|
Tuesday, 2 October 2012
జగన్ కోసం - 16 (పాఠకుల స్పందన) sakshi
ప్రజల సొమ్ముతో సోకులా?
ప్రజలను ఖర్చులు తగ్గించుకోవాలని నీతులు చెప్పే నేతలు....తమ వరకూ వచ్చేసరికి మాత్రం వాటిని గాల్లోకి వదిలేయటం పరిపాటిగా మారిపోయింది. రాయితీలు ఇవ్వడానికి డబ్బులు చెట్లకు కాయవు కదా అని ప్రశ్నించే నేతలు... ప్రజల సొమ్ముతో నిసిగ్గుగా విదేశీ పర్యటనలు పేరుతో కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం పరిపాటిగా మారిపోయింది. నాటి ప్రజాసేవకులు ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ నేటి పాలకులు ఆ చరిత్రను తిరిగరాస్తున్నారు. ప్రజల సొమ్ముతో సోకులు ఎలా చేసుకోవచ్చో నిరూపిస్తున్నారు. విదేశీ పర్యటనల కోసం కోట్లాది రూపాయిల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. విదేశాల్లో జరిగే అంతర్జాతీయ మహాసభలకు ఆయా ప్రభుత్వ శాఖల తరఫున మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రతినిధి బృందాలు జరిపే పర్యటనలకు వ్యయం తడిసి మోపెడు అవుతోంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు జరిపే ఖర్చుల వివరాలు పరిశీలిస్తే ప్రజా ధనాన్ని పాలకులు నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తున్నారన్న వాస్తవం వెల్లడి అవుతుంది. మన కేంద్రమంత్రులు 2011-12 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పర్యటనల నిమిత్తం ఖర్చు చేసిన మొత్తమెంతో తెలుసా? ఏకంగా 687 కోట్ల రూపాయలు. నోళ్లు వెళ్లబెట్టకండి... సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన సమాచారమిది. ఈ మేరకు పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ దగ్గర ప్రస్తావిస్తే ఆయన గట్టిగా సమర్థించుకొచ్చారు. ఇవన్నీ అధికారిక పర్యటనలనీ, ఇష్టమున్నా... లేకపోయినా అవసరం మేరకు వెళ్లారని అన్నారు. విదేశీ పర్యటనల మూలంగా నిద్రాహారాల్లో తేడా వస్తుందని, ఆరోగ్యం దెబ్బతింటుందని, కుటుంబంతో గడపలేమని... ఇలా అన్నీ దెబ్బతింటాయని చెప్పుకోచ్చారు. విదేశీ పర్యటనలకు వెళ్లడం అంత తేలిక కాదన్నారు. కుటుంబాన్ని వదిలి తరచూ పర్యటనలకు వెళ్లడం ఎవరికీ ఇష్టముండదని, అధికారిక విధుల దృష్యా వెళ్లాల్సి ఉంటుందని, వారేమీ విహార యాత్రలకు వెళ్లడం లేదని ఎదురు దాడికి దిగటం గమనార్హం. అంతకుముందు సంవత్సరంలో (2010-11లో) మంత్రుల విదేశీ పర్యటనల ఖర్చు కేవలం 56 కోట్లే ఉండటం గమనార్హం. ఇదిలాఉంటే దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా దేవీ పాటిల్ విదేశీ పర్యటనల వ్యయం వింటే కళ్లు తిరుగుతాయి. ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా పనిచేసిన అయిదేళ్లలో ఆమె విదేశీ పర్యటనల ఖర్చు 205 కోట్లుపైనే అయింది. ప్రతిభాపాటిల్ మొత్తం 12 సార్లు 22 దేశాల్లో పర్యటనలు జరిపారు. ఆమె పర్యటనల కోసం ఎయిరిండియాకు అయిన ఖర్చు 169 కోట్ల రూపాయిలు. రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. వాటికయిన ఖర్చును ప్రత్యేకంగా చూపారు. అలాగే, రాష్ట్రపతి వెంట బంధు మిత్రులు విదేశీ పర్యటనలకు వెళ్ళడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. హర్యానాలోని హిస్సార్ కు చెందిన ఓ యువకుడు సమాచార హక్కు చట్టం ద్వారా ఈసమాచారాన్ని సేకరించారరని, స్థానిక పత్రికలో ప్రచురితమైందని.... తన ఆరోపణలకు మూలాధారం ఇదేనని మోడీ తెలిపారు. కేవలం ఒక ఎంపీగా ఉన్న సోనియాగాంధీ ప్రధాని, రాష్ట్రపతుల కోసం వినియోగించే ప్రత్యేక విమానంలో విహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన ప్రత్యేక హోదా ఏంటని ప్రశ్నించారు కూడా. అయితే మోడీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చటం విశేషం. కాగా ప్రభుత్వ శాఖల్లో దుబారాని తగ్గించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాలన్నీ ఆరంభశూరత్వాలే అయ్యాయి. ముఖ్యంగా మంత్రుల పర్యటనలు, ఐదు నక్షత్రాల హోటళ్ళలో సభలూ, సమావేశాల పేరిట ప్రభుత్వ శాఖల్లో ఎంతో దుబారా అవుతోంది. కేంద్ర మంత్రుల విదేశీ పర్యటనలకు అయ్యే వ్యయం ఒక్క ఏడాదిలోనే పది రెట్లు పెరిగింది. 2010-11లో అది 56 కోట్ల 12 లక్షలు ఉండగా, 2011-12లో అది 678కోట్ల 52 లక్షలకు పెరిగింది. ఎయిరిండియాకు చెల్లించవలసిన బకాయిలు మొత్తం 499 కోట్ల 89 లక్షలకు చేరుకుంది. విదేశీ పర్యటనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా పాలకులు మాత్రం వాటిని లైట్ గా తీసుకోవటం సిగ్గుచేటు. అందుకే అంటారేమో సొమ్మొకడిది.....సోకొకడిది అని. source: sakshi |
గాంధీజీకి నివాళులర్పించిన విజయమ్మ
పులివెందుల : గాంధీ జయంతి సందర్బంగా వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. అనంతరం విజయమ్మ అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఇవాళ, రేపు పులివెందులలోనే ఉండి విజయమ్మ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతారు.
హైదరాబాద్: జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులుఅర్పించారు ఆ పార్టీ నేతలు. దేశ ప్రజలు గాంధీ మార్గంలో పయనించాలని ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. గాంధీ సిద్ధాంతాలను విదేశాల్లో కూడా పాటిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ గాంధీ మార్గంలో పయనించినప్పుడే శాంతి వర్ధిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి , యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్ రెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. |
బాబును చూస్తే జాలేస్తోంది: మేకపాటి
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును చూస్తే జాలేస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే వైఎస్ ను కొలిచినట్లు .....బాబును కూడా ప్రజలందరూ దేవుడిలా కొలిచేవారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.
ప్రజల విశ్వసనీయత కోల్పోయిన తర్వాత ఎన్ని పాదయాత్రలు చేసినా లాభంలేదని ఎంపీ వ్యాఖ్యానించారు. నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లాలే గానీ..ప్రజలను ఎలా మభ్య పెట్టాలా అని సినిమా డైరక్టర్లు దగ్గర సలహాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మేకపాటి తెలిపారు.
source:sakshi

Monday, 1 October 2012
గాంధీజీకి వైఎస్ఆర్ సీపీ నేతల నివాళి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను పార్టీ నేతలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి , పలువురు ముఖ్యనేతలు హాజరై జాతిపితకు నివాళులు అర్పించారు.
అనంతరం ఎంపీ మేకపాటి మాట్లాడుతూ గాంధీ వారసులమని చెప్పుకునే కొంతమంది నేతలు ఆయన ఆశయాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. గాంధీ మార్గాన్ని అందరూ అనుసరిస్తే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోసం చాలా అవస్థలు పడుతున్నారని, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాక ఎన్ని యాత్రలు చేసినా ఎవరూ నమ్మరని మేకపాటి వ్యాఖ్యానించారు

ధర్మానను వదిలేశారేం? నన్ను మాత్రమే అరెస్టు చేస్తారా?andhrajyothy
ధర్మానను వదిలేశారేం?
నన్ను మాత్రమే అరెస్టు చేస్తారా?
మాజీ మంత్రిని.. నేనేం చేయగలను
నిర్ణయాలకు కేబినెట్‌ది సమష్ఠి బాధ్యత
అయినా సీబీఐ నా వెంటే పడుతోంది
బెయిల్ కోరుతూ మోపిదేవి ఆరోపణలు
అయినా సీబీఐ నా వెంటే పడుతోంది
బెయిల్ కోరుతూ మోపిదేవి ఆరోపణలు
మంత్రిగా తీసుకు న్న నిర్ణయాలకు, కేబినెట్ సమష్టి బాధ్యత వహించాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, దానికి భిన్నంగా సీబీఐ కేవలం తనొక్కడినే బాధ్యుడిగా చూపే ప్రయత్నం చేస్తోందని వాపోయారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి ద్వారా ఆయన నాంప ల్లి సీబీఐ కోర్టుకు వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తు ఎలా సాగుతోందో కోర్టు గమనించాలని కోరారు. "ఈ కేసులో నిందితుడుగా ఉన్న మోపిదేవి, ఇతర నిందితులతో కలిసి కుట్రకు పాల్పడ్డార ని సీబీఐ ఆరోపించింది. మొత్తం నిందితులందరిపై నా ఒకే రకమైన అభియోగాలు చేసినా, నా క్లయిం ట్ ఒక్కరిపైనే దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది.
వాన్‌పిక్ పోర్ట్స్‌కు బదులు, నిమ్మగడ్డ ప్రసాద్ సొంత సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు 18,878 ఎకరాలు కేటాయించడంలో ఏ5గా ఉన్న అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన నేటికీ అరెస్టు కాలేదు. ఆయనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సీబీఐ మాత్రం మోపిదేవిని అరెస్టు చేసి, జైల్లో పెట్టింది. బెయిల్ పిటిషన్ వేసినపుడల్లా.. సాక్ష్యాలు తారుమారు చేస్తారని అడ్డుపడుతోంది. మాజీమంత్రిగా ఉన్న ఆయనే సాక్ష్యాలు తారుమా రు చేస్తారంటూ.. ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తిని మాత్రం సీబీఐ ఏమీ అనడం లేదు. భూకేటాయింపులకు ఆయన కూడా బాధ్యత వహించాలి కదా!'' అని డిఫెన్స్ న్యాయవాది విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ సొంత డబ్బుతో భూములు కొన్నారని, ప్రభుత్వానికి ఏమీ నష్టం జరగలేదని వ్యాఖ్యానించారు.
అది సమష్టి బాధ్యత..
మోపిదేవి న్యాయవాది తన వాదన కొనసాగిస్తూ.. "వాన్‌పిక్ విషయంలో నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదించినవే! కాదని ఏ మంత్రి అయినా సీబీఐకి చెప్పారా? రాయితీ ఒప్పందం గురించి కేబినెట్‌కు తెలియదని సీబీఐ ఎలా చెబుతుంది? ఏదో ఊహించుకుంటూ సీబీఐ చేస్తున్న ఆరోపణలవి. కేబినెట్ నిర్ణయాలకు మంత్రి మండలి సమష్టి బా ధ్యత వహించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ సీబీఐ మాత్రం ఒక్క మోపిదేవినే తప్పుబడుతోం ది'' అన్నారు. మోపిదేవి నాలుగున్నర నెలలుగా జైలులో ఉన్నారని, దర్యాప్తునకు సహకరిస్తారని.. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని మోపిదేవికి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. సీబీఐ తన వాదన వినిపించేందుకు సమయం కోరగా.. జడ్జి కేసును బుధవారానికి వాయిదా వేశారు.
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/oct/2/main/2main5&more=2012/oct/2/main/main&date=10/2/2012
బినామీని ముందుకు తెచ్చి ఆదేశాలు రాకుండా అడ్డుకున్న బాబు
ఆశ్చర్యపోయిన ధర్మాసనం.. నోటీసులు ఇచ్చామని స్పష్టీకరణ
తనకు అందలేదన్న బిల్లీరావు... కోరిన గడువునిచ్చిన ధర్మాసనం
కేసు విచారణ జరుగుతుండగా ఆరు నెలలుగా బిల్లీరావు మౌనం
సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలిచ్చే కీలక సమయంలో ప్రత్యక్షం
బినామీని ముందుకు తెచ్చి ఆదేశాలు రాకుండా అడ్డుకున్న బాబు
జీవో 310పై పిటిషన్‌ను సింగిల్ జడ్జి వద్దకు తెప్పించే యత్నాలు
అవసరమైతే మరోసారి ‘నాట్ బిఫోర్’ నాటకాలకూ బాబు సిద్ధం
హైదరాబాద్, న్యూస్‌లైన్: వేల కోట్ల రూపాయల విలువ చేసే ఐఎంజీ భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుటిల యత్నాలు మొదలుపెట్టారు. అంతర్జాతీయంగా క్రీడలతో ఏ మాత్రం సంబంధం లేని ఐఎంజీ అకాడమీకి వేల కోట్ల రూపాయల విలువైన 850 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టటంతో పాటు, ఇందుకు సంబంధించి జరిగిన చీకటి ఒప్పందాలపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించనున్న నేపథ్యంలో చంద్రబాబు తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబలరావు ద్వారా పావులు కదిపారు. అందులో భాగంగా సోమవారం తొలి అంకం మొదలైంది.
ఐఎంజీ కేసు విచారణకు వచ్చి ఆరు మాసాలు దాటినా ఇప్పటివరకూ మౌనంగా ఉన్న బిల్లీరావు.. తీరా ఇప్పుడు తనకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసు అందలేదంటూ హైకోర్టుకు చెప్పటం గమనార్హం. రెండు వారాల గడువు ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తానని కూడా ఆయన చెప్పారు. దీనికి న్యాయస్థానమూ అంగీకరించింది. తద్వారా చంద్రబాబు విజయవంతంగా తన బినామీ ద్వారా సోమవారం సీబీఐ దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా అడ్డుకోగలిగారని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు ఈ కేసును సాగతీసేందుకు, దర్యాప్తుకు ఆదేశాలు రాకుండా ఉండేందుకు అవసరమైన మార్గాలను ఆయన అన్వేషిస్తున్నారని ఈ కేసును దగ్గరగా గమనిస్తున్న న్యాయనిపుణులు చెప్తున్నారు.
ఐఎంజీ భూముల కేటాయింపు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం 2006లో సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ జీవో 310 జారీ చేసినా, సీబీఐ ఇప్పటి వరకు దర్యాప్తు ప్రారంభించలేదని, ఈ వ్యవహారంలో వెంటనే దర్యాప్తు ప్రారంభించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డిలు ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో న్యాయవాది టి.శ్రీరంగాారావు కూడా మరో పిల్ దాఖలు చేశారు. ఐఎంజీబీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాలు, కల్పించిన రాయితీలు తదితర అంశాలపై సీబీఐ జరిపే దర్యాప్తును పర్యవేక్షించేలా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ను ఆదేశించాలని ఎ.బి.కె ప్రసాద్, విజయసాయిరెడ్డిలు తమ వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు.
ఈ మొత్తం వ్యవహారంలో వెంటనే ప్రాథమిక విచారణ చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని శ్రీరంగారావు తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ రెండు వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్, న్యాయమూర్తి జస్టిస్ విలాస్‌అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర హోంశాఖ, సీబీఐ తమ తమ కౌంటర్లు దాఖలు చేశాయి. కోర్టు ఆదేశిస్తే ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. అయితే దర్యాప్తుకు సంబంధించి సోమవారం (అక్టోబర్ 1న) తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం గత విచారణ సమయంలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందని ఎదురుచూశారు.
నోటీసులిచ్చాం కదా...
సోమవారం కేసు విచారణకు రాగానే అందరికన్నా ముందు బిల్లీరావు తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ లేచి నిల్చున్నారు. తమకు ఇంత వరకు హైకోర్టు జారీ చేసిన నోటీసు అందలేదని చెప్పారు. అందువల్ల తమకు రెండు వారాల సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులతో పాటు ధర్మాసనం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ‘నోటీసులు అందకపోవటం ఏమిటి..? ఈ కేసులో మీతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశాం. వారు తమ తమ కౌంటర్లు కూడా దాఖలు చేశారు. ఈ రోజు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా చెప్పాం’ అని ధర్మాసనం పేర్కొంది. నోటీసులు అయితే తమకు అందలేదని, అందుకే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరుతున్నామని వెంకటరమణ చెప్పారు.
దీంతో ఇరువురు న్యాయమూర్తులు కూడా కొద్దిసేపు తమలో తాము చర్చించుకున్నారు. తరువాత పిటిషనర్ల స్పందన కోరారు. శ్రీరంగారావు తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు స్పందిస్తూ.. ఇప్పటికే సీబీఐ కౌంటర్ దాఖలు చేసి, దర్యాప్తు చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేసిం దని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో కూడా ఇరువురు న్యాయమూర్తులు చర్చించుకుని, కౌంటర్ దాఖలు చేసేందుకు బిల్లీరావుకు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. కౌంటర్ దాఖలు చేయగానే, దాని కాపీని పిటిషనర్లకు అందచేయాలని వెంకటరమణను ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ అందుకోగానే, దానికి తిరుగు సమాధానం (రిప్లై) కూడా ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తం రెండు వార్లాలో పూర్తి కావాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఇరుపక్షాలకు స్పష్టం చేసింది.
‘బిల్లీ’కి ఇప్పుడే గుర్తొచ్చిందా..?
ఈ కేసులో బిల్లీరావు ఆకస్మికంగా తెరపైకి వచ్చి.. కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం కోరడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయకుండా అడ్డుకునేందుకేనని వారు చెప్తున్నారు. వాస్తవానికి ఎ.బి.కె.ప్రసాద్, విజయసాయిరెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని ఈ ఏడాది మార్చి 1న హైకోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం తరచుగా విచారణకు వస్తూనే ఉంది.
హైకోర్టు కొత్త తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బాధ్యతలు చేపట్టిన తరువాత అన్ని ప్రయోజనాల వ్యాజ్యాల్లో లానే ఈ కేసులో కూడా విచారణ వేగవంతమైంది. కేసును లోతుగా విచారించిన ధర్మాసనం, జూలై 27న ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ డెరైక్టర్, ఐఎంజీ అకాడమీస్ డెరైక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ‘మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ కేసులో బిల్లీరావు తరఫు న్యాయవాది కోర్టు ముందు హాజరు కాలేదు. కనీసం విచారణనూ పరిశీలించలేదు. అంటే ఆరునెలల కాలంగా బిల్లీరావు మౌనంగా ఉన్నారన్న మాట. అంటే ఓ వ్యూహం ప్రకారమే బిల్లీరావు మౌనంగా ఉన్నారు.
ఈ కేసులో తన వాదనలు వినిపించాలని బిల్లీరావుకు ఉండి ఉంటే.. నోటీసులు జారీ చేసే రోజునో, లేకపోతే తదుపరి విచారణ సమయంలోనో తనకు నోటీసులు అందలేదన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చి, కౌంటర్ దాఖలుకు సమయం కోరేవారు. ఎప్పుడైతే ఈ కేసులో దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధమని సీబీఐ చెప్పిందో, తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసిందో, అప్పుడే చంద్రబాబు తన బినామీ బిల్లీరావును రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఈ కేసులో జరగబోయే పరిణామాలన్నింటినీ బాబు అండ్ కో వివరించటంతో బిల్లీరావు మేల్కొన్నారు. అందులో భాగంగానే జీవో 310ని కొట్టివేయాలంటూ గత వారం హైకోర్టులో ప్రత్యేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేయిం చారు’ అని ఓ సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు.
source:Sakshi

పథకం ప్రకారమే ‘సాక్షి’ వాహనంపై దాడి
వద్దని బతిమాలిన సాక్షి టీవీ టెక్నికల్ అసిస్టెంట్, డ్రైవర్‌పై దౌర్జన్యం
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నాయకత్వంలో ర్యాలీగా వచ్చి మూకుమ్మడి దాడి
టైర్లలో గాలి తీసి, పెట్రోల్ ట్యాంక్‌లో నిప్పుపెట్టిన ఆందోళనకారులు
వీడియో దృశ్యాల ఆధారంగా దౌర్జన్యకారులను గుర్తించనున్న పోలీసులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ మార్చ్ సందర్భంగా ఆదివారం సాయంత్రం కొందరు ఆందోళనకారులు పథకం ప్రకారమే మీడియా వాహనాలపై దాడులు చేసి తగులబెట్టారు. తాము మార్చ్‌ను కవర్ చేయటానికి వచ్చామని తమ వాహనాన్ని ధ్వంసం చేయవద్దని వేడుకున్న సాక్షి టీవీ డీఎస్‌ఎన్‌జీ వ్యాన్ డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్‌లపై వారు దౌర్జన్యానికి దిగి గాయపరిచారు. తెలంగాణ మార్చ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సాక్షి టీవీ డీఎస్‌ఎన్‌జీ వాహనంతో సిబ్బంది బయలుదేరి వెళ్లారు.
కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా నెక్లెస్ రోడ్డులో మీడియాకు కేటాయించిన ప్రాంతంలో ఈ వాహనాన్ని పార్క్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే దాదాపు వంద మంది మూకుమ్మడిగా వచ్చి అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలపై దాడి చేశారు. టైర్లలో గాలి తీసేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ ట్యాంక్ తెరిచి నిప్పుపెట్టారు. మధ్యాహ్నం నుంచే వేలాది మంది తెలంగాణవాదులు నెక్లెస్ రోడ్డు మార్గంలోనే ఉన్నా ఏ ఒక్కరూ మీడియా వాహనాలవైపు కన్నెత్తి చూడలేదు. కానీ.. అకస్మాత్తుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు తన అనుచరులతో కలిసి మార్చ్ జరుగుతున్న ప్రాంతానికి ర్యాలీగా వచ్చారు. వచ్చిన వెంటనే వారు సభాస్థలి వైపు వెళ్లకుండా మీడియా వాహనాల వైపు వచ్చారు.
ముందుగా దూరదర్శన్‌తో పాటు మరో ప్రైవేట్ మీడియా డీఎస్‌ఎన్‌జీ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ పక్కనే ఉన్న సాక్షి టీవీ వాహనాన్ని ధ్వంసం చేశారు. దాదాపు వంద మంది ఒకేసారి దాడికి దిగటంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆ తరువాత ఆందోళనకారులు వాహనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో దృశ్యాల ఆధారంగా పోలీసులు దౌర్జన్యకారులను గుర్తించనున్నారు. వీడియో టేపులను పరిశీలిస్తున్నామని, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నాయకత్వంలో ర్యాలీగా వచ్చి మూకుమ్మడి దాడి
టైర్లలో గాలి తీసి, పెట్రోల్ ట్యాంక్‌లో నిప్పుపెట్టిన ఆందోళనకారులు
వీడియో దృశ్యాల ఆధారంగా దౌర్జన్యకారులను గుర్తించనున్న పోలీసులు
కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా నెక్లెస్ రోడ్డులో మీడియాకు కేటాయించిన ప్రాంతంలో ఈ వాహనాన్ని పార్క్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే దాదాపు వంద మంది మూకుమ్మడిగా వచ్చి అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలపై దాడి చేశారు. టైర్లలో గాలి తీసేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ ట్యాంక్ తెరిచి నిప్పుపెట్టారు. మధ్యాహ్నం నుంచే వేలాది మంది తెలంగాణవాదులు నెక్లెస్ రోడ్డు మార్గంలోనే ఉన్నా ఏ ఒక్కరూ మీడియా వాహనాలవైపు కన్నెత్తి చూడలేదు. కానీ.. అకస్మాత్తుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు తన అనుచరులతో కలిసి మార్చ్ జరుగుతున్న ప్రాంతానికి ర్యాలీగా వచ్చారు. వచ్చిన వెంటనే వారు సభాస్థలి వైపు వెళ్లకుండా మీడియా వాహనాల వైపు వచ్చారు.
ముందుగా దూరదర్శన్‌తో పాటు మరో ప్రైవేట్ మీడియా డీఎస్‌ఎన్‌జీ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ పక్కనే ఉన్న సాక్షి టీవీ వాహనాన్ని ధ్వంసం చేశారు. దాదాపు వంద మంది ఒకేసారి దాడికి దిగటంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆ తరువాత ఆందోళనకారులు వాహనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో దృశ్యాల ఆధారంగా పోలీసులు దౌర్జన్యకారులను గుర్తించనున్నారు. వీడియో టేపులను పరిశీలిస్తున్నామని, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
సినిమా డైరెక్షన్ అవసరమా..!
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి స్పందించే గుణముండాలి
ఏం గుర్తు చేయాలని పాదయాత్ర చేస్తున్నారు?
మీ పాలనను చెప్పి భయపెట్టదల్చుకున్నారా?
మీ యాత్రతో కరువొస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు
హైదరాబాద్, న్యూస్‌లైన్:
మనసున్న నాయకునికి సహజంగా స్పందించే గుణం ఉంటుందని, ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకోవాలన్న తపన ఉన్న నాయకుడెవరూ సినిమా దర్శకులతో పాఠాలు చెప్పించుకోరని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సోమవారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకోవాలన్న నాయకునికి సినిమా వారి డెరైక్షన్ అవసరమా? సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి ప్రజలను ఏవిధంగా కలుసుకోవాలి? వారి భుజాల మీద ఎలా చేతులు వేయాలి? వారిని ఎలా దగ్గరకు తీసుకోవాలి? రెండు వేళ్లు చూపి బెదిరిస్తున్నట్లుగా మాట్లాడకూడదు... వంటి అంశాలపై సినిమా డెరైక్టర్ల వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా?’’ అని విస్మయం వ్యక్తం చేశారు. ‘వస్తున్నా... మీకోసం..’ అనే పేరుసైతం ప్రజలను బెదిరిస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు పాదయాత్రపై ప్రజలకు అనేక సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయని, వాటన్నింటినీ ఆయన నివృత్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.
టీడీపీ ఔట్‌డేటెడ్: తెలుగుదేశం పార్టీ ఒక కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ డేటెడ్) ఔషధం లాంటిదని, అందుకే ప్రజలు పలుమార్లు తిరస్కరించారని వారు అభివర్ణించారు. అదే రిజెక్ట్ చేసిన ప్రాడక్ట్ (టీడీపీ)ని అదే పాత సేల్స్‌మెన్ (బాబు) మార్కెటింగ్ చేసుకోవడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు వర్షానికి పేటెంట్‌గా వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, కరువుకు పేటెంట్‌గా చంద్రబాబును చెప్పుకుంటారనీ... ఇపుడు బాబు పాదయాత్ర చేస్తే కరువు వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కేటాయించినపుడు... ఫ్యాన్‌కు కాలం చెల్లిందనీ, ఇపుడందరూ ఏసీలు వాడుతున్నారని బాబు వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.
ప్రతి ఇంటిలోనూ ఫ్యాన్, ప్రతి గుండెలో వైఎస్సార్ కొలువు తీరి ఉన్నారన్న విషయం పాదయాత్రలో బాబుకు తెలిసొస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్ని అక్రమంగా వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని జైలుకు పంపిన చంద్రబాబు ప్రతిదానికీ ఆయననే విమర్శిస్తూ కాలం గడుపుతున్నారని చెప్పారు. బాబుకు దమ్ముంటే తనపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన బలంతో కాపాడుతూ, అదే పార్టీని విమర్శిస్తూ బాబు ప్రజల్లోకి ఎలా వెళతారని నిలదీశారు. మహాలయ పక్షంలో ప్రారంభిస్తున్న పాదయాత్ర బాబుకు ఏ మాత్రం కలిసి రాదని అమరనాథరెడ్డి చెప్పారు. మంగళవారం, మహాలయ పక్షంలో పాదయాత్ర చేస్తే దేవతలు ఆశీర్వదించరని, క్షుద్ర దేవతలు ఆశీర్వదిస్తారని విమర్శించారు. ప్రశాంతంగా తెలంగాణ మార్చ్ చేసుకుంటున్న వారిని ఇబ్బందులు పెట్టడం సరైన చర్య కాదని, ఇది అక్షరాలా ప్రభుత్వ వైఫల్యమేనని శోభ చెప్పారు.
చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ప్రశ్నాస్త్రాలు...
తన తొమ్మిదేళ్ల పాలనను గుర్తు చేయడానికి ప్రజల వద్దకు వెళుతున్నానని చెబుతున్న బాబు పాదయాత్రలో ఏం చెప్పబోతున్నారని శోభానాగిరెడ్డి, అమరనాథరెడ్డి ప్రశ్నించారు. బాబుపై వారు సంధించిన ప్రశ్నాస్త్రాలివీ...
ఉచిత విద్యుత్ ఇస్తానని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించినపుడు... అది సాధ్యంకాదని, కరెంటు తీగలపై బట్టలారేసుకోవడానికి తప్ప దేనికీ పనికి రావని ఎగతాళి చేసిన విషయం ప్రజలకు గుర్తు చేస్తారా?
ఒక హెచ్‌పీ మోటారుకు రూ.50 వసూలు చేయాలని ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో తొక్కి రైతులను వేధించిన విషయం గుర్తు చేస్తారా?
మీ పాలనలో ఏటా కరెంటు చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేస్తారా? బిల్లులు కట్టలేని రైతులను అరెస్టు చేసి బేడీలు వేసిందీ గుర్తు చేస్తారా?
చార్జీలు పెరిగినందుకు నిరసనగా బషీర్‌బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న విషయాన్ని చెబుతారా?
ఈ ఉద్యమంలో గాయపడిన పోలీసులను పరామర్శించి... క్షతగాత్రులు, మృతిచెందిన వారి కుటుంబాలను పట్టించుకోని విషయాన్ని వివరిస్తారా.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వని విషయాన్నీ గుర్తు చేస్తారా?
ప్రతిపక్షంలో కూర్చోడానికైనా సిద్ధం... కానీ ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ సంఘాన్ని నియమించే ప్రసక్తే లేదని మళ్లీ వారికి గుర్తు చేయడానికే పాదయాత్రకు వెళుతున్నారా?
ప్రపంచబ్యాంకు విధానాల అమలుకు కంకణం కట్టుకున్న వ్యక్తిగా చెప్పుకుంటారా?
ఎన్టీఆర్ తన తొలి సంతకంతో ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యం ధరను 2 నుంచి 5 రూపాయలకు పెంచానని పేదలకు గుర్తు చేస్తారా?
ప్రపంచంలో ఏ ఇజమూ లేదు, టూరిజం తప్ప అని కమ్యూనిస్టులను తూర్పారబట్టి అధికారం పోయాక మళ్లీ వారితో కలిసేందుకు తహతహలాడుతున్నానని చెబుతారా?

జగన్ కోసం - 15 (పాఠకుల స్పందన)sakshi
జగన్ ఒక సంస్కారం గల వ్యక్తి. మాట తప్పని, మడిమ తిప్పని మనీషి. ఆయన సహనం, హుందాతనం, వ్యవహార శైలి, దక్షత ఈ దేశంలో ఏ పార్టీ నేతకూ లేవంటే అతిశయోక్తికాదు. అట్టి నాయకుణ్ణి చూసి ఓర్వలేక అణచి వేసే ప్రక్రియలో అన్యాయంగా, అక్రమంగా జైలు పాలు చేయడం అధికార పార్టీ నేతల సంకుచిత బుద్ధికి, వారి ఈర్ష్యకు నిదర్శనం.
అక్రమాస్తులు!...అక్రమాస్తులు...అని అదే పనిగా దండోరా వేస్తున్న బడా నాయకులకు ఈ ప్రజలను తప్పుదారి పట్టించడమే తెలిసిన విషయం. తన తండ్రి వై.యస్.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కేవలం ఒక వ్యాపార వేత్త మాత్రమే కదా! కొన్ని ధనిక వర్గాలు ధనిక సంస్థలు, వ్యాపార వేత్తలు జగన్ వ్యాపార దక్షతను నైపుణ్యాన్ని గుర్తించి ఆయన వ్యాపారంలో పెట్టు బడులు పెడితే అక్రమమా? వ్యాపారం అభివృద్ధి చెందితే అక్రమాస్తులు ఎలా అవుతాయి? వ్యాపారి లక్ష్యం లాభమే కదా! ఆయన అందరి కంటే ముందే తన ఆదాయం పన్ను కట్టిన శ్రేష్టమైన భారత పౌరుడు.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం సమష్టిగా తీసుకున్న నిర్ణయాలను ప్రశించే అధికారం ఏ ప్రభుత్వ సంస్థలకైనా, న్యాయస్థానాలకైనా ఉంటుందా? ముఖ్యంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా, అభివృద్ధి దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను ఎవరు ప్రశ్నించగలరు? దీనికి రాజ్యాంగం ఏమి సమాధానమిస్తుందనేది పెద్ద ప్రశ్న. మంత్రివర్గ నిర్ణయాలను, ఫైళ్ల గమన విధానములను, మంత్రుల చొరవను అందులో తలెత్తిన తప్పొప్పులను ప్రశ్నించే అధికారం సి.బి.ఐ లాక్కుంటే ఇంకేముంది? ప్రభుత్వం, మంత్రివర్గం తమకున్న రాజ్యాంగాధికారాన్ని కోల్పోతాయి. ఇకపోతే సి.బి.ఐ. జేడీ దేవుడా? పాలకుడా? ఒక సామాన్య ప్రభుత్వాధికారి మాత్రమేకదా? ఆయన అక్రమంగా వ్యవహరిస్తే ప్రశ్నించే చట్టాలు రావాలి.
ఆయన చట్టానికతీతుడా సి.బి.ఐ. జేడీ ‘‘కాల్ లిస్టు’’ ను ‘‘సాక్షి’’ బయట పెట్టిన తర్వాత ఆయన, ఆయన విచారణ తీరు మీడియా నుండి కనుమరుగై పోయింది. ఏమి? ఎందుకు?..ఎందుకు? అదంతా కుట్ర అని తెలిసి పోతుందనా? ఈ కోణంలో చూస్తే జగన్ నిర్దోషి. ఆయన ఈ రాష్ట్రానికి ఒక జ్యోతి. న్యాయమూర్తులు సత్వర న్యాయ విచారణ పూర్తి చేసి ఒక మంచి పౌరునికున్న పౌర హక్కులను కాపాడే విధంగా జగన్‌ను ఏరోజు జైలు నుండి బయటకు పంపుతారో ఆరోజే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మహా పర్వదినం.
- జె.యం.దినకర్, సరూర్‌నగర్, హైదరాబాదు.
దేవుడే నీ కుడిచెయ్యి వైపు!
హిందూమత ధర్మశాస్త్రాల ప్రకారం నాలుగు వేదాలు, రామాయణం, మహాభారతం (కావ్యాలు) ఉపనిషత్తులు పరిశీలిస్తే ప్రజారంజకుడైన వ్యక్తే రాజుగా పరిగణించబడతాడు. అందుకే ‘రాజును బట్టే ప్రజలు’ అనేవారు. ఏ రాజు పాలించినా మానవాభ్యున్నతికి పాటుపడితే ప్రజారాజ్యం సురక్షమై, దిక్కుమాలిన వారి బ్రతుకులు కూడా పచ్చతోరణాలు అవుతాయి. అందుకే రఘువంశానికి చెందిన శ్రీరాముడు, హరిశ్చంద్రులను ఈ రోజుకు కూడా ఎంతో గౌరవించి, పూజిస్తున్నాం. ‘అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ’ అని వేదం చెబుతున్నది. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని తైతిరీయ ఉపనిషత్తు చెబుతున్నది. ఆ అన్నం పెట్టి దరిద్రంలో తాండవిస్తున్న మనుష్యులను శిఖరాగ్రాలకు తీర్చిదిద్దిన మనిషే రాజశేఖరరెడ్డిగారు.
చావుబ్రతుకులు ప్రతి జీవికి సహజం. కానీ, ప్రజోద్ధరణకు మనిషిగా ఏమి చేశాం? అని గుర్తుంచుకొని, బాధ్యతాయుతంగా నెరవేర్చిన మనిషే మహామనిషి. అందుకే అందరికీ దూరమైనా ఆ మహానుభావుణ్ణి స్మరించక తప్పదు. కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలు అందించినా, దానిని స్పష్టంగా అమలుపరిచే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడే స్వర్గీయ డాక్టర్ రాజశేఖరరెడ్డిగారు. ఇది పొగడడం కాదు. పౌరునిగా మన స్పందన కావాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది.
రాజకీయ తాత్వికుడు ‘హెగెల్’ చెప్పినట్లు ప్రజావాక్యం దైవ వాక్యం. అది నిజంగా జగన్ జీవితంలో జరిగింది. అందుకు మొన్న జరిగిన ఎన్నికలే సాక్ష్యం. బైబిలు ప్రకారం పాత నిబంధనలో మోషే ‘నా తరువాత వచ్చేవాడి చెప్పులు మోయడానికి నా తరం కాదు’ అన్నాడు. ఆయన యేసు. యిది కొత్త నిబంధనకు 750 సంవత్సరాలకు ముందు వివరించిన సాక్ష్యం. అలాగే యేసు జన్మించడం, చివరకు లాటిన్‌భాషలో ‘లామా లామా సబక్తిజిన్’ అనడం... అంటే ‘దేవుడా! నన్ను చివరకు ఎందుకు జారవిడుచుచున్నావు?’ అని అనడం, చివరకు శిలువపై ప్రాణాలు పోవడం మరల కొద్ది దినాలకు సమాధి నుండి లేవడం జరిగిందని బైబిల్ చెబుతుంది. రాజశేఖరరెడ్డి గారు కూడా మరణ సమయంలో తన మనస్సులో ‘కాంగ్రెస్‌ను కాపాడి, రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నన్ను భద్రతాలోపాలతో పరలోకాలకు పంపుతున్నారే’ అనుకొని ఉండవచ్చు.
ఏదేమైనా అటువంటి మహానుభావుని అంశలో పుట్టిన జగన్ ధర్మానికి కట్టుబడి, ఓర్పు నేర్పుతో విచారణకు సహకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ఉండి, తన భవిష్యత్తును ఆలోచించుకుంటూ, దేవునిపైనే భారం వేశాడు. ప్రజల అండదండలే ఆయనకు పూలదండలు. బైబిలులోని ప్రకటిత గ్రంథం పరిశీలిస్తే ‘నేను ఏదో సమయం దొంగవలె వస్తాను. అప్పుడు తప్పనిసరిగా పాపాలకు జవాబుదారి సమాధానం చెప్పాలి’ అంటాడు దేవునికి ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు. ఆయన కుడిహస్తం నీవైపు వుంది జగన్. నీవు దిగులుపడవద్దు. పుడమి తల్లికి పురిటి నొప్పులు తప్పవు. నీ ఓర్పు, నేర్పులే నీకు శ్రీరామరక్ష. కానున్నది కాకమానదు. రానున్నది రాకమానదు. అంత దేవేశ్చ.
- ఎం.వి.రామమోహనరావు, చందానగర్, రంగారెడ్డి జిల్లా

'పదవీ కాంక్షతోనే బాబు పాదయాత్ర'
తిరుపతి : పదవీ కాంక్షతోనే చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని కుప్పిగంతులు వేసినా చంద్రబాబుని ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన సోమవారమిక్కడ అన్నారు.
కాగా నిన్న కురిసిన వర్షాలకు తిరుపతి నగరం చెత్తకుప్పల మయంగా మారింది. తిరుపతి డ్రైనేజి పరిస్థితిని సమీక్షించేందుకు భూమన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తో కలిసి వార్డులను పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
source: sakshi

YSRCP'S BLOOD DONATION CAMPS BEGIN IN ALL DISTRICTS
Today is National Blood Donation Day. To mark the occasion the medical wing of the YSR Congress party has planned blood donation camps across the state.
While the blood donation camp in Hyderabad will take place at the YMCA grounds in Narayanaguda, in other cities it will be conducted at YSRCP offices.
YSRCP honorary president YS Vijayamma will visit the blood donation camp at Narayanaguda. The camp will be between 9 am to 5pm.
source: sakshipost
Sunday, 30 September 2012
ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకుడు... జగన్ కోసం - 14 (పాఠకుల స్పందన)sakshi
|
నేడు వైఎస్‌ఆర్ సీపీ రక్తదాన శిబిరాలు
హైదరాబాద్ : జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ వైద్య విభాగం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
నారాయణగూడలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రక్తదాన శిబిరానికి సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు.

Subscribe to:
Posts (Atom)