హైదరాబాద్: వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్, టీడీపీలు కుట్రచేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ ఆరోపించారు. రేపు సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలు మరో కుట్రకు వ్యూహరచన చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు కేంద్రమంత్రులను కలవడం వెనుక ప్రజాసమస్యలు లేవన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కైందనడానికి అనేక నిదర్శనాలున్నాయని చెప్పారు.
కేంద్రాన్ని విమర్శించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి తప్పించుకోడానికే బాబు కేంద్రాన్ని విమర్శించట్లేదని అన్నారు. జగన్ బయటకు వస్తే కాంగ్రెస్, టీడీపీ ఖాళీ అవుతాయన్న భయం ఆ రెండు పార్టీల నేతల్లో నెలకొందన్నారు. చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను దూరం పెట్టడం వల్లే ఇప్పుడు ప్రజలు ఆయన్ను అధికారానికి దూరం చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని అన్నారు.

No comments:
Post a Comment