ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజలు నానాకష్టాలూ పడుతున్నారు
అయినప్పటికీ అవిశ్వాసం పెట్టకుండా బాబు పాదయాత్ర డ్రామా ఆడుతున్నారు
నిజంగా ప్రజలపై ప్రేమే ఉంటే ఆయన అవిశ్వాసం పెట్టాలి!
ఈ మాట అడిగితే.. ప్రజల దృష్టి మరల్చడానికి మాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు
చంద్రబాబు అంతటి అవినీతిపరుడు లేడని ఎన్టీఆరే అన్నారు
ఐఎంజీ, ఎమ్మార్‌కు భూములు దోచిపెట్టింది ఆయనే.. అయినా ఆయనపై విచారణ చేయరు.. ఎందుకంటే బాబు చీకట్లో చిదంబరాన్ని కలుస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’సోమవారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 63 కిలోమీటర్లు: 912
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికొదిలేసింది. సంక్షేమ పథకాల్ని తుంగలో తొక్కింది. ఇది చాలదన్నట్లు నిత్యావసరాల ధరలు, కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలూ.. అన్నింటినీ పెంచి సామాన్యుడి బతుకు దుర్భరం చేసింది. ఇంత జరుగుతుంటే.. ఈ ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకొని నిలదీసి అవిశ్వాసం పెట్టాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. పాదయాత్ర అంటూ డ్రామా ఆడుతున్నారు. ఆయన పాదయాత్ర చేస్తున్నది ప్రజల కోసం కాదు.. అధికారం కోసం. ఆయనకు ప్రజల మీద ప్రేమ కంటే కుర్చీ మీద మమకారమే ఎక్కువ. అధికారం కోసం ఏమైనా చేస్తారాయన’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబుకు కావలసినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
ప్రజలపై ఆయనకు నిజంగా ప్రేమే ఉంటే.. అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని వెంటనే దించేయవచ్చు. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయనుగాక చెయ్యను అంటారు. ఆయన అవిశ్వాసం పెట్టనందుకు ప్రతిఫలంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టదు, విచారణ జరుపదు’’ అని అన్నారు. అవిశ్వాసం పెట్టరేమని తాము రోజూ నిలదీస్తున్నందుకు చంద్రబాబు తమ కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని, అవిశ్వాసం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి యత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 63వ రోజు సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు నియెజకవర్గంలో సాగింది. చండూరు మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
బాబు బాగా మ్యానేజ్ చేస్తారు..
‘‘చంద్రబాబు నాయుడు అంత అవినీతిపరుడు ప్రపంచంలోనే ఎవరూ లేరని స్వయంగా ఆయన మామ ఎన్టీఆరే అన్నారు. బాబు అవినీతి గురించి కమ్యూనిస్టులు ఏకంగా ఒక పుస్తకమే రాశారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 850 ఎకరాలను ఎకరం కేవలం రూ.50 వేల చొప్పున కారుచౌకగా ‘ఐఎంజీ భారత’ అనే తన బినామీ సంస్థకు కట్టబెట్టారు. ఇప్పుడు ఎమ్మార్ భూములపై విచారణ జరుగుతోంది. రూ. కోట్ల విలువ చేసే ఆ భూములను అప్పనంగా దోచిపెట్టింది చంద్రబాబే. ఇంతచేసినా.. ఎమ్మార్ కేసులో సీబీఐ చంద్రబాబును కనీసం ప్రశ్నించను కూడా ప్రశ్నించదు. ఎందుకంటే చంద్రబాబు గారు చీకట్లో వెళ్లి చిదంబరాన్ని కలుస్తారు. బాగా మ్యానేజ్ చేస్తారు.’’
63వ రోజు 14.8 కిలోమీటర్ల యాత్ర
సోమవారం 63వ రోజు షర్మిల పాదయాత్ర నల్లగొండ జిల్లా దోనిపాముల నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి బంగారిగడ్డ, అంగడిపేట గ్రామాల మీదుగా చండూరు మండల కేంద్రానికి చేరింది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి కోటయ్య గూడెం మీదుగా ఉడతలపెల్లి గ్రామ శివారులోఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. సోమవారం మొత్తం ఆమె 14.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 912 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఎమ్మెల్యే అమర్ నాథ్‌రెడ్డి, నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, తలశిల రఘురాం, అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, స్థానిక నాయకులు బోయపల్లి అనంత్‌కుమార్, కుంభం శ్రీనివాసరెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.
జనం దృష్టి మళ్లించేందుకే మాపై ఆరోపణలు
‘‘చంద్రబాబు అవిశ్వాసం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాన పెట్టుకొని మోస్తున్నది చంద్రబాబు నాయుడే. ఆయన ఒక రోజు నా భర్త మతం గురించి మాట్లాడుతారు. మరో రోజు నా మోకాలికి గాయమే కాలేదంటారు. ఇప్పుడేమో నా భర్త 70 పడక గదుల ఇల్లు కట్టాడని అంటున్నారు. చంద్రబాబు గారూ.. మాకున్నది నాలుగు పడక గదుల ఇల్లు. ఎవరైనా ఎంసీహెచ్ ప్లాన్ తీసుకొని చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. అయినా చంద్రబాబు నాయుడు గారు నా ఇంట్లో ఎన్ని గదులు ఉంటే మీకెందుకు? ఇదేమైనా జాతీయ సమస్యనా? మీరు మాట్లాడాల్సిన తీరు ఇదేనా? ఇలా మాట్లాడేటప్పుడు మీకు సంస్కారం అడ్డురావడం లేదా? మేం ఏనాడైనా మీ వ్యక్తిగత జీవితం గురించి కాని, మీ కుటుంబం గురించిగానీ మాట్లాడామా? అదీ మా సంస్కారం. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న సంస్కారం మీది.’’

No comments:
Post a Comment