YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 6 October 2012

మీకు కోట్లమంది కుటుంబ సభ్యులం ఉన్నాం- జగన్ కోసం (sakshi)

నా పేరు విజయలక్ష్మి. మాది రైతు కుటుంబం. డా.రాజశేఖరరెడ్డి గారు అంటే ఎనలేని ప్రేమే కాదు... గుండెనిండా కొలువై ఉన్నారు. అలాంటి పెద్దాయన ఇలా కనుమరుగయ్యారంటే ఇప్పటికీ నా గుండె చెరువు అవుతోంది. రాజశేఖరరెడ్డి గారిని భగవంతుడు దూరం చేసినపుడు నేను అసలు మనిషిని కాలేకపోయాను. జగనన్న ఎంతో బాధలో ఉండి, ప్రజానీకానికి చేతులు జోడించి ‘మీరు బాధపడవద్దు. నాన్నగారు ఎక్కడికీ వెళ్లలేదు. మన గుండెలో ఉన్నారు’ అన్నాక కాస్త ఊరట కలిగినా అదే బాధ. అప్పుడు మావారి ఆలోచనతో మా గ్రామంలో విగ్రహం పెట్టించి రోజూ చూసుకంటూ నమస్కరించుకుంటున్నాము.

భగవంతుడు ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం - కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో జగనన్న మా గ్రామం అయిన కొణకంచి రూట్ మ్యాప్‌లో లేకపోయినా మా గ్రామానికి రావాలి అని అడగ్గానే వచ్చారు. ఆయన చుట్టూ జనం. ఆయనను చూసినప్పుడు నాకు దుఃఖం, ఏడుపు పొంగుకొచ్చాయి. జగనన్న కారు ఆపి ‘ఏమిటమ్మా బాధ’ అని అడగ్గానే నాకు అసలు నోట మాటరాక మూగబోయి, దుఃఖంలో ఉండిపోయాను. వైఎస్‌గారు పోయినప్పుడు కలిగిన బాధ గురించి చెప్పాలి అనుకున్నాను. కానీ ఏడుపు. జనం మొత్తం మామీద గుడిగూడారు. ఏమైనా జగనన్న మా దగ్గరకు వచ్చారని ఎంతో సంతోషం. కాని ఆ సంతోషాన్ని ఎన్నోరోజులు ఉండనీయకుండా ఈ ప్రభుత్వం జగనన్నను ఇలా జైల్లో ఉంచారు. నేను ఏడవని రోజు లేదు. బాధపడని క్షణం లేదు. అమ్మా విజయమ్మగారు, భారతిగారు, షర్మిల గారు మీకు కోట్లమంది కుటుంబ సభ్యులం ఉన్నాం. ఆ భగవంతుడు అన్యాయం చేయడు. దేవుని నమ్మినవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఆ భగవంతుడు మనకు న్యాయం తప్పక చేస్తాడు. జగనన్న ముఖ్యమంత్రిగా తప్పక అవుతారు. అది భగవంతుని నిర్ణయం.
- దేవరపల్లి విజయలక్ష్మి,
కొణకంచి గ్రామం, పెనుగంచిప్రోలు మండలం, కృష్ణా జిల్లా


వాళ్లు కొట్టుకుపోయే రోజు త్వరలోనే వస్తుంది.

ఈ రోజు చాలా దురదృష్టకరం. ఎంతో ఆతృతగా జగన్‌గారి కోసం మనం అంతా ఎదురుచూశాము. అయినా దేవుని ప్లాన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలీదు. మేమే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు ఎలా ఉంటున్నారో తలచుకుంటే బాధేస్తుంది. మనం ఎంత నిరీక్షణచేయాలో తెలియడం లేదు. నిజమే.. మీరు పడుతున్న ఈ బాధ పగవాడిక్కూడా రాకూడదు. ఉదయం వార్తలు చూడగానే జగనన్నను అభిమానించే ప్రతివారు ఎంతో నీరసపడ్డారు. దేవుడు మన పార్టీని నడిపిస్తాడు అని నమ్ముతున్నా. శంకరరావు రాసిన ఒక లెటర్‌తో ఇంత జరుగుతున్నా, ఈరోజుకి కూడా మీరు శంకరరావును ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది మీ గ్పొపతనం.

పార్టీ కార్యకర్తలకు కూడా మీరు ధైర్యం చెప్పాలి. మీరు, షర్మిల గారు వచ్చి, విజయమ్మగారికి తోడుగా ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. అన్న వచ్చేవరకు పార్టీకి మీరు భరోసాగా ఉండాలి. మీ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడూ వమ్ముచేయడు. మన ప్రార్థనలు ఎక్కడికీ పోవు... దేవుడు వింటున్నాడు. మీ కన్నీళ్లు చూసి నవ్వినవాళ్లు కొట్టుకుపోయే రోజు త్వరలోనే వస్తుంది. జగన్‌గారు చేసిన పెద్ద తప్పు ప్రభుత్వాన్ని కూల్చకపోవడం. అదే చేసి వుంటే అందరూ దారిలోకి వచ్చేవాళ్లు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటే వాళ్లు మీ మీద ఎంత కక్షకట్టారో అర్థమవుతుంది. మిమ్మల్ని నమ్మిన వారికి మార్గం చూపారు. అలాంటివారే మీకు దూరంగా వున్నారు... ఇలాంటి రాజకీయాలు ఎక్కడా చూడలేదు.

దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. జగన్ తప్పకుండా బయటకు వస్తారు. ప్రజలు మీ పక్షాన ఉన్నారు. దేవుడు మీ కుటుంబాన్ని బలపరుస్తాడు. చింతించకండి. దేవుని దీవెనలు మీ కుటుంబానికి ఉన్నాయి.

- సిరి సారెళ్ల, ఈమెయిల్ ద్వారా

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!