YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 13 February 2013

మీ నాయన ఉన్నప్పుడే బాగుండె..

 మీ నాయన రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే కాలం బాగుంది. ఇప్పుడేమ బోర్లలో నీళ్లు లేవు. కాల్వలు, చెరువులు ఎండిపోయినయ్. ముసలోళ్లకు పింఛన్లు అందడం లేదు. కరెంటు బిల్లులు కట్టకుంటే మోటార్లు ఎత్తుకెళ్తుండ్రు. గౌర్నమెంటు తీరు పైనపటారం లోన లొటా రం అన్నట్లుగా ఉంది. జగన్ బాబు ముఖ్య మంత్రి అయితేనే మీ నాయన లెక్క మా బతు కుల్లో వెలుగులు నింపుతడనే నమ్మక ముంది.. అని కనగల్ మండలం ఎం.గౌరారం గ్రామ స్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు విన్న వించుకున్నారు. 

ఆమె చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం నాడు కనగల్ మండలం ఎం.గౌరారం గ్రామానికి చేరుకున్నాక అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను షర్మిల ఓపికగా ఆలకించారు. మహిళా సంఘం సభ్యులకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంలేదు. ఆఫీసులో అడిగితే ఇప్పుడు లేవంటుండ్రు.. అని బాణాల రజిత షర్మిల దృష్టికి తీసుకెళ్లింది. మా గ్రామానికి కృష్ణాజలాలు రావడంలేదు. నడుముల లోతు గుంతలు తవ్వి అప్పుడప్పుడూ వచ్చే కొదిపాటి నీటినే తాగుతున్నాం. గ్రామం మీదుగా ఒకే బస్సు నడుస్తుంది. అది వెళ్లిపోయిందంటే తిప్పలే. 

ఆటోల్లో 30 మందిని ఎక్కిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి.. అని గ్రామస్తులు షర్మిలకు వివరించారు. బ్యాంకులో పంట రుణాలు ఇవ్వడంలేదు. ఒకవేళ ఇచ్చినా సగం డబ్బులను ఖాతాలోనే నిల్వ ఉంచుకుంటున్నారు. ఎరువుల ధరలను పెంచిండ్రు. పంట కేమో ధరలేదు. ఇలాగైతే రైతులు బతికేది ఎట్టా.. అని అంజమ్మతో పాటు మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్ కొన్నాళ్లు ఇచ్చి కొట్టేసిండ్రు. రెండేళ్లుగా మండలం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వృద్ధుడు మెండె మల్లయ్య షర్మిల ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. ఊరిలో మురికి కాల్వలు లేవు. రోడ్లు మంచిగా లేవు, లైట్లు వెలగవు, మీరే మా సమస్యలు పరిష్కరించాలమ్మా.. అంటూ తేలుకుంట్ల కళమ్మ, ఇంకొందరు షర్మిలకు విన్నవించుకున్నారు.

అన్నంపెట్టే రైతన్న కన్నీరు పెడితే అరిష్టం
అందరికీ అన్నంపెట్టే రైతన్న కాలం కలిసిరాక, ఎవ్వరూ పట్టించుకోక అప్పులపాలై కన్నీరు పెడుతున్నారని షర్మిల అందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా కనగల్ మం డలం అమ్మగూడెం గ్రామ సమీపంలో నీరులేక రైతు యాదయ్య నరికేసి తగులబెట్టిన బత్తాయి తోటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మగూడెం, కుమ్మరిగూడెం గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రోజుకు రెండు గంట లైనా కరెంటు సరఫరాగాక సుమారు 50 ఎకరాల్లో ఎండిన బత్తాయి తోటలను నరికేశామని తెలిపారు. కరెంటు బిల్లులు కట్టలేదని స్టార్టర్లు తొలగిస్తే నాలుగున్నర మిత్తికి ఫైనాన్సుల్లో వడ్డీకి తెచ్చి బిల్లులు కడుతున్నామన్నారు. ఈ మాటలు విన్న షర్మిల చలించిపోయారు. రైతులకు ఏకష్టం కలగొద్దనే రూ.3000 కోట్లతో రైతు నిధిని ఏర్పాటు చేస్తానని జగనన్న చెప్పారని గుర్తుచేశారు. జగనన్న ముఖ్యమంత్రి అ య్యేదాకే ధైర్యంగా ఉండండి.. పంట పొలాలను అమ్ముకోకండి.. అని షర్మిల రైతులకు సూ చించారు. ఈ పాదయాత్రలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి పద్మ, కేకే మ హేందర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, కట్టెబోయిన నాగరాజు, ఆర్.వెంకన్న పాల్గొన్నారు.

షర్మిలమ్మా.. మీరే దిక్కు
మారేపల్లి గ్రామస్తుల విన్నపం

 మీ నాయన కాలంలో మాకే సమస్యా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం మా ఊళ్లో అన్నీ సమస్యలే. ఏళ్లు గడుస్తున్నా.. తీర్చేవారే లేరు. ఇక మాకు మీరే దిక్కు.. అని షర్మిలను యాచారం గ్రామస్తులు వేడుకున్నారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం కనగల్ మండలం మీదుగా మధ్యాహ్నం అనుముల మండలం మారేపల్లి గ్రామం చేరుకుంది. 

అక్కడి నుంచి సాయంత్రం యాచారం గ్రామానికి చేరుకుని అక్కడ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిలకు తాము ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్తులు వివరించారు. ఏనాడూ సక్రమంగా కరెంట్ సరఫరా కాలేదు. కేవలం రెండు గంటలే వస్తుంది. తాగునీరు వారానికో రోజు వస్తున్నాయి. కరెంటు బిల్లు రూ.300 వస్తుంది.. అని పలువురు షర్మిలకు వివరించారు. సీసీ రోడ్లు లేవు, డ్రెయినేజీ లేదు, వీధి దీపాలు వెలగడం లేదు, బ్యాంకోళ్లు లోన్లు ఇవ్వడం లేదు, వచ్చే ఒక్క బస్సు వేళకు రావడం లేదు, రేషన్ దుకాణంలో పురుగులు బట్టిన బియ్యం ఇస్తున్నారు, పింఛన్లు రావడం లేదని షర్మిల వద్ద గ్రామస్తులు ఏకరువు పెట్టారు. వైఎస్ ఉన్నప్పుడు ఏనాడూ ఇలాంటి ఇబ్బందులు పడలేదని తెలిపారు. 

ఈ ప్రభుత్వానిది శ్రమదోపిడీ..
రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో అండగా ఉపాధి హామీ కూలీలకు రోజుకు 150 రూపాయలు కూలిపడితే నేడు 50 రూపాయలు కూడా రావడం లేదని తెలిపారు. టీడీపీ హ యాంలో రైతులు హింసకు గురయ్యారని తెలిపారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మీ సమస్యలు తీరుతాయని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీసీ సీఈసీ సభ్యులు కేకే మహేందర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, పాదూరి కరుణ, నిజామాబాద్ జిల్లా పరిశీలకులు గాదె నిరంజన్‌రెడ్డి, మైనార్టీ సెల్ కన్వీనర్ సలీం, ఓర్సు శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జగనన్న ముఖ్యమంత్రి అయితే వడ్డీలేని రుణాలు
ప్రజల సంక్షేమాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. కష్టంచేసి కడుపునింపుకునే పేదోళ్ల బతుకుల్లో చీకటి నింపింది.. అని కనగల్ మండలం గౌరారంలో జరిగిన రచ్చబండలో షర్మిల ధ్వజమెత్తారు. పావలా వడ్డీకే రుణాలని మహిళల నుంచి నూటికి రూ.2 నుంచి రూ.3 రూపాయల దాకా అధిక మిత్తీ గుంజుతున్నారని విమర్శించారు. 

ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మీ కష్టాలన్నీ తీరుస్తారు. మహిళలు, రైతులందరికీ వడ్డీలేని రుణాలను అందజేస్తాడు.. అని షర్మిల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాటలను నమ్మొద్దని హితవు పలికారు. కరెంటు బిల్లులు చెల్లించలేక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు మరో మాట మాట్లాడటం చంద్రబాబుకే చెల్లుతుందని ఆమె దుయ్యబట్టారు.

1 comment:

  1. Casino and Hotel Maryland Archives - DRMCD
    Casino and Hotel Maryland Archives. 여주 출장샵 This weekend, a pair of new eateries are opening 파주 출장안마 their 하남 출장안마 doors 군포 출장샵 to casino gaming guests. One of the 영주 출장안마 new eateries is

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!