వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను పార్టీ నేతలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి , పలువురు ముఖ్యనేతలు హాజరై జాతిపితకు నివాళులు అర్పించారు.
అనంతరం ఎంపీ మేకపాటి మాట్లాడుతూ గాంధీ వారసులమని చెప్పుకునే కొంతమంది నేతలు ఆయన ఆశయాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. గాంధీ మార్గాన్ని అందరూ అనుసరిస్తే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోసం చాలా అవస్థలు పడుతున్నారని, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాక ఎన్ని యాత్రలు చేసినా ఎవరూ నమ్మరని మేకపాటి వ్యాఖ్యానించారు

No comments:
Post a Comment