YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 13 February 2013

పిచ్చి ప్రేలాపనలు మానుకో బాబూ!

- లేకుంటే ప్రజలు తరిమికొడతారు 
- దమ్ముంటే అవిశ్వాసం పెట్టు 
- వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్ 

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిచ్చిప్రేలాపనలు మానకుంటే గ్రామాల్లో ప్రజలు తరిమి కొడతారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలో చేపడుతున్న పాదయాత్రలో వైఎస్సార్‌సీపీపై ప్రయోగిస్తున్న పదజాలం అభ్యంతరకరంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారం అనుభవించిన బాబు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు. 

బాబు డిక్షనరీలో నీతి నిజాయితీ అనే పదాలకు అర్థం వేరని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ చంద్రబాబు సీఎం అయ్యాకే భ్రష్టు పట్టిందని, టిక్కెట్లు అమ్ముకోవడం నుంచి అన్నిరకాల అవకతవకలకు కారకుడైన బాబును చూసి నిజాయితీ గలవారెవరైనా సిగ్గుతో తలవంచుకోవాల్సిందేనన్నారు. బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యనిర్వహణ మండలి సభ్యుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ, వైఎస్సార్‌ను ప్రజలు దేవుడిలా చూసుకోబట్టే అన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. 2004, 2009 ఎన్నికల్లో బాబును రాష్ట్ర ప్రజలు పక్కకు నెట్టారని, దానికి ప్రజల్ని కూడా నిందించడం సరికాదన్నారు. ఇదేవిధంగా మాట్లాడితే గ్రామాల్లో తిరగనివ్వరని, రాళ్ళతో కొట్టే పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించారు. విలేకరులసమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వహణమండలి సభ్యుడు కోనరఘుపతి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కు: ఎంపీ మేకపాటి
కందుకూరు: అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైనందునే టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. కందుకూరులో బుధవారం ఆయన విలేక రులతో మాట్లాడారు. ప్రభుత్వ బలం తగ్గినప్పుడు అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టకుండా చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో వీలినం చేసిన తర్వాత బాబు అవిశ్వాసం పెట్టారని మేకపాటి ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!