జగన్ జైలులో ఉన్నా ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపే
కాంగ్రెస్‌లో బాబు ‘పెద్దన్న’ పాత్ర
బాబూ.. ఎవరి కోసం మీ పాదయాత్ర?
కర్నూలు, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీలు మహా కుట్ర పన్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష ఉపనేత భూమా శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఆమె శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్‌ను ఎదుర్కొనే శక్తి లేకనే అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు. ఆయనను జైలులో పెట్టి పాదయాత్రల ద్వారా ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం భ్రమే అవుతుందని ఎద్దేవా చేశారు. జగన్ జైలులో ఉన్నా ప్రజలంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయని, అధికార పార్టీ బలహీనతలను దీటుగా ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ వారితోనే జత కట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
63 సంవత్సరాల వయస్సులో చంద్రబాబు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ చంద్రబాబుకు తొమ్మిదేళ్ల పాలన నీడలా వెంటాడుతోందన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పాదయాత్రలు అని చెప్పుకుంటున్న టీడీపీని చూస్తుంటే జాలేస్తోందని, ప్రజలు ఎప్పుడో చైతన్యవంతమయ్యారని, అందుకే రెండుసార్లు ఆ పార్టీని ఓడించారని గుర్తు చేశారు. జగన్‌కు బెయిల్ రాకుండా చేసేందుకే బీసీ డిక్లరేషన్ సాకుతో ప్రధానమంత్రిని చంద్రబాబు ఏకాంతంగా కలిశారని ఆరోపించారు. జగన్ బెయిల్ విచారణకు ఒక్క రోజు ముందు ఆయన ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ నోటీసులు జారీ చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో చంద్రబాబు పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు.
ప్రత్యేక కోర్టులను ఆహ్వానిస్తున్నాం
తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులను కోరడాన్ని ఆహ్వానిస్తున్నామని శోభా నాగిరెడ్డి చెప్పారు. ఒక్క జగన్ కేసుల విషయంలోనే కాకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఐఎన్‌జీ భూముల కేటాయింపులు, ఎంఆర్ ప్రాపర్టీస్ విషయాల్లో స్టే వెకేట్ చేయించుకుని విచారణకు సిద్ధం కావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడకపోతే.. స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపాలిటీ ఎన్నికలను పెట్టాలని డిమాండ్ చేయడంలేదని, అవిశ్వాస తీర్మానానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పాదయాత్రలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే తమ సత్తా ఎంటో చాటుతామని చెప్పారు.
source:sakshi

No comments:
Post a Comment