YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 1 October 2012

ధర్మానను వదిలేశారేం? నన్ను మాత్రమే అరెస్టు చేస్తారా?andhrajyothy


ధర్మానను వదిలేశారేం?
నన్ను మాత్రమే అరెస్టు చేస్తారా?
మాజీ మంత్రిని.. నేనేం చేయగలను

నిర్ణయాలకు కేబినెట్‌ది సమష్ఠి బాధ్యత
అయినా సీబీఐ నా వెంటే పడుతోంది
బెయిల్ కోరుతూ మోపిదేవి ఆరోపణలు
"ఒకే కేసు అందరిపైనా ఒకే లాంటి అభియోగాలు. అయినా మంత్రి ధర్మాన ప్రసాదరావు నేటి వరకు అరెస్టు కాలేదు. నన్ను మాత్రం అరెస్టు చేయడమే కాక.. నాలుగున్నర నెలలుగా బెయిల్ కూడా రాకుండా సీబీఐ అడ్డుపడుతోంది. ఇది ఎంతవరకు సమంజ సం?'' -వాన్‌పిక్ కేసులో అరెస్టయిన మాజీ మం త్రి మోపిదేవి వెంకట రమణారావు నాంపల్లి సీబీఐ కోర్టులో చేసిన వాదన ఇది. వాన్‌పిక్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్లో కొన్నిం టి గురించి కేబినెట్‌కు తెలియదనడం సీబీఐ ఊహ మాత్రమేనని ఆయన అన్నారు.

మంత్రిగా తీసుకు న్న నిర్ణయాలకు, కేబినెట్ సమష్టి బాధ్యత వహించాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, దానికి భిన్నంగా సీబీఐ కేవలం తనొక్కడినే బాధ్యుడిగా చూపే ప్రయత్నం చేస్తోందని వాపోయారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి ద్వారా ఆయన నాంప ల్లి సీబీఐ కోర్టుకు వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తు ఎలా సాగుతోందో కోర్టు గమనించాలని కోరారు. "ఈ కేసులో నిందితుడుగా ఉన్న మోపిదేవి, ఇతర నిందితులతో కలిసి కుట్రకు పాల్పడ్డార ని సీబీఐ ఆరోపించింది. మొత్తం నిందితులందరిపై నా ఒకే రకమైన అభియోగాలు చేసినా, నా క్లయిం ట్ ఒక్కరిపైనే దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది.

వాన్‌పిక్ పోర్ట్స్‌కు బదులు, నిమ్మగడ్డ ప్రసాద్ సొంత సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు 18,878 ఎకరాలు కేటాయించడంలో ఏ5గా ఉన్న అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన నేటికీ అరెస్టు కాలేదు. ఆయనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సీబీఐ మాత్రం మోపిదేవిని అరెస్టు చేసి, జైల్లో పెట్టింది. బెయిల్ పిటిషన్ వేసినపుడల్లా.. సాక్ష్యాలు తారుమారు చేస్తారని అడ్డుపడుతోంది. మాజీమంత్రిగా ఉన్న ఆయనే సాక్ష్యాలు తారుమా రు చేస్తారంటూ.. ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తిని మాత్రం సీబీఐ ఏమీ అనడం లేదు. భూకేటాయింపులకు ఆయన కూడా బాధ్యత వహించాలి కదా!'' అని డిఫెన్స్ న్యాయవాది విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ సొంత డబ్బుతో భూములు కొన్నారని, ప్రభుత్వానికి ఏమీ నష్టం జరగలేదని వ్యాఖ్యానించారు.

అది సమష్టి బాధ్యత..
మోపిదేవి న్యాయవాది తన వాదన కొనసాగిస్తూ.. "వాన్‌పిక్ విషయంలో నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదించినవే! కాదని ఏ మంత్రి అయినా సీబీఐకి చెప్పారా? రాయితీ ఒప్పందం గురించి కేబినెట్‌కు తెలియదని సీబీఐ ఎలా చెబుతుంది? ఏదో ఊహించుకుంటూ సీబీఐ చేస్తున్న ఆరోపణలవి. కేబినెట్ నిర్ణయాలకు మంత్రి మండలి సమష్టి బా ధ్యత వహించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ సీబీఐ మాత్రం ఒక్క మోపిదేవినే తప్పుబడుతోం ది'' అన్నారు. మోపిదేవి నాలుగున్నర నెలలుగా జైలులో ఉన్నారని, దర్యాప్తునకు సహకరిస్తారని.. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని మోపిదేవికి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. సీబీఐ తన వాదన వినిపించేందుకు సమయం కోరగా.. జడ్జి కేసును బుధవారానికి వాయిదా వేశారు.

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/oct/2/main/2main5&more=2012/oct/2/main/main&date=10/2/2012

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!