ప్రజా సమస్యలపై చర్చించడానికి ఈ నెల 20న వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ఉన్నత స్థాయి విసృ్తత సమావేశం జరుగుతుంది. పార్టీ కేంద్ర పాలకమండలి, కార్యనిర్వాహక మండలి సభ్యులు, జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లు, జిల్లాల కోఆర్డినేటర్లు, పరిశీలకులు, అనుబంధ విభాగాల రాష్ట్ర కన్వీనర్లు ఈ సమావేశంలో పాల్గొంటారని పార్టీ సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన ఆమె క్యాంపు కార్యాలయంలో (లోటస్ పాండ్) ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో ప్రధానంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, కరెంటు కష్టాలు, సంక్షేమ పథకాలు నీరుగారుతున్న విధానంపై చర్చలు జరుగుతాయని అన్నారు. సంస్థాగతంగా సభ్యత్వ కార్యక్రమం, పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ కూడా ఈ సమావేశం ఎజెండాలో ఉంటుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment