ఈ రోజు జగన్‌ని జైలులో చూసి చాలా బాధగా అనిపించింది. ప్రజల కోసం ప్రజల మధ్య ఉన్న మనిషిని అన్యాయంగా అరెస్టు చేసి జైలులో పెట్టారు. మీకు ఇది ఆట కావచ్చు. చదరంగం కావచ్చు. కాని భర్తను పోగొట్టుకొన్న ఒక తల్లికి- ఆమె బిడ్డను- చేయని నేరానికి జైలులో పెడితే ఎలా ఉంటుంది? మీకు తల్లులు లేరా? పసిపిల్లలకు- తమ తండ్రిని ఇంతమంది వికృతంగా చుట్టుముట్టి ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ల లేత మనసులు ఆవేదనతో అల్లాడవా? మీకు పిల్లలు లేరా? ఇంటికి, జీవితానికి అండగా ఉండే భర్తను తీసికెళ్లి అన్యాయంగా జైలు పాలు చేశారే... అదే మీ భార్యలకు అలాంటి పరిస్థితి వస్తే? మీ వరకు వస్తేకాని తెలీదు ఆ బాధ, ఆ దుఖం, ఆ వేదన. అయినా ఏ తల్లికి, ఏ బిడ్డలకు, ఏ భార్యకు ఇటువంటి కష్టం రాకూడదని దేవుణ్ణి వేడుకొంటున్నాను. దేవా! పగవాళ్లకు కూడా వద్దు ఇటువంటి బాధ. అసలు వాస్తవం ఏమిటంటే జగన్‌కు అస్సలు సంబంధం లేని విషయంలో జగన్‌ను జైల్లో పెట్టారు. నీ కంపెనీ షేర్లను ఎక్కువ రేటుకు అమ్మినావు కాబట్టి నిన్ను జైల్లో పెట్టామంటే ఈ దేశంలోని టాటాలు, అంబానీలు, జీఎమ్మార్‌లు అందరూ జైల్లో ఉండాలి. మన చంద్రబాబుగారి హెరిటేజ్ దగ్గర నుండి ఈనాడు రామోజీరావు వరకు అందరూ షేర్స్ ఎక్కువ రేటుకు అమ్ముతారు. మరి అలాంటిది జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారు అనే మా ప్రశ్నకు సమాధానం దొరకదు. అసలు ఎందుకు మా సంస్థల మీదికి వచ్చారు? విచారణ అన్నారు... ఎవరో లెటర్ రాశారని (అందునా లెటర్ రాసింది మా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే)... దానికి ఎవరు జతకట్టారని (అది కూడా మా ప్రత్యర్థులే) మా మీదికి వచ్చి ఇంతగా వేధించుకు తింటున్నారు. మా కుటుంబాన్ని- మామగారి మరణం నుండి ఇంకా కోలుకోలేక పోతున్న మా కుటుంబాన్ని ఇంత నరక యాతనకు గురి చేస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? మన దేశ పెద్దల సంస్కారం ఇదేనా? మన విచారణ సంస్థల నిస్పక్షపాతం ఇదేనా? అయినా దేవుడు చూస్తున్నాడు. వాళ్ల కుట్రలు చూస్తున్నాడు. మా బాధలను చూస్తున్నాడు. తప్పక వాళ్ల కుట్రలను భగ్నం చేసి మమ్మల్ని ఆదరిస్తాడు. రామాయణంలో రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవులపాలై తిరిగి వచ్చి రామరాజ్యం అందించాడు. జగన్ కూడా ఆ తండ్రి చనిపోయిన ఆ ప్రదేశంలో ఇచ్చిన ఆ మాట కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాడు. జగన్ త్వరలో తిరిగివస్తాడు. వచ్చి దేవుని దయవలన మామగారి ఆశీర్వాదంతో, మామగారిని ప్రేమించే ప్రతి ఒక్కరి అండతో వైఎస్సార్ సువర్ణ యుగం అందిస్తాడు. ఆమెన్. తథాస్తు. ఇన్‌షా అల్లా. |
Wednesday, 3 October 2012
పగవాళ్లకు కూడా వద్దు ఇటువంటి బాధ జగన్ కోసం - 17
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment