తెలుగుదేశం సీనియర్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు బహుశా తన రాజకీయ జీవితంలో మొదటిసారి ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఆయన ఏమైనా మాట్లాడినా ప్రతి విమర్శలు చేసి వదలివేసేవారు. కాని ఈసారి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల సవాల్ చేసి మరీ గాలి ముద్దుకృష్ణమ నాయుడును ఇరుకునపెట్టారు. ముద్దుకృష్ణమ నాయుడు షర్మిల సవాల్ ను స్వీకరించలేదు కాని ఆమె కాళ్లు పట్టుకుంటారా అన్న సవాల్ విసరడాన్ని తప్పు పట్టారు.అసలు విషయానికి వచ్చేసరికి ఇబ్బంది పడ్డారు.షర్మిల కాలికి ఆపరేషన్ జరగలేదని తాను అనలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నోరు జారితే జారవచ్చని, అంతమాత్రం దానికే కాళ్లు పట్టుకోమనడం భావ్యం కాదన్నారు. షర్మిల విసిరిన సవాల్‌ను స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు. ఇంతమాత్రానికి ఆయన ఏవో ఫోటోలు పట్టుకు వచ్చి కుడి కాలు, ఎడమ కాలు అని వ్యాఖ్యానించడం వల్ల పార్టీని ఇబ్బంది లో పెట్టారు. తాను ఇబ్బంది లో పడేవేశారని అనుకోవాలి. ఏది ఏమైనా గాలి ముద్దుకృష్ణమనాయడు ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment