YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 4 October 2012

దేవుని ఆశీర్వాదాలు ఆ బిడ్డకు ఎల్లప్పుడూ ఉండాలి

రాజశేఖరరెడ్డిగారు సిఎంగా వున్నప్పుడు తాను చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ సరిగ్గా అందుతున్నాయో లేదోనని పర్యవేక్షించేందుకు వెళ్తుండగా ప్రయాణంలో హఠాన్మరణం పొందడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ సంఘటనతో రాష్ట్రమంతా మూగబోయింది. ప్రజలంతా ఎంతో విలపించారు. కన్నీరుకార్చనివారు లేరు. ఆ వార్త విని గుండెలు ఆగి చనిపోయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ చూసి జగన్ ఎంతో కలతచెందారు. పావురాలగుట్టకు వెళ్లినప్పుడు ప్రజలను ఉద్దేశించి - చనిపోయినవారి కుటుంబాలను వచ్చి ఓదార్చుతానని మాట ఇచ్చారు.

అందుకు అధిష్ఠానం వద్దకు అనుమతికోసం వెళ్లినప్పుడు వారు తిరస్కరించారు. అంతేగాక వారిపైన, టీవీ ఛానెల్‌పైనా, సాక్షి పేపరుపైన దాడులు జరిపించారు. వారు ఇవ్వవలసిన పర్మిషన్ ఇవ్వకపోగా, రాష్ట్రానికి చేయవలసిన సేవలు విస్మరించారు. జగన్‌ను ఎంతగానో ఇబ్బందికి గురిచేసినారు. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని కేసులన్నీ ఆయనపైన వేసి, అక్రమ ఆస్తుల పేరుతో సిబిఐతో విచారణ జరిపించారు. ఎక్కడా లేని విధంగా కొత్త పద్ధతిలో కేసు నడిపిస్తున్నారు. ఎంత గొప్ప దగాకోరులకైనా బెయిల్ ఇచ్చారు కానీ ఏ తప్పూ చేయని జగన్‌ను లోపల పెట్టి ఆ కుటుంబంపై కక్షకట్టి ఆయనకు బెయిల్ ఇవ్వకుండా చేస్తున్నారు.

కనీసం తండ్రి చనిపోయిన దినమునకైనా విడుదల చేయకుండా తల్లిని, కుటుంబాన్ని ఓదార్చడానికి కూడా లేకుండా చేసినారు. తండ్రి సంవత్సరీకానికి సమాధి వద్దకు వెళ్లడానికి కూడా జగన్‌ను నోచుకోకుండా చేసినారు. లోకంలో ఆయన అంత గొప్ప తప్పు ఏం చేశారు? రాష్ట్రంకోసం తపించి, రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. అందుకు వారు ఇచ్చే గౌరవం ఇదేనా! పైగా అధికార పార్టీవారు రాజశేఖరరెడ్డి గారి ఫోటోకు పూలమాలలు వేసి కపట ప్రేమ చూపి, అంజలి ఘటిస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందా! ఇంత అన్యాయమైన పాలన, ఇంత దుర్భరమైన పాలన ఎక్కడైనా ఉందా! సంవత్సర కాలం అవుతున్నా జగన్‌పైన ఒక్క తప్పు కూడా చూపించలేకపోయారు. కాని, జగన్‌ను జైలులో వేసి, నాలుగు నెలలు గడిచినా బెయిల్ ఇవ్వడానికి ఎన్నో సాకులు చెప్పి, వాయిదాలు వేస్తున్నారు.

ఇలా చేయడం ఎంత రాక్షసత్వమో వారు నిరూపించుకున్నారు. ఆ మహానేత కుటుంబానికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా! ఆ బిడ్డలు ఎంత విలపిస్తున్నారో మీకు తెలుసా! ఏది ఏమైనా జగన్ పక్షాన రాజశేఖరరెడ్డిగారు, దేవుడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ఆయనకు ఎప్పటికైనా మేలు చేస్తాడు. జగన్ లోపల వున్నా కృంగిపోకుండా ప్రజలకు ఏవిధంగా సేవలు చేయాలో ప్రజలకు ఉపయోగపడే ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలో ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఆ మంచి మనస్సుగల వ్యక్తికి దేవుడు మంచి బహుమానం ఇస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఆ బిడ్డకు ఎల్లప్పుడూ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను.

- ఇ.సి.సుగుణమ్మ,
పులివెందుల, వైఎస్‌ఆర్ జిల్లా

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!