మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తిలో ఆంధ్రరాష్ట్ర ప్రజలు వైఎస్సార్ దేవోభవ అని కూడా చేర్చి తమ హృదయాల్లో ఆ దివంగత మహానేతను నింపుకున్నారు. అయితే వారు అదే స్థాయిలో
జగన్‌ని కూడా ఆదరించడం జగన్‌కు శాపంగా మారింది. నేటి రాజకీయాల్లో నీతినియమాలు, కృతజ్ఞతాభావాలు అంతరించిపోయి స్వార్థం, వెన్నుపోట్లు, కక్ష్యసాధింపులు, కుట్రలే అగ్రభాగాన నిలిచాయనడానికి రుజువు... మహానేత తనయుడైన జగన్‌ను కుట్రతో జైలు పాలు చేయడం. జగన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాలు కక్షకడితే, ప్రజలు మాత్రం జగన్ పక్షాన నిలిచారు. దీని ఫలితంగా కాంగ్రెస్ పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుందో తలుచుకుంటేనే ఆ పార్టీపై జాలేస్తోంది. జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఇంత కక్ష కట్టడానికి కారణం నాకు ఒకటి కనబడుతోంది.
ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా ఢిల్లీ అధిష్టానానికి పాదాభివందనాలు చేస్తూ అణిగిమణిగి ఉండాల్సిందే. కానీ వైఎస్సార్ అలా కాకుండా రాష్ట్ర ప్రజల మేలు కోసం ఏ పని చేయడానికైనా అధిష్టానం మెడలువంచి ఒప్పించుకున్నట్లు కనపడుతుంది. బహుశా అధిష్టానానికి గులాంగిరీ చేయని నేత వైఎస్సార్ ఒక్కరే అనుకుంటా. 2014లో ఇంతకంటే మెజారిటీ సీట్లతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానన్న వైఎస్సార్ మాటను నిలబెట్టే నాయకుడు కాంగ్రెస్‌లో ఒక్కరైనా ఉన్నారా అంటే లేరు. ఆ శక్తి కలిగిన ఏకైక నాయకుడు జగన్. అటువంటి నాయకుడిని కాంగ్రెస్ బయటకు వెళ్లేలా చేసి కాంగ్రెస్‌ను కుక్కలు చింపిన విస్తరిలా తయారుచేశారు. ఇదంతా కాంగ్రెస్‌లోని ప్రజాకర్షణ లేని నాయకుల పనే.
ఒక నగ్నసత్యం ఏమిటంటే... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని 90 శాతం కార్యకర్తలు జగన్‌నే తలుస్తూ పరోక్షంగా జగన్ గెలుపునే కోరుకుంటున్నారు. కార్యకర్తల్లో ఉన్న ఈ కృతజ్ఞత పదవులపై ఊరేగుతున్న వారికి లేదు. 2014లో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడనే విషయాన్ని కాంగ్రెస్ టీడీపీలే నిర్ధారించాయి. దీనికి రుజువేమిటంటే... అధికార పక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షమైన టీడీపీ రెండూ జగన్‌నే టార్గెట్ చేసుకోవడం. ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీలనూ బ్రహ్మాండంగా టార్గెట్ చేసి పెట్టుకున్నారనేది గమనించదగ్గ విషయం. మాట తప్పని, మడమ తిప్పని నేతలకు కష్టాలు సర్వసాధారణం.
ఈ కుట్రలు, కుతంత్రాల నుండి జగన్ బయటకు వస్తారనే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు వేయికళ్లతో మహానేత తనయుని కోసం ఎదురుచూస్తున్నారు. విజయానికి మరో పేరు జగన్.
- తవుటం శ్రావణినేత,
సామాజిక కార్యకర్త, కమలాపూర్ గ్రామం, కరీంనగర్ జిల్లా

No comments:
Post a Comment