YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 25 October 2012

మధ్య తరగతికి మొండిచేయేనా?: అంబటి


దీపం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ కింద తొమ్మిది సిలిండర్లు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. 1.60 కోట్ల గ్యాస్ సిలిండ ర్ కనెక్షన్లలో దీపం పథకానికి చెందిన 39 లక్ష ల వారికి మాత్రమే సబ్సిడీ ఇస్తే మిగతా పేద, మధ్యతరగతి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తొమ్మిది సబ్సిడీ సిలిండర్లు ఇస్తారన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకట న సైతం ఇక్కడ అమలుకు నోచుకోవడం లేదన్నారు. అంబటి గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దీపం లబ్ధిదారులు ఏటా ఆరు సిలిండర్లలోపే వాడుతుండగా వారికి మరో మూడు సిలిండర్లు ఇస్తామంటూ... నిజంగా ఎక్కువ సిలిండర్లు వాడే పేద, మధ్యతరగతి వారికి మొండిచేయి చూపడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుతున్న సంక్షేమ హాస్టళ్ల విషయంలోనూ సర్కారు అదే మొండివైఖరితో ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే బొటాబొటి మెస్‌చార్జీలు ఇక గ్యాస్‌కే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారని ‘మనసులో మాట’ పుస్తకంలో రాసిన చంద్రబాబు ఇప్పుడు 10 సబ్సిడీ సిలిండర్లు ఇస్తామనటం ఎవరిని మోసం చేసేందుకుని ప్రశ్నించారు. అధికారంలోకి వ చ్చాక తొలి సంతకం రుణమాఫీపై చేస్తానంటున్న చంద్రబాబు... ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందనే విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!