హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన ఈనెల 8న కేంద్ర పాలక మండలి, కేంద్ర కార్య నిర్వాహక మండలి అత్యవసర సమావేశం జరగనుంది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం ఈ మేరకు వెల్లడించారు. పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం కనుక అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. శనివారం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, జి.బాబూరావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బి.గురునాథరెడ్డి, ఆళ్ల నాని, ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, డీఏ సోమయాజులు, సజ్జల రామకృష్ణారెడ్డి, కొణతాల రామకృష్ణ, ఎం.ప్రసాదరాజు, జ్యోతుల నెహ్రూ, డి.సి.గోవిందరెడ్డి, రవీంద్రనాయక్, జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, అంబటి రాంబాబు, కె.శివకుమార్ పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరణ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించారు. పార్టీని భవిష్యత్‌లో పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగిందని అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాపక్షంగా పోరాడేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై 8న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన వివరించారు. నిరంతరం ప్రజల మధ్య ఉన్న జననేత జగన్‌ను కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు చేసి అక్రమంగా బంధించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణచివేయలేరన్నారు. జగన్ జైల్లో ఉన్నా విజయమ్మ నేతృత్వంలో నాయకులందరూ దిగ్విజయంగా ముందుకెళ్లే విధంగా పార్టీ నిర్ణయాలుంటాయన్నారు. |
source:sakshi
No comments:
Post a Comment