YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 2 October 2012

గాంధీజీకి నివాళులర్పించిన విజయమ్మ

పులివెందుల : గాంధీ జయంతి సందర్బంగా వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మంగళవారం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. అనంతరం విజయమ్మ అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఇవాళ, రేపు పులివెందులలోనే ఉండి విజయమ్మ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతారు.

హైదరాబాద్: జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులుఅర్పించారు ఆ పార్టీ నేతలు. దేశ ప్రజలు గాంధీ మార్గంలో పయనించాలని ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. గాంధీ సిద్ధాంతాలను విదేశాల్లో కూడా పాటిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ గాంధీ మార్గంలో పయనించినప్పుడే శాంతి వర్ధిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనక్‌ ప్రసాద్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి , యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌ రెడ్డి పలువురు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!