 280 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో షర్మిల జిల్లాలో ఉండకూడదని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల కోడ్ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు అమల్లో ఉంటుందని వివరించారు. షర్మిల 18న జిల్లాలో ప్రవేశించినా.. ఆ మర్నాడే జిల్లాను వదిలి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పాదయాత్ర ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని సూచించారు. దీంతో మరోసారి సమావేశమై పాదయాత్ర షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోవాలని నేతలు నిర్ణయించారు.


నిన్ను చూసి పోదామని ఎదురుచూస్తున్న బిడ్డా..

‘‘అమ్మా.. వర్షం అదను మీద పడలేదు.. బత్తాయి పూత, పిందె మీద వానపడుతోంది. మూడెకరాలుంటే బత్తాయి పెట్టిన.. ఈ వానకు పూత రాలింది.. తోటకు పోయి సూద్దామనుకున్నా.. చెప్పులేసుకొని బయటికెళ్లిన. కానీ షర్మిలమ్మ టెంటు కూలిందని ఊళ్లోళ్లు చెప్పుకుంటుంటే తోటకు పోబుద్ది కాలేదు బిడ్డా.. పాణం గుంజింది. నిన్నుజూసి పోదామని ఎదురుచూస్తున్న..’’ అని తుంగపాడుకు చెందిన రైతు మచ్చ పోషన్న షర్మిలతో అన్నారు. శనివారం హోరున వర్షం కురిసినా షర్మిల కోసం పెద్ద ఎత్తున జనం ఎదురుచూశారు.

జగన్‌ను బయటికి రప్పించకుంటే ప్రజా నిరసన వెల్లువెత్తుతుంది...

ప్రస్తుత జగన్ నిర్బంధం కచ్చితంగా ఆయన రాజకీయ భవిష్యత్తును నీరుగార్చేందుకు జరిగిన కుట్రేనని ఎవరినడిగినా చెపుతాడు. కాని ఇది తాత్కాలికమే. 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్‌ని అందలం ఎక్కించబోతున్నారన్నది ఎవరూ కాదనలేని నిజం. యూపీఏ చేతిలోని కీలుబొమ్మయిన సీబీఐ... జగన్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, తన కంపెనీలలోకి పెట్టుబడులు సంపాదించారని నేరారోపణ చేసి ఆయన్ని అరెస్టు చేసింది. 

ఒకవేళ అదే నిజమైతే పరిశ్రమలలోకి, కంపెనీలలోకి పెట్టుబడులు ఆహ్వానించడం నేరమా? ఆ పరిశ్రమల ద్వారా అనేక వేలమందికి ఉపాధి కల్పించడం నేరమా? జగన్‌కి వ్యతిరేకంగా నిజంగా సీబీఐ దగ్గర తగిన ఆధారాలుంటే వాటిని కోర్టులో ప్రవేశపెట్టి, నేరాన్ని రుజువు చేయవచ్చు కదా! ఆధారాలు, సాక్ష్యాలు సేకరించడానికి ఇన్ని రోజులు కావాలా? ఇంతగా ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ హరించుకుపోతుంటే కోర్టులు ఎందుకని ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి? ఇదీ జవాబు దొరకని ప్రశ్నేనా? కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ఎంతగా నాశనం చేసిందంటే ఒక అసమర్ధుడైన ముఖ్యమంత్రిని నియమించి అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది. బ్రహ్మాస్త్రంలాంటి జగన్‌ను దూరం చేసుకుని, పూచిక పుల్లలాంటి నాయకులను దగ్గరకు తీసుకుంది. ఇది ఆమె రాజకీయ అజ్ఞానానికి, అవగాహనా రాహిత్యానికి చక్కటి నిదర్శనం. ఇప్పటికైనా వాస్తవం గ్రహించి జగన్‌ను ప్రజల్లోకి రప్పించాలి. లేకుంటే ప్రజా నిరసన వెల్లువలో కాంగ్రెస్ కొట్టుకు పోవడం ఖాయం. 

- టి.సుధాకర్‌బాబు, నరసాపురం, ప.గో.జిల్లా

కాంగ్రెస్ పార్టీ జగన్‌ని దూరం చేసుకుంది జగన్ లేని పార్టీకి మేము దూరమయ్యాం

మొదట్నుంచి మాది కాంగ్రెస్ సానుభూతి కుటుంబం. 2003 మహాప్రస్థానం తర్వాత మేము పూర్తిగా డా.వైయస్ రాజశేఖరరెడ్డిగారి అభిమానులమయ్యాం. అందుకు కారణం ఆయన అమలుపరిచిన సంక్షేమ పథకాలే. 2009లో వైఎస్సార్‌గారి మరణం మమ్మల్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. కోట్లాది మంది అభిమానుల్లాగే ఆయనకి కన్నీటి వీడ్కోలుతో మాత్రమే కృతజ్ఞతను చెల్లించుకోగలిగాం. ఆ తర్వాత ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన తండ్రికి ఇచ్చిన మాటపై నిలబడి అధిష్టానం ఆగ్రహాన్ని చవిచూసినప్పుడు. కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజల వద్దకు వచ్చినప్పుడు మేమంతా ఆయన నిర్ణయాన్ని ఆనందంగా స్వాగతించాం. 

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు జరిగిన అవమానాలు, ఆ పార్టీ పెద్దల వల్ల ఆయన పడుతున్న కష్టాలు మా మనసుల్ని నొప్పించాయి. రాష్ట్రప్రజల మనోభావాలను లెక్క చెయ్యకుండా కాంగ్రెస్‌పార్టీ జగన్‌ను దూరం చేసుకుంది. ఆయన లేని పార్టీ మాకెందుకని మేమూ కాంగ్రెస్‌కు దూరం అయ్యాం. దుష్ట కూటమి అయిన టీడీపీ, ఎల్లో మీడియాలు కలిసి అధికార పార్టీతో కుమ్మక్కయి తలోచేయి వేసి ఈరోజున రాజశేఖరరెడ్డి గారి కుటుంబాన్ని చెల్లాచెదురు చేయడం కూడా మా హృదయాలను కలచివేస్తోంది. అయితే ఆ కూటమికి తెలియని సంగతి ఏమిటంటే - ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల మద్దతు జగన్‌కు మాత్రమే ఉంటుందని. చూస్తూ ఉండండి. జగన్‌గారిని ప్రజలు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారు. ఆరోజున రాష్ట్రానికి నిజంగా ‘సువర్ణయుగం’ మొదలౌతుంది. 

- జి.రవికుమార్, బలిజపేట, మురపాక

నక్కజిత్తుల నాయకులంద రినీ...‘జగన్’న్నాథ రథచక్రాలు తొక్కేస్తాయి!

చెడుకాలం దాపురించినపుడు చెట్టుకు కుక్కమూతి పిందెలు కాసినట్లు... రాబోయే కొద్ది నెలల్లో కాంగ్రెస్‌కు, తెలుగుదేశం పార్టీకి, వెన్నుపోటుదారుడు చంద్రబాబునాయుడుకు ప్రజలు ఛీత్కరించుకునే కాలం దాపురించనుంది. అట్టర్ ఫ్లాఫ్ షోని తిలకించి తమ సమయాన్ని, డబ్బును వృథా చేసుకున్నామని థియేటర్ నుంచి బయటకు వస్తున్న సినీ ప్రేక్షకుల్లా, రాష్ట్ర ప్రజానీకం... మహానేత అస్తమయం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఈసడించుకుంటున్నారు. నిస్సిగ్గుగా నిర్లజ్జగా కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు ప్రోత్సహిస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయి. 

అందుకే మహానేత రెక్కల కష్టంతో సంపాదించిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వెనకాడుతున్న తెలుగుదేశానికీ తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞత గల తెలుగు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఓదార్పుయాత్రలో జనంతో మమేకమైన యువనేత, జననాయకుడు అయిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం తహతహలాడుతున్నారు. రాజన్న దయాదాక్షిణ్యాలతో ఎదిగి, నేడు ఆయన్నే దోషిగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేస్తున్న ఈ నాయకులు, నక్కజిత్తుల నారావారు... ‘జగన్’న్నాథ రధచక్రాల కిందపడి నుజ్జునుజ్జయ్యే రోజు ఎంతోదూరంలో లేదు. సంతలో పశువుల్లా అమ్ముడుపోయి అందలమెక్కిన రీల్ హీరోలకు కూడా ప్రజలంతా కలిసి చుక్కలు చూపించే తీర్పు త్వరలోనే వెలువడుతుంది. ఇది తథ్యం.

- అద్దంకి బాబూరావ్, మౌలాలి, హైదరాబాద్

20న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి సమావేశం

ప్రజా సమస్యలపై చర్చించడానికి ఈ నెల 20న వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ఉన్నత స్థాయి విసృ్తత సమావేశం జరుగుతుంది. పార్టీ కేంద్ర పాలకమండలి, కార్యనిర్వాహక మండలి సభ్యులు, జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లు, జిల్లాల కోఆర్డినేటర్లు, పరిశీలకులు, అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు ఈ సమావేశంలో పాల్గొంటారని పార్టీ సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన ఆమె క్యాంపు కార్యాలయంలో (లోటస్ పాండ్) ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో ప్రధానంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, కరెంటు కష్టాలు, సంక్షేమ పథకాలు నీరుగారుతున్న విధానంపై చర్చలు జరుగుతాయని అన్నారు. సంస్థాగతంగా సభ్యత్వ కార్యక్రమం, పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ కూడా ఈ సమావేశం ఎజెండాలో ఉంటుందన్నారు.

మరో ప్రజాప్రస్థానం నేడు సాగుతుందిలా...

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం మిర్యాలగూడ మండలంలో సాగుతుంది.

మండలంలోని శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్ మీదుగా పట్టణానికి చేరుకుంటుంది. దులగూడ శివారులో షర్మిల రాత్రి బస చేస్తారు.

Friday 15 February 2013

ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితి

ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకప్పడు తనకు కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేం పార్టీ అత్యంత దయనీయ స్థితికి దిగజారిపోయింది. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితిలో పడిపోయింది. 2009 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం) వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి వెన్నంటి నిలిచారు. ఆ వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీప్రకటించడంతో జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండాపోయారు. 1983 తరువాత జిల్లాలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన 1983 ఎన్నికల్లో ఉన్న 12 స్థానాల్లో 11 చోట్ల ఆ పార్టీ గెలిచింది. సోంపేట మినహా అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. 1985లో పది స్థానాలు చేజిక్కించుకుంది. కాగా 1989లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీరామారావు వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ జిల్లాలో మాత్రం ఆ పార్టీ ఎనిమిది స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. 1994 ఎన్నికల్లో జిల్లాలో 11(అందులో ఒకటి టీడీపీ అనుబంధ సభ్యుడు) స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 1999 ఎన్నికల్లో కూడా టీడీపీ 11 స్థానాలు గెలుచుకుంది. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో జిల్లాలో టీడీపీ తిరోగమనం ప్రారంభమైంది. 

ఆ ఎన్నికల్లో తొలిసారి టీడీపీ ప్రత్యర్థి పార్టీ కంటే తక్కువ సీట్లకు పరిమితమైంది. వైఎస్ జనాదారణతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు చోట్ల ఘనవిజయం సాధించగా.. టీడీపీ ఐదు సీట్లకే పరిమితమైంది. కాగా 2009 ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గి 10 స్థానాలు ఏర్పడ్డాయి. ఆ ఎన్నికల్లో వై.ఎస్. నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ ఒక్క ఇచ్ఛాఫురం నియోజకవర్గంలోనే గెలిచింది. వైఎస్ మరణానంతరం జిల్లా రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే సాయిరాజ్ పునరాలోచనలో పడ్డారు. ప్రజాభీష్టం మేరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలవాలని నిర్ణయించారు. ఆయన శుక్రవారం జగన్‌ను కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతోనూ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి దృష్ట్యా జగన్ తో కలసి పనిచేస్తానని ప్రకటించారు. దాంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. విధిలేని పరిస్థితుల్లో సాయిరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ ఇక కోలుకోవడం దుర్లభమేనని టీడీపీ శ్రేణులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నాయి.

కాంగ్రెస్‌కు డీసీసీబీ, టీడీపీకి డీసీఎంఎస్... పంచుకున్న పార్టీలు

డీసీసీబీ చైర్మన్‌గా అమాస, డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్యామరాజు 
21 మంది ఉన్నా డీసీఎంఎస్‌కు నామినేషన్లే వేయని కాంగ్రెస్ 
కాంగ్రెస్ - టీడీపీల మధ్య రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన చీకటి పొత్తు చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల సందర్భంగా మరింత బలపడింది. టీడీపీ సహకారంతో కాంగ్రెస్ చిత్తూరు డీసీసీ బ్యాంకు ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా టీడీపీకి డీసీఎంఎస్ చైర్మన్ పదవితో పాటు పాలకవర్గం మొత్తం అప్పగించేందుకు మార్గం సుగమం చేసింది. 59 సింగిల్ విండోలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 21 గెలవటం ఆ రెండు పార్టీలకు ఆందోళన కలిగించింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన 8 విండోలను డీఫాల్ట్ జాబితాలో చేర్పించిన కాంగ్రెస్ పార్టీ.. నామ్‌కే వాస్తే అన్నట్లుగా టీడీపీకి చెందిన ఒక విండోను కూడా ఇందులో చేర్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు గాలిముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి రెండు పార్టీల మధ్య పదవులు పంచుకునే ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. 

ఇవి ఫలించటంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆమోదంతో డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌కు ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. పెద్ద పంజాణికి చెందిన కాంగ్రెస్ సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి డీసీసీ బ్యాంకు డెరైక్టర్‌గా నామినేషన్ వేయటానికి ప్రతిపాదకుడు తక్కువ పడ్డారు. దీంతో విజయభాస్కర్‌రెడ్డిని కుప్పం నియోజకవర్గం శాంతిపురం సింగిల్ విండో అధ్యక్షుడు శ్యామరాజు ప్రతిపాదించారు. ఏ క్లాస్‌లో 16 డెరైక్టర్ స్థానాలకు రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు అందుబాటులో లేకపోవటంతో 9 కాంగ్రెస్, 3 టీడీపీ పంచుకుని నామినేషన్లు వేయించుకున్నారు. బి క్లాస్‌లోని 5 డెరైక్టర్ స్థానాలకు కాంగ్రెస్ మద్దతుదారులైన ముగ్గురే నామినేషన్ వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత మిగిలిన డెరైక్టర్లను రెండు పార్టీలు ఒక అవగాహనతో కో-ఆప్షన్ పద్ధతిలో నామినేట్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

డీసీఎంఎస్ పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్

టీడీపీతో కుదిరిన రహస్య ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీ డీసీఎంఎస్ పాలకవర్గం ఎన్నికల నుంచి తప్పుకుంది. మొత్తం 10 డెరైక్టర్ పదవులకు రిజర్వేషన్ అభ్యర్థులు అందుబాటులో లేకపోవటంతో టీడీపీ 7 నామినేషన్లు మాత్రమే దాఖలు చేసింది. టీడీపీకి చెందిన శాంతిపురం సింగిల్ విండో అధ్యక్షుడు శ్యామరాజును చైర్మన్ చేయటానికి రంగం సిద్ధం చేసింది. ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ పదవి కూడా టీడీపీకే ఇవ్వటానికి కాంగ్రెస్ సుముఖంగా ఉంది.

ఒక కుక్కను చంపాలంటే పిచ్చికుక్కగా ముద్రవేయాలనేది సామెత

నష్టాల్లేని పరిశ్రమను ఖాయిలా తీయించిన చంద్రబాబు ‘పాలసీ’లు
రైతులు, షేర్ హోల్డర్లకు తెలియకుండానే 2002లో అమ్మకానికి
చంద్రబాబు కనుసన్నల్లోనే బిడ్డింగ్ ప్రక్రియ
కలెక్టర్, ఆడిట్ విభాగం అంచనా వేసిన ధరకంటే అతి తక్కువకే నామాకు అప్పగింత
షేర్ హోల్డర్లకు డబ్బులూ ఇవ్వలేదు

 ఒక కుక్కను చంపాలంటే పిచ్చికుక్కగా ముద్రవేయాలనేది సామెత..
ప్రభుత్వరంగ సంస్థలను తన వారికి తెగనమ్మాలంటే వాటిని ఖాయిలా పరిశ్రమలుగా మార్చాలనేది చంద్రబాబు పాలసీ..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్క దానిని కూడా బతకనీయలేదు. వాటిని ఆయన అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్రపూరిత ప్రణాళికలతో ఖాయిలా పరిశ్రమలుగా మార్చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇప్లిమెంటేషన్ సెక్రటేరియట్’ను స్థాపించారు. ప్రతి ప్రభుత్వ పరిశ్రమనీ కారుచౌకగా అనుయాయులకు అప్పగించారు. సొంత హెరిటేజ్ డెయిరీ కోసం ప్రభుత్వ డెయిరీనే నాశనం చేసిన బాబు.. మిగతా ప్రభుత్వరంగ సంస్థలకూ ఇదే గతి పట్టించారు.

ఎగుమతులు లేక రాష్ట్రంలో చక్కెర నిల్వలు పేరుకుపోయి షుగర్ ఫ్యాక్టరీలు తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో.. రెండు లక్షల టన్నుల చక్కెర దిగుమతి చేసుకొని రాష్ట్ర పరిశ్రమలను కోలుకోని విధంగా దెబ్బతీశారు. వస్త్ర పరిశ్రమలపై పన్నులు పెంచి స్పిన్నింగ్ మిల్లులను పెను సంక్షోభంలోకి నెట్టారు. చంద్రబాబు విధానాలతో రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు తీవ్రంగా దెబ్బతిని, నష్టాల ఊబిలోకి కూరుకుపోయాయి. ఆ వెంటనే వాటిపై ఖాయిలా ముద్ర వేసి, తన పని కానిచ్చేశారు. ఇలా నష్టాల సాకుతో 71 సహకార చక్కెర, స్పిన్నింగ్ మిల్లులను దశలవారీగా ప్రైవేటు పరం చేసేందుకు ప్రణాళిక రచించారు. దాదాపు రూ.1,500 కోట్ల విలువ చేసే 20 మిల్లులను కేవలం రూ.300 కోట్లుకు అమ్మేశారు. వీటిలో ఖమ్మం జిల్లాలోని పాలేరు షుగర్స్ కూడా ఒకటి. ఎటువంటి నష్టాలు లేకుండా నడుస్తున్న ఈ పరిశ్రమను ముందుగా ఖాయిలా పడేలా చేశారు. ఆ తర్వాత బిడ్డింగ్ డ్రామాతో బాబుకు సన్నిహితుడైన నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ చేతుల్లో పెట్టారు. రైతులు, షేర్ హోల్డర్లకు, కనీసం సహకార సంఘం సభ్యులకు కూడా చెప్పకుండా ఈ మంత్రాంగమంతా నడిపించేశారు. రూ. 22 కోట్లు విలువైన కర్మాగారాన్ని కేవలం రూ. 9.58 కోట్లకే ధారాదత్తం చేశారు.

రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరీపురం, అమ్మగూడెం గ్రామాల మధ్య 1976లో పాలేరు చక్కెర కర్మాగారాన్ని నిర్మించారు. 1984లో ఇక్కడ చక్కెర ఉత్పత్తి మొదలైంది. ఈ కర్మాగారంలో 84 శాతం ప్రభుత్వ వాటా కాగా, 16 శాతం రైతుల వాటా ఉంది. అప్పట్లో ఒక్కొక్క షేర్ రూ.500 చొప్పున మూడు వేల మంది రైతులు 4,600 షేర్లు కొనుగోలు చేశారు. 2002 డిసెంబర్‌లో ఈ పరిశ్రమను నామా నాగేశ్వరరావుకు అప్పగించే సమయానికి ఈ షేర్ల విలువ రూ.3 కోట్లు. ఎటువంటి లాభ నష్టాలు లేకుండా నడుస్తున్న ఈ పరిశ్రమ చంద్రబాబు ఆర్థిక విధానాల పుణ్యమా అని నష్టాల్లోకి వెళ్లింది. తొలిసారిగా రూ.2 కోట్ల రన్నింగ్ నష్టం వచ్చింది. ఇదే కారణాన్ని చూపి చంద్రబాబు 2002లో కంపెనీని అమ్మకానికి పెట్టారు. ఈ విషయం ముందుగా రైతులకు, షేర్ హోల్డర్లకు తెలియజేయలేదు. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వమే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.సుబ్రమణ్యం చైర్మన్‌గా ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసింది.

‘పాలేరు షుగర్స్‌ను నమ్ముకొని ప్రత్యక్షంగా 8 వేల మంది రైతులు, 3 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వం కొద్దిగా చేయూతనందిస్తే ఈ పరిశ్రమ అన్ని సమస్యలను అధిగమించి, మెరుగైన లాభాలను ఆర్జిస్తుంది’ అని ఈ కమిటీ సిఫారసు చేసింది. చంద్రబాబు ఈ సూచనలను పట్టించుకోలేదు. కనీసం స్థానిక సహకార సంఘం అనుమతి కూడా తీసుకోకుండా 280 నుంచి 328 వరకు సర్వే నంబర్లలో ఉన్న 134. 23 గుంటల భూమితో పాటు, యంత్రాల విక్రయానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 134 ఎకరాల భూమి విలువ రూ.9.40 కోట్లు, యంత్రాలు, ఇతర వస్తువుల విలువ రూ.12 కోట్లు, మొత్తం రూ.21.40 కోట్లుగా అప్పటి జిల్లా కలెక్టర్ లెక్కించారు. జిల్లా సహకార సంఘం ఆడిట్ విభాగం దీని విలువ రూ.22 కోట్లుగా అంచనా వేసింది. ఇక బిడ్డింగ్ వ్యవహారమంతా చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచింది.

ఎవరు బిడ్ వేయాలి, ఎంత సొమ్ము కోట్ చేయాలి, డమ్మీలుగా ఎవరు బిడ్ వేయాలో ముందే నిర్ణయమైంది. ఈ పథకం ప్రకారం నామా నాగేశ్వర్‌రావు రూ.9,58,88,888కు బిడ్ వేయగా, పి.వెంకటేశ్వర్లు రూ.7,77,15,000కు బిడ్ వేశారు. ఇతను డమ్మీ అభ్యర్థి అని అందరూ చెబుతుంటారు. మరో విశేషం ఏమిటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, చంద్రబాబు సన్నిహితుడు గోకరాజు రంగరాజుకు ఒక రకంగా ఖమ్మం జిల్లా ముఖ్య వ్యాపార కేంద్రం. ఆయన వ్యాపారమంతా ఇక్కడే ఉంది. అలాంటిది గోకరాజు పాలేర్ షుగర్స్ కోసం కనీసం బిడ్ కూడా వేయలేదు. దీనినిబట్టి చూస్తే పథకం ప్రకారమే అంతా జరిగిందన్న విషయం బోధపడుతుంది. 2002 డిసెంబర్‌లో పరిశ్రమ నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ సంస్థ పరమైంది. అప్పటికి పరిశ్రమలో 30 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయి. వీటి విలువే రూ.2.10 కోట్లు ఉంటుందని అంచనా. రైతుల షేర్ల విలువ రూ.3 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వంగానీ, నామా నాగేశ్వర్‌రావు గానీ రైతులకు చెల్లించలేదు. ఈ విధంగా జిల్లా కలెక్టర్ అంచనా వేసిన విలువ (21.40 కోట్లు)కన్నా, జిల్లా సహకార సంఘం ఆడిట్ విభాగం అంచనా (22 కోట్లు)కన్నా అతి తక్కువ ధర (రూ.9.58 కోట్లు)కే పాలేరు షుగర్స్ ఫ్యాక్టరీ నామా వశమైంది. ప్రస్తుతం ఆ కర్మాగారం రోజుకు 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, క్రషింగ్ సామర్థ్యంతో పనిచేస్తోంది.

బాబు సంతర్పణలు మరికొన్ని..

రూ.35 కోట్లు విలువచేసే నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును కేవలం రూ. 12.33 కోట్లకే చంద్రబాబుకు సన్నిహితుడైన సి.ఎం.రమేష్‌కు చెందిన రిత్విక్ ఎంటర్ ప్రైజెస్‌కు కట్టబెట్టారు. రూ.6 కోట్ల విలువైన గురజాల చక్కెరమిల్లు, రూ.30 కోట్లు పలికే ఇంకొల్లు నూలు మిల్లును కలిపి కేవలం రూ.9.86 కోట్లకే నూజివీడు సీడ్స్‌కు ఇచ్చేశారు. ఈ సంస్థ టీడీపీతో సన్నిహితంగా మెలుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని ఏకంగా అప్పటి హోం మంత్రి దేవేందర్‌గౌడ్ తమ్ముడు అశోక్ గౌడ్ కొన్నారు. ఇవే కాకుండా నిజాం షుగర్స్, పాలకొల్లు, నంద్యాల, హిందూపురం చక్కెర మిల్లులు, అదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లును కూడా చంద్రబాబు పరివారగణానికి కారుచౌకగా ధారాదత్తం చేశారు.

అక్రమాలపై చర్యలేవీ: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

 నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ, ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అక్రమాలపై కోర్టులు జోక్యం చేసుకొనేంతవరకు చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కే యాదవరెడి ్డ, కేఆర్ ఆమోస్ విమర్శించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా నిజాం షుగర్స్‌ను, రూ.కోట్ల విలువైన ఆస్తులను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారని, ఇందులో అప్పటి మంత్రులు, అధికారులకు కూడా సంబంధముందని ఆరోపించారు. సభాసంఘం సిఫార్సులను అమలు చేయకపోవడానికి కారణాలేమిటో బయటకు రావాలన్నారు. నిజాం షుగర్స్‌ను కొనుగోలు చేసిన వ్యక్తులకు అధికారంలో ఉన్న వారితో బంధుత్వాలు ఉన్న కారణంగానే కమిటీ సిఫార్సులను పట్టించుకోవడం లేద ని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

తప్పుడు అప్పులు చూపారు: కేటీఆర్

నిజాం షుగర్స్‌కు తప్పుడు అప్పులు చూపించి అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తక్కువ ధరకు అమ్మేశారని టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు కె.తారక రామారావు  ఆరోపించారు. ఈ అమ్మకం అతిపెద్ద ఆర్థిక అవకతవకలతో కూడుకున్నదని శాసనసభా కమిటీ తప్పుపట్టిందని, హైకోర్టు కూడా మందలించిందన్నారు. చంద్రబాబుతోపాటు అప్పటి ఆర్థిక, పరిశ్రమలు, చక్కెర శాఖామంత్రులు ఈ ఆర్థిక నేరానికి బాధ్యులని శాసనసభా కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అనంతరం వైఎస్, రోశయ్య, కిరణ్ సీఎంలుగా ఉన్నా చర్యలు తీసుకోకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ల్యాంకో, జీఎంఆర్ విద్యుత్ సంస్థల నుంచి కరెంట్‌ను ఎక్కువ ధరకు కొనడం తో ప్రజలపై రూ.2 వేల కోట్ల భారం పడిందన్నారు. ల్యాంకో, జీఎంఆర్ నుంచి డబ్బు రికవరీ చేయకుంటే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. 

వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తా

చంచల్‌గూడ జైల్లో జగన్‌తో ప్రత్యేక ములాఖత్

 తెలుగుదేశం అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోందని, దీనిపై తాను తీవ్రంగా కలత చెందానని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే పిరాయి సాయిరాజ్ చెప్పారు. పార్టీలో సమస్యలు పరిష్కరించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. చంచల్‌గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి టీడీపీ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. తన రాజకీయగురువు ఎర్రన్నాయుడు అకాలమరణంతో పార్టీలో తన పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. రాజకీయాల నుంచి వైదొలగుదామని నిశ్చయించుకున్న తరుణంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏవిధంగా లాభం చేకూర్చాయో గుర్తొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రజాసేవకే పూనుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తనది కాదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతానన్నారు. జగన్‌ను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సాయిరాజ్ వెంట నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తోపాటు శ్రీకాకుళం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ పద్మప్రియ కృష్ణదాస్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు ఉన్నారు. 

ప్రజలను మోసగిస్తున్న బాబు: అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో స్పష్టం చేయాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు అన్నారు. తన కుమారుడు, టీడీపీ నేత కలమట వెంకటరమణతో కలిసి శుక్రవారం చంచల్‌గూడ జైల్లో జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై 2008లో కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. వైఎస్ మృతి తర్వాత ఆయన పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందన్నారు. 

విజయమ్మను కలిసిన సాయిరాజ్

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్ శుక్రవారమిక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కలమట వెంకటరమణమూర్తి, మోహన్‌రావు విజయమ్మతో భేటీ అయ్యారు. వీరి వెంట ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, సుజయకృష్ణ రంగారావు, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు దర్మాన పద్మప్రియ ఉన్నారు. మరోవైపు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఆంజనేయరాజు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనను వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంజనేయరాజుతో పాటు పలువురు నేతలు పార్టీలో చేరారు. వీరి వెంట పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులున్నారు.



పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేని టీడీపీ సస్పెండ్ చేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నశ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం శాసనసభ్యుడు పిరియా సాయిరాజ్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున సాయిరాజ్‌పై ఈ చర్యతీసుకున్నట్టు పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ మీడియాకు పంపిన ఎస్సెమ్మెస్‌లో తెలిపారు. సాయిరాజ్‌తో పాటు శుక్రవారం జగన్‌ను కలుసుకున్న శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకట రమణను కూడా సస్పెండ్ చేసినట్లు ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభకు 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎన్నికకాగా, ఇప్పటివరకూ 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ప్రస్తుతం శాసనసభలో టీడీపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ తరఫున ఉన్న ఏకైక శాసనసభ్యుడైన సాయిరాజ్ కూడా పార్టీని వీడటంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచి టీడీపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 

అగస్టా కుంభకోణంలో ఎమ్మార్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర

అగస్టా కుంభకోణంలో ఎమ్మార్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర పోషించారు
ఆ సంస్థతో మొదటి నుంచీ లింకులున్నది ఎవరికి?
హెలికాప్టర్ల కుంభకోణానికీ వైఎస్ కుటుంబాన్ని ముడిపెడతారా?
స్కాంపై కాంగ్రెస్‌ను ప్రశ్నించకుండా వైఎస్ కుటుంబానికి అంటగడతారా? 
కాంగ్రెస్ సర్కారును మోస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ యత్నం 
బాబు కొన్న బెల్-430 కాప్టరే వైఎస్ ప్రాణాలు బలిగొందని రేవంత్ గమనించాలి 

 ‘‘అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఎమ్మార్ సంస్థకు చెందిన ఒక వ్యక్తి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం వెలువడుతోంది. ఎమ్మార్ అనే సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది ఎవరు? ఆ సంస్థతో ఒప్పందం కోసం దుబాయి వెళ్లి 3 రోజులు పర్యటించిదెవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మార్‌కు హైదరాబాద్ నడిబొడ్డున 535 ఎకరాలు పప్పుబెల్లంలా కట్టబెట్టింది ఎవరు? వీటన్నింటికీ చంద్రబాబు తాబేదార్లు సమాధానం చెప్పాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిని ధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ పరిశీలిస్తే హెలికాప్టర్ల కుంభకోణంలో కూడా చంద్రబాబు నిష్ణాతులుగా వెల్లడవుతోందన్నారు. వైఎస్‌ను బలిగొన్న బెల్-430 హెలికాప్టర్ క్రాష్ అవటానికి చంద్రబాబు హస్తం కూడా ఉన్నట్లుందని గట్టు అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ మరణంపై నెలకొన్న అనుమానాలపై చంద్రబాబు నోరు మెదపకపోవటం కూడా అందులో భాగమేనా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి బాగోతాల గురిం చి మాట్లాడితే రోజుల తరబడి చెప్పినా తరగనిదని, ఆయనపై కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలు ముద్రించిందని గుర్తుచేశారు. గట్టు రామచంద్రరావు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి సంఘటనతోనూ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి సంబంధం అంటగట్టి బురద చల్లకపోతే చంద్రబాబు, ఆయన తాబేదార్లకు నిద్రపట్టేట్లులేదని ఎద్దేవా చేశారు. 

పైశాచిక ఆనందానికి పరాకాష్ట... : వైఎస్ కుటుంబాన్ని విమర్శించకపోతే తాము బతికి బట్టకట్టే పరిస్థితిలేదనే భయం వారిలో నెలకొన్నట్లుందని గట్టు వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పెద్దల హస్తంతో జరిగిన హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వైఎస్ కుటుంబ ప్రమేయం ఉందని పేర్కొన టం టీడీపీ పైశాచికానందానికి నిదర్శనమని మండిపడ్డారు. అగస్టా హెలికాప్టర్ కొనుగోళ్లలో భాగంగా బయటపడ్డ అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినది కూడా ఉన్నట్లయితే విచారణ జరిపించాలన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన అవకతలపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ప్రశ్నించకపోగా.. దాన్ని వైఎస్ కుటుంబానికి అంటగట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరమన్నారు. ప్రజలను కష్టాల పాలుచేస్తున్న కాంగ్రె స్ ప్రభుత్వాన్ని తన భుజాలపై మోస్తున్నందు వల్లే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు, ఆయ న తాబేదార్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని గట్టు విమర్శించారు. 

బెల్-430 కొన్నది బాబే కదా! : దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ప్రాణాలను బలిగొన్న హెలికాప్టర్‌పై టీడీపీ నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన పలు అనుమానాలు లేవనెత్తారు. ‘‘అవినీతితో కొనుగోలు చేసిన హెలికాప్టర్ వల్లే రాజశేఖరరెడ్డి మరణించారని రేవంత్ చెప్తున్నారు! అయితే బెల్-430 హెలికాప్టర్ కొనుగోలు చేసింది చంద్రబాబే అనే విషయాన్ని ఆయన గుర్తుచేసుకోవాలి. ప్రమాదం జరిగిన ఆ హెలికాప్టర్ కొనుగోలులో చంద్రబాబు ఏమేర అవినీతికి పాల్పడ్డారో ప్రభుత్వం విచారణ చేపట్టాలి. రేవంత్ సైతం వారి పార్టీ అధినేతకు వత్తాసు పలకకుండా ఇదే డిమాండ్ చేయాలి. అగస్టా హెలికాప్టర్ ఎగరటానికి పనికి రాకపోతే.. చంద్రబాబు కొనుగోలు చేసిన బెల్-430 ప్రాణాలు బలిగొందనే విషయాన్ని ఆయన గమనించాలి’’ అని గట్టు పేర్కొన్నారు. 

బాబుకు ప్రజలు విధించిన శిక్ష...: వ్యవస్థలను మేనేజ్ చేసి శిక్షలు తప్పించుకున్న చంద్రబాబుకు ప్రజాకోర్టు విధించిన శిక్షను అనుభవిస్తున్నారని గట్టు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను నరకంలోకి నెట్టినందుకే వారు విధించిన శిక్షను నేడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. ‘బిల్‌క్లింటన్, టోని బ్లేయర్‌లతో కలిసి టీ తాగాను, ప్రపంచంలో చక్రం తిప్పానంటూ చెప్పుకున్న చంద్రబాబును ఒక్క తోపు తోస్తే దేశంలో వచ్చి పడ్డారు. ఫోన్‌ల ద్వారా దేశ ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేసిందే తానే అంటూ చెప్పుకున్నారు. అక్కడ ఒక్క తోపు తోస్తే రాష్ట్రంలో పడ్డారు. ఇక్కడ ప్రజలు లాగికొడితే నడివీధిలో పడ్డారు’ అని గట్టు ఎద్దేవా చేశారు. వీధుల వెంట తిరుగుతున్న చంద్రబాబు ప్రజలకు తన తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పకుండా వైఎస్ పాలనలో ఇచ్చినవన్నీ తానూ అందిస్తానని చెప్పుకోవటాన్ని బట్టే ఆయన పరిపాలన ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలకు చంద్రబాబు పట్ల విశ్వసనీయత, మాటమీద నిలబడే మనస్తత్వం లేనందు వల్లే ఆయన్ని నమ్మడంలేదన్నారు. టీడీపీ నమ్ముకున్న పార్టీ నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు సైతం ఆ పార్టీని వదిలి వెళ్లటం.. బాబుపై నమ్మకం లేకపోవటం వల్లనేనని తేటతెల్లమవుతోందన్నారు.

పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన

పాదయాత్రలో షర్మిల వద్ద పల్లె ప్రజల ఆవేదన
పెరిగిన ధరలతో బతుకు భారంగా మారిందని కన్నీళ్లు..
వైఎస్సార్ పోయాక తమను పట్టించుకున్న వాళ్లే లేరని మండిపాటు
రోజుకు రెండు గంటలే కరెంటా? ఇదెక్కడి న్యాయం?: షర్మిల
చంద్రబాబు గారూ.. ప్రజల గోడు మీకు వినిపిస్తోందా?
ఇప్పటికైనా ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దించండి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 67, కిలోమీటర్లు: 972.4

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఆఖరి వాన కురిసి ఐదు నెలలు దాటింది.. పంటల సంగతి దేవుడెరుగు.. ఊళ్లలో మనుషులు తాగడానికి.. అడవి మీద పశువులు తాగడానికి కూడా నీళ్లు లేవు.. రోజుకు రెండు గంటలకు మించి కరెంటు రాదు. మోటారు నుంచి నీళ్లు దునికి మడికి పారకముందే మళ్లీ కరెంటు పోతది.. పొద్దంతా కష్టం చేసి ఇంటికి పోయి పడుకుందామంటే దోమల మోత.. వైఎస్సార్ పోయిన తరువాత మా బతుకంతా చీకట్లే’’ అని ముకుందాపురం గ్రామానికి చెందిన రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘మా మహిళా సంఘం తరఫున బ్యాంకు నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాం. మూడేళ్ల నుంచి అప్పు కడుతున్నాం. ఇంకా రూ.1.66 లక్షల అప్పుంది. నెల నెలా వడ్డీ కట్టించుకుంటున్నారు. పావలా వడ్డీ అని చెప్తున్నారు కానీ రూ.3 వడ్డీ దాకా లెక్కొస్తోంది..’’ ముకుందాపురం గ్రామానికే చెందిన నాగమణి గోడు వెళ్లబోసుకుంది.

‘‘అక్కా పరీక్షలు దగ్గర పడ్డాయి. చదువుకుందామంటే రాత్రి కరెంటు ఉండటం లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంటు ఇంత వరకు రాలేదు. ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని యాజమాన్యం చెప్తోంది. అమ్మ వాళ్లను ఫీజు అడిగితే.. చూస్తున్నావుగా బిడ్డా పంట చేతికి రాలేదు. ఫీజు ఎట్టా కట్టాలే అంటున్నారు. భయం వేస్తోందక్కా..’’ అని నిడమనూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చంద్రకళ కళ్లనీళ్లు పెట్టుకుంది.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాగింది. నిడమనూరు, ముకుందాపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండల్లో రాములమ్మ, నాగమణి, చంద్రకళ ఇలా తమ గోడు చెప్పుకొన్నారు. వీరే కాదు.. పాదయాత్రలో రోజూ ఏ పల్లెకు వెళ్లి పలకరించినా ఇవే కష్టాలు! ఎవరిని కదిలించినా.. ఇవే కన్నీళ్లు. ఏ రైతు ముఖం మీదా చిరునవ్వు లేదు. ఏ మహిళ నోటి నుంచీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న మాట లేదు. నిడమనూరు, ముకుందాపురం గ్రామాల్లో జరిగిన రచ్చబండల్లోనూ ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెరిగిన ధరలతో తమకు బతుకే భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు విన్న షర్మిల.. జనాన్ని గాలికొదిలేసిన పాలకులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండి పడ్డారు. రోజుకు రెండు గంటలే కరెంటు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబూ మీకు వినిపిస్తోందా?

‘‘చంద్రబాబు గారూ.. వీళ్ల మాటలు మీకు వినిపిస్తున్నాయా? ప్రజల కన్నీళ్లు మీకు కనిపిస్తున్నాయా? ఇక ఆపండి.. పాదయాత్రల పేరుతో మీరు చేస్తున్న డ్రామాలు ఆపండి. మీరు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని అంటున్నారు. ఈ ప్రజల అవసరాలు మీకు కనిపించడం లేదా? మీకు ప్రజల మీద ప్రేమ కంటే కుర్చీ మీద మమకారమే ఎక్కువ. అందుకే అవిశ్వాసం పెట్టకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓటేసేముందు గుర్తుంచుకోవాలంటూ పాదయాత్ర డ్రామాలాడుతున్నారు. మీరు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మీపై కేసులు పెట్టదు.. విచారణ జరపదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

ఇది బాబు పాలనే..

రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి వేస్తే రైతన్న కష్టం పోనూ క్వింటాల్‌కు రూ. 5 వేల ఖర్చు వస్తోంది. కానీ మార్కెట్‌లో పత్తి మద్దతు ధర రూ. 3,900కు మించలేదు. తరుగు, దళారుల మోసం తీసేస్తే రైతన్న చేతికి వస్తుంది కేవలం రూ. 2,500లే. అప్పుల బాధలు పడలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క పత్తి రైతులే కాదు.. టమాటా, మిర్చి.. వరి సాగు చేసే ప్రతి రైతూ కన్నీళ్లు పెడుతున్నారు. రైతులు పంటలు చేతికి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యారు. ఆదుకునే నాథుడు లేకఅల్లాడిపోతున్నారు. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు పెంచారు. రైతు మద్దతు ధరనేమో దించారు. ఇవే కష్టాలు, కన్నీళ్లను చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో చూశాం.. ఆయన హయాంలో దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు పాలనను తలపిస్తోంది. ఇది చంద్రబాబు నాయుడి పాలన రెండో భాగం.’’

వైఎస్ హయాంలో రూ.12 వేల కోట్ల రుణమాఫీ..

ఇప్పుడైతే రైతులకు కూడా కరెంటు బిల్లులు ఇస్తున్నారు. ఆ బిల్లులు కట్టకపోతే మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకు పోతున్నారు. అమ్మా ఇదెక్కడి అన్యాయం అంటున్నారు రైతులు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే రూ.1,300 కోట్ల విద్యుత్తు బకాయిలను రద్దు చేశారు. 7 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని మాటిచ్చి.. ఇచ్చి చూపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉంటే ఈ రోజు విద్యుత్తు చార్జీలు పెరిగేవే కాదు. వైఎస్ విత్తనాల ధరలను దించారు.. ఎరువుల ధరలు పెరగనివ్వలేదు. మద్దతు ధర కల్పించారు. వైఎస్సార్ రైతులను గౌరవించారు.. ప్రేమించారు.. అందుకే రైతన్నలు బాగుపడాలని రూ. 12 వేల కోట్ల రుణాలనుమాఫీ చేశారు. కానీ ఇప్పుడున్న ఆ సర్కారుకు పెద్దమనసు లేదు. మహిళలైతే తమ పిల్లలను స్కూల్‌కు పంపించకుండా తమ వెంట పనులకు తీసుకొని పోతున్నారు. ఎందుకక్కా అని అడిగితే ‘కూలికి తీసుకొని పోతే కూలి డబ్బులు వస్తాయి కదమ్మా.. కనీసం రెండు పూటలైనా తింటాం’ అని చెప్తున్నారు. ‘ఒక రోజంతా కూలి చేస్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి. నెల రోజులు కష్టం చేస్తే 3,000 రూపాయలు వస్తాయి.. పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలకు ఈ డబ్బులు ఎలా సరిపోతాయమ్మా.. మేం ఎలా బతకాలమ్మా’ అని అంటున్నారు.

విద్యార్థులు చదువులు నిలిపేస్తున్నారు..

పేదోళ్లు పెద్ద చదువులు చదవాలని, ప్రతి ఇంటి నుంచి డాక్టరో.. ఇంజనీరో.. కలెక్టర్ లాంటి పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఆయన ఉన్నంత కాలం విద్యార్థుల ఫీజులను ఆయనే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఏం చేశారు? విద్యార్థి ఫీజులో రెండు వాటాలు తల్లిదండ్రులు భరిస్తే... ఒక వాటా మేం ఇస్తామని విద్యార్థులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు మధ్యలోనే నిలిపేస్తున్నారు.’’

‘మరో ప్రజాప్రస్థానం’ 67వ రోజు శుక్రవారం నల్లగొండ జిల్లా అలీనగర్ గ్రామ శివారు నుంచి షర్మిల యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటేశ్వర నగర్, నిడమనూరు, నర్సింహుల గూడెం, బీకే తాండా, బొక్కముంతలపాడు గ్రామాల మీదుగా ముకుందాపురం చేరుకున్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 14.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 972.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, గట్టు శ్రీకాంత్, బాలమణెమ్మ, స్థానిక నాయకులు బండారు మోహన్‌రెడ్డి, గాదె నిరంజన్, విరిగినేని అంజయ్య, ఇరిగి సునీల్ కుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, సూరపల్లి సత్యకుమారి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

Wednesday 13 February 2013

పిచ్చి ప్రేలాపనలు మానుకో బాబూ!

- లేకుంటే ప్రజలు తరిమికొడతారు 
- దమ్ముంటే అవిశ్వాసం పెట్టు 
- వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్ 

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిచ్చిప్రేలాపనలు మానకుంటే గ్రామాల్లో ప్రజలు తరిమి కొడతారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలో చేపడుతున్న పాదయాత్రలో వైఎస్సార్‌సీపీపై ప్రయోగిస్తున్న పదజాలం అభ్యంతరకరంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారం అనుభవించిన బాబు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు. 

బాబు డిక్షనరీలో నీతి నిజాయితీ అనే పదాలకు అర్థం వేరని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ చంద్రబాబు సీఎం అయ్యాకే భ్రష్టు పట్టిందని, టిక్కెట్లు అమ్ముకోవడం నుంచి అన్నిరకాల అవకతవకలకు కారకుడైన బాబును చూసి నిజాయితీ గలవారెవరైనా సిగ్గుతో తలవంచుకోవాల్సిందేనన్నారు. బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యనిర్వహణ మండలి సభ్యుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ, వైఎస్సార్‌ను ప్రజలు దేవుడిలా చూసుకోబట్టే అన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. 2004, 2009 ఎన్నికల్లో బాబును రాష్ట్ర ప్రజలు పక్కకు నెట్టారని, దానికి ప్రజల్ని కూడా నిందించడం సరికాదన్నారు. ఇదేవిధంగా మాట్లాడితే గ్రామాల్లో తిరగనివ్వరని, రాళ్ళతో కొట్టే పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించారు. విలేకరులసమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వహణమండలి సభ్యుడు కోనరఘుపతి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కు: ఎంపీ మేకపాటి
కందుకూరు: అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైనందునే టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. కందుకూరులో బుధవారం ఆయన విలేక రులతో మాట్లాడారు. ప్రభుత్వ బలం తగ్గినప్పుడు అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టకుండా చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో వీలినం చేసిన తర్వాత బాబు అవిశ్వాసం పెట్టారని మేకపాటి ధ్వజమెత్తారు.

మళ్లీ చంద్రబాబు పాలనా!!

* రైతులకు రూ. వేలల్లో వస్తున్న కరెంటు బిల్లులు
* పోలీసు స్టేషన్లలో నిలబెట్టి బిల్లు వసూళ్లు..
* కట్టకపోతే మోటార్లు, స్టార్టర్లు తీసుకుపోతున్న అధికారులు
* కరెంటు కొరత, వర్షాభావంతో వేల ఎకరాల్లో బత్తాయి తోటలు నరికేసిన రైతులు
* లక్షల ఎకరాల్లో బీడుకు వదిలేసిన ఇతర పంటల రైతులు
* నల్లగొండ జిల్లాలో దుస్థితి.. షర్మిల పాదయాత్రతో వెలుగులోకి
* ప్రభుత్వ దాష్టీకంపై నిప్పులు చెరిగిన షర్మిల
* ప్రజలను క్షోభకు గురిచేస్తున్న ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే
* చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజం 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : కరెంటు రాదు.. వచ్చిన రెండు మూడు గంటలకే రూ.వేలకు వేల బిల్లు.. ఇదేమని అడిగితే అధికారులు స్పందించరు.. బిల్లు కట్టకుంటే పోలీసు స్టేషన్‌కు ఈడ్చి మెడ మీద లాఠీపెట్టి మరీ వసూలు చేస్తున్నారు. లేదంటే అధికారులు రాత్రివేళ బోరు బావుల వద్దకొచ్చి కరెంటు మోటార్లు, స్టార్టర్లు తీసుకుపోతున్నారు. ఇంటి కనెక్షన్లు కట్ చేస్తున్నారు. అటు పంటకు నీళ్లు అందక.. ఇటు మోటార్లు లేక ఎండిపోతున్న పంటను చూడలేక.. రైతాంగం పెంచిన చేతులతోనే తోటలను తెగనరికివేస్తోంది.

పంట పొలాలను బీడు భూములుగా వదిలేస్తోంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఇలా 25 వేల ఎకరాల బత్తాయి తోటను రైతులు నరికి వేశారు. మరో 25 ఎకరాల్లో తోట నీళ్లు లేక ఎండిపోయింది. ఇతర పంటలు పండే మరో మూడు లక్షల ఎకరాలను బీడుకొదిలేసి.. రైతులు పిల్లాపాపలతో వలస వెళ్లిపోయారు. పాలకుల నిర్లక్ష్యం, ట్రాన్స్‌కో దాష్టీకంతో విలవిల్లాడుతున్న నల్లగొండ రైతన్న దుస్థితి.. షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రతో వెలుగులోకొచ్చింది.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర 65వ రోజు బుధవారం నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో సాగింది.

ఈ సందర్భంగా అమ్మగూడెం గ్రామంలో ఒక చోట బత్తాయి తోట కాల్చివేసి ఉండడం గమనించిన షర్మిల పొలంగట్టు మీద నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు. కొండ చిన వెంకటేశం అనే రైతు నీళ్లు లేక ఆ బత్తాయి తోటను తెగనరికి కాల్చివేశాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ నరికివేసిన బత్తాయి తోటను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. ‘‘అమ్మా.. మూడెకరాల్లో 340 బత్తాయి చెట్లు పెట్టిన. తొమ్మిదేళ్లుగా పెంచినా. నిరుడు, ముందటేడు నుంచి కాపుకొచ్చింది. కాపుకొచ్చిన సమయానికి వానలు లేవు... కరెంటు లేదు.. కాయ సైజు తగ్గింది.. దిగుబడిపోయింది. ఈ ఏడాదైతే మొత్తమే ఎండిపోయింది. ఎండిపోయిన తోట ఎందుకని నరికేసిన’’ అని గోగు పెద యాదయ్య కన్నీళ్లు పెట్టాడు.

రూ.10 వేల బిల్లొచ్చింది..
మరో రైతు గోగు కొమరయ్య షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘రూ. 10 వేల కరెంటు బిలొచ్చిందమ్మా.. కట్టమని ఒత్తిడి చేశారు. అంత బిల్లు ఎందుకొచ్చింది అని అడిగినా ఎవ్వరూ పలకలేదు. బిల్లు కట్టలేదు.. రాత్రికి రాత్రే వచ్చి నా మోటారు, స్టాటరు పీక్కపోయిండ్రు. తెల్లారి తోటకు పోతే మోటారు, స్టాటర్ లేదు. దొంగలు తీసుకొని పోయినారు అనుకున్నా.. పొలం ఎండిపోయింది. మూడు రోజులకు కరెంటు సారోళ్లొచ్చి మోటారు, స్టాటర్ మేం తీసుకొని పోయినాం అని చెప్పారు. కడుపు రగిలిపోయిందమ్మా... పొట్టకొచ్చిన సేను ఎండిపోయింది. వీళ్లు మనుషులా అమ్మా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘రెంటు బిల్లు కట్టకపోతే తట్టి చెంబులు, బువ్వసర్వలు, పక్కబట్టలు జప్తు చేస్తామని కరెంటు సారోళ్లు చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొని పోయి నిలబెట్టారు. మర్నాడు ఫైనాన్స్‌ల రూ.3 వడ్డీ కింద అప్పుతీసుకొని కరెంటు బిల్లు కట్టిన’ అని మరో రైతు పర్వతాలు చెప్పడంతో షర్మిల విస్మయానికి గురయ్యారు.

మళ్లీ చంద్రబాబు పాలనా!!
రైతుల బాధలు విన్నాక షర్మిల స్పందిస్తూ.. రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పాలన కనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చంద్రబాబు తన హయాంలో కరెంటు బిల్లులు వసూలు చేయించడానికి రైతులను తీసుకొని పోయి జైళ్లలో పెట్టారు. ఇంట్లో మగవాళ్లు లేకుంటే ఆడవాళ్లను స్టేషన్లకు తీసుకొనిపోయి నిలబెట్టారు. ఈ అవమానం భరించలేక దాదాపు 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన అచ్చం చంద్రబాబు పాలననే తలపిస్తోంది. 

ఇది చంద్రబాబు పరిపాలన రెండో భాగం. తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజలను ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం కుదేలయిపోయింది. వీళ్లకు పోయేకాలం దగ్గరకొచ్చింది. రైతుల ఉసురుతాకి పోతారు. రైతన్నలకు ఒక్క మాట చెప్తున్నాను. మళ్లీ మంచి రోజులు వస్తాయి. జగనన్న త్వరలోనే బయటకు వస్తారు. రైతును రాజుగా చూసుకుంటారు. రాజన్న ఇచ్చిన ఉచిత విద్యుత్తును కొనసాగిస్తారు. అప్పుల నుంచి మీకు విముక్తి కలిగిస్తారు. వడ్డీ లేని రుణాలు అందిస్తారు. అంత వరకు మీరు ఓపిక పట్టండి. దయచేసి ఏ ఒక్కరు కూడా విలువైన మీ భూములను, అంతకంటే విలువైన మీ ప్రాణాలను తీసుకోవద్దన్నా’ అని వారిని కోరారు.

ఢిల్లీ చుట్టూ తిరగడానికే సరిపోతోంది..
‘‘చంద్రబాబు నాయుడుది పదవీ వ్యామోహం. ఆయన ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. కుర్చీ కోసం పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపొడిచిన ఘనుడు ఆయన. వైఎస్సార్ వచ్చాక రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి బాట పట్టించారు. పాలించే రాజు మంచివాడైతే.. దేవుని దయకూడా ఉంటుంది. వర్షాలు సకాలంలో పడుతాయి. పంటలు పండుతాయి. వైఎస్సార్ సువర్ణపాలనలో వర్షాలకు కొదవలేదు.. పంటలు బాగా పండాయి. 

ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత మన రాష్ట్రాన్ని ఈ పాలకులు నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఏవిధంగానైతే కష్టాలు కన్నీళ్లు పెట్టారో ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ అలాంటి పరిస్థితులే వచ్చాయి. ఈ పాలకులకు రైతన్న గోడు పట్టడం లేదు. వీళ్లు పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరిగడమే సరిపోతోంది. ప్రజలను పట్టించుకోని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయవయ్యా చంద్రబాబూ అంటే.. ఆయన కుంటిసాకులు చెప్తున్నారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణల మీద దర్యాప్తులు జరగకుండా ఉండడం కోసం అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

బుధవారం పాదయాత్ర అమ్మగూడెం గ్రామం నుంచి ప్రారంభమైంది. గౌరారం, మారెపల్లి, అన్నారం క్రాస్ రోడ్డు, యాచారం గ్రామాల మీదుగా రామడుగు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. బుధవారం 15.8 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 943.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, తలశిల రఘురాం, జ్యోతుల నవీన్, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు అల్గుబెల్లి రవీందర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, అంజయ్య చౌదరి, మల్లు రవీందర్ రెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

ఖమ్మంలో పదిసీట్లు గెలవాలి

- పార్లమెంటు సీటు కూడా: వైఎస్ విజయమ్మ
- వైఎస్సార్‌సీపీలో చేరిన ఖమ్మం నేతలు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా కలిసికట్టుగా పనిచేసి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలను, ఒక లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలిపించాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పార్టీలో చేరిన సందర్భంగా తన నివాసంలో కార్యకర్తలను ఉద్దేశించి విజయమ్మ మాట్లాడుతూ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరూ తాము ఎదుగుతూ పార్టీకి గౌరవం తెస్తూ ముందుకు సాగాలన్నారు. ఏవైనా పొరపొచ్చాలు ఉంటే వాటన్నింటినీ పక్కన బెట్టాలని, పార్టీ శ్రేణులు ఐకమత్యంగా పనిచేయాలని ఆమె కోరారు. 

అంతకుముందు ఆ ఇద్దరు నేతలూ ఉదయం 10.15 గంటలకు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. తెలంగాణ జిల్లాల్లోనే ఖమ్మం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అగ్రగామిగా ఉండేలా అన్ని సీట్లనూ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాల సాధనకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషికి ప్రభావితుడనై తానూ అందులో పాలుపంచుకోవాలని పార్టీలో చేరానని చెప్పారు. జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. సీజీసీ సభ్యుడు డి.రవీంద్రనాయక్‌తో పాటు ఖమ్మం జిల్లా పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, ఇతర ముఖ్య నేతలు సుమారు 250 మంది ఈ సందర్భంగా హాజరయ్యారు.

వైఎస్సార్‌సీపీలో తుని మాజీ మున్సిపల్ చైర్మన్ చేరిక
తుని మాజీ మున్సిపల్ చైర్మన్ కూసుమంచి శోభారాణి బుధవారం ఉదయం వై.ఎస్.విజయమ్మను కలిసి ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. వై.ఎస్ ఆధ్వర్యంలో తాను మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అవి ముందుకు సాగించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె అన్నారు. తుని నియోజకవర్గం పార్టీ నాయకుడు తాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరారు. లోవ దేవస్థానం చైర్మన్ లాలం బాబ్జి, స్థానిక బీసీ నాయకుడు మాకినీడు గంగారాం కూడా పార్టీలో చేరారు. విజయమ్మ వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!