వైఎస్సార్ జిల్లా: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తూ సహకరిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు కుమ్మక్కై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్మోహనరెడ్డిపై కుట్ర పన్నాయని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ బయటకు వస్తే కాంగ్రెస్-టీడీపీల కార్యకలాపాలు వెలవెలబోతాయని కారణంగానే ఆ పార్టీలు జంటగా కుట్రకు పూనుకున్నాయని అమరనాథ్ రెడ్డి అన్నారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment