గుంటూరు సాక్షి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగడంపట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిరోజూ ‘సాక్షి’ పత్రిక, సాక్షి టీవీ చానల్‌పై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా కేంద్రంలో సాక్షి పత్రిక కార్యాలయంపై దాడి జరిగినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘నా పాదయాత్రకు సాక్షి సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదు. సాక్షి విషకన్య వంటిది. గతంలో రాజులు గిట్టని వారిని చంపేందుకు విషకన్యను వాడేవారు. సాక్షి పత్రిక కూడా అలాంటిదే’’ అని మీకోసం పాదయాత్రలో చంద్రబాబు ‘సాక్షి’పై విషం చిమ్మారు. ప్రతి సందర్భంలోనూ ‘సాక్షి’ని దూషించడం సాధారణమైంది. ‘‘సాక్షి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. విలువల్లేవు. నిన్న నా పాదయాత్రకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తే అసలు జనమే లేరన్నట్టు రాశారు. వాళ్లకు కళ్లు కనబడవు. మైకం కమ్మింది..’’ అంటూ ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు. సోమవారం మధ్యాహ్నం గుంటూరు బృందావన్ గార్డెన్స్ సెంటర్‌లో చంద్రబాబు మాట్లాడుతూ కేవలం ‘సాక్షి’ పత్రికపైనే పది నిమిషాలపాటు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈవిధంగా ‘సాక్షి’పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు, విషం చిమ్ముతున్న వైనమే ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి పురికొల్పాయని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్టు కనబడుతోందని విశ్లేషిస్తున్నారు.
Monday, 11 February 2013
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment