YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 16 February 2013

జగన్‌ను బయటికి రప్పించకుంటే ప్రజా నిరసన వెల్లువెత్తుతుంది...

ప్రస్తుత జగన్ నిర్బంధం కచ్చితంగా ఆయన రాజకీయ భవిష్యత్తును నీరుగార్చేందుకు జరిగిన కుట్రేనని ఎవరినడిగినా చెపుతాడు. కాని ఇది తాత్కాలికమే. 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్‌ని అందలం ఎక్కించబోతున్నారన్నది ఎవరూ కాదనలేని నిజం. యూపీఏ చేతిలోని కీలుబొమ్మయిన సీబీఐ... జగన్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, తన కంపెనీలలోకి పెట్టుబడులు సంపాదించారని నేరారోపణ చేసి ఆయన్ని అరెస్టు చేసింది. 

ఒకవేళ అదే నిజమైతే పరిశ్రమలలోకి, కంపెనీలలోకి పెట్టుబడులు ఆహ్వానించడం నేరమా? ఆ పరిశ్రమల ద్వారా అనేక వేలమందికి ఉపాధి కల్పించడం నేరమా? జగన్‌కి వ్యతిరేకంగా నిజంగా సీబీఐ దగ్గర తగిన ఆధారాలుంటే వాటిని కోర్టులో ప్రవేశపెట్టి, నేరాన్ని రుజువు చేయవచ్చు కదా! ఆధారాలు, సాక్ష్యాలు సేకరించడానికి ఇన్ని రోజులు కావాలా? ఇంతగా ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ హరించుకుపోతుంటే కోర్టులు ఎందుకని ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి? ఇదీ జవాబు దొరకని ప్రశ్నేనా? కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ఎంతగా నాశనం చేసిందంటే ఒక అసమర్ధుడైన ముఖ్యమంత్రిని నియమించి అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది. బ్రహ్మాస్త్రంలాంటి జగన్‌ను దూరం చేసుకుని, పూచిక పుల్లలాంటి నాయకులను దగ్గరకు తీసుకుంది. ఇది ఆమె రాజకీయ అజ్ఞానానికి, అవగాహనా రాహిత్యానికి చక్కటి నిదర్శనం. ఇప్పటికైనా వాస్తవం గ్రహించి జగన్‌ను ప్రజల్లోకి రప్పించాలి. లేకుంటే ప్రజా నిరసన వెల్లువలో కాంగ్రెస్ కొట్టుకు పోవడం ఖాయం. 

- టి.సుధాకర్‌బాబు, నరసాపురం, ప.గో.జిల్లా

కాంగ్రెస్ పార్టీ జగన్‌ని దూరం చేసుకుంది జగన్ లేని పార్టీకి మేము దూరమయ్యాం

మొదట్నుంచి మాది కాంగ్రెస్ సానుభూతి కుటుంబం. 2003 మహాప్రస్థానం తర్వాత మేము పూర్తిగా డా.వైయస్ రాజశేఖరరెడ్డిగారి అభిమానులమయ్యాం. అందుకు కారణం ఆయన అమలుపరిచిన సంక్షేమ పథకాలే. 2009లో వైఎస్సార్‌గారి మరణం మమ్మల్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. కోట్లాది మంది అభిమానుల్లాగే ఆయనకి కన్నీటి వీడ్కోలుతో మాత్రమే కృతజ్ఞతను చెల్లించుకోగలిగాం. ఆ తర్వాత ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన తండ్రికి ఇచ్చిన మాటపై నిలబడి అధిష్టానం ఆగ్రహాన్ని చవిచూసినప్పుడు. కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజల వద్దకు వచ్చినప్పుడు మేమంతా ఆయన నిర్ణయాన్ని ఆనందంగా స్వాగతించాం. 

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు జరిగిన అవమానాలు, ఆ పార్టీ పెద్దల వల్ల ఆయన పడుతున్న కష్టాలు మా మనసుల్ని నొప్పించాయి. రాష్ట్రప్రజల మనోభావాలను లెక్క చెయ్యకుండా కాంగ్రెస్‌పార్టీ జగన్‌ను దూరం చేసుకుంది. ఆయన లేని పార్టీ మాకెందుకని మేమూ కాంగ్రెస్‌కు దూరం అయ్యాం. దుష్ట కూటమి అయిన టీడీపీ, ఎల్లో మీడియాలు కలిసి అధికార పార్టీతో కుమ్మక్కయి తలోచేయి వేసి ఈరోజున రాజశేఖరరెడ్డి గారి కుటుంబాన్ని చెల్లాచెదురు చేయడం కూడా మా హృదయాలను కలచివేస్తోంది. అయితే ఆ కూటమికి తెలియని సంగతి ఏమిటంటే - ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల మద్దతు జగన్‌కు మాత్రమే ఉంటుందని. చూస్తూ ఉండండి. జగన్‌గారిని ప్రజలు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారు. ఆరోజున రాష్ట్రానికి నిజంగా ‘సువర్ణయుగం’ మొదలౌతుంది. 

- జి.రవికుమార్, బలిజపేట, మురపాక

నక్కజిత్తుల నాయకులంద రినీ...‘జగన్’న్నాథ రథచక్రాలు తొక్కేస్తాయి!

చెడుకాలం దాపురించినపుడు చెట్టుకు కుక్కమూతి పిందెలు కాసినట్లు... రాబోయే కొద్ది నెలల్లో కాంగ్రెస్‌కు, తెలుగుదేశం పార్టీకి, వెన్నుపోటుదారుడు చంద్రబాబునాయుడుకు ప్రజలు ఛీత్కరించుకునే కాలం దాపురించనుంది. అట్టర్ ఫ్లాఫ్ షోని తిలకించి తమ సమయాన్ని, డబ్బును వృథా చేసుకున్నామని థియేటర్ నుంచి బయటకు వస్తున్న సినీ ప్రేక్షకుల్లా, రాష్ట్ర ప్రజానీకం... మహానేత అస్తమయం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఈసడించుకుంటున్నారు. నిస్సిగ్గుగా నిర్లజ్జగా కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు ప్రోత్సహిస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయి. 

అందుకే మహానేత రెక్కల కష్టంతో సంపాదించిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వెనకాడుతున్న తెలుగుదేశానికీ తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞత గల తెలుగు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఓదార్పుయాత్రలో జనంతో మమేకమైన యువనేత, జననాయకుడు అయిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం తహతహలాడుతున్నారు. రాజన్న దయాదాక్షిణ్యాలతో ఎదిగి, నేడు ఆయన్నే దోషిగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేస్తున్న ఈ నాయకులు, నక్కజిత్తుల నారావారు... ‘జగన్’న్నాథ రధచక్రాల కిందపడి నుజ్జునుజ్జయ్యే రోజు ఎంతోదూరంలో లేదు. సంతలో పశువుల్లా అమ్ముడుపోయి అందలమెక్కిన రీల్ హీరోలకు కూడా ప్రజలంతా కలిసి చుక్కలు చూపించే తీర్పు త్వరలోనే వెలువడుతుంది. ఇది తథ్యం.

- అద్దంకి బాబూరావ్, మౌలాలి, హైదరాబాద్

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!