న్యూఢిల్లీ: యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ప్రముఖ సామాజిక కార్యకర్త కేజ్రీవాల్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. వాద్రా పన్నులు ఎగవేశారని, ఆస్తులను తక్కువ రేటుకు కొన్నారని, వడ్దీలేని, సెక్యూరిటీలేని రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. 300 కోట్ల రూపాయల ఆస్తులను 50 లక్షల రూపాయలకే వాద్రా కొన్నారని తెలిపారు. వాద్రాకి డీఎల్‌ఎఫ్ చవకగా ఆస్తులు ఎందుకు అమ్మిందని ఆయన ప్రశ్నించారు. వాద్రా ఆస్తుల కొనుగోలుకు డీఎల్‌ఎఫ్ వడ్డీ, సెక్యూరిటీ లేని బుణం ఎలా ఇచ్చిందని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కి ఇచ్చిన భూములపైన, వాద్రా బికనీర్‌లో కొన్న భూములపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 15 మంది మంత్రుల అవినీతి ఆరోపణలపై విచారణ ఎందుకు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. |
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=463333&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment