వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్‌ను అడ్డుకోడానికి సిబిఐ అనుసరించిన వ్యూహం చర్చనీయాంశమవుతోంది. దాదాపు ఏడాది కింద కేసును నమోదు చేసిన సిబిఐ ..... విచారణకు మరింత గడువు కావాలని శుక్రవారం సుప్రీంకోర్టును కోరింది. జగన్‌ను అరెస్ట్ చేసి ఇప్పటికి 132 రోజులవుతోంది.
ఇప్పటికే సీబీఐ నాలుగు చార్జ్‌షీటులు నమోదు చేసింది. సమగ్ర పరిశోధన పూర్తి చేసిన సిబిఐ ఈ కేసుకు సంబంధించి విదేశాల్లోనూ విచారణ జరపాలని కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు చేసిన విచారణలో ఒక్క రోజు కూడా వృధా చేయలేదని తెలిపింది. సిబిఐ విజ్ఞప్తిని మన్నించిన కోర్టు మార్చి 31లోగా విచారణను పూర్తి చేయాలని సూచించింది. ఒక్క చార్జ్‌షీట్‌లోనే మొత్తం కేసునంతా సమర్పించాలని తెలిపింది.
హైదరాబాద్ : సుప్రీం తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి జగన్ బెయిల్‌పై రివ్యూ పిటీషన్ వేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు తెలిపారు. జగన్ బెయిల్ పిటిషన్ అడ్డుకునేందుకే కాంగ్రెస్ , తెలుగుదేశం, సీబీఐ ఒక్కటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఎలాంటి తప్పు చేయలేదని కేవలం రాజకీయ కుట్రలతో ఇబ్బందులు పెడుతున్నారు. మహానేత కుటుంబంపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అంబటి అన్నారు. బెయిల్‌కు ఒక్కరోజు ముందు టీడీపీ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను ఎందుకు కలిసారని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టే ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలకు తెలిసిందన్నారు.
న్యూఢిల్లీ: ఒక్కసారి ఛార్జిషీటు దాఖలయ్యాక నిందితుడికి బెయిలు పొందే హక్కు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం చెప్పారు. ఈకేసును చట్ట పరిధిలోనే చూడాలని ఆయన అన్నారు. చట్టపరిధి దాటి చూడవద్దన్నారు. బెయిలు కోసం వస్తే జైల్లో ఉండమంటున్నారని, ఏ చట్టం దీన్ని చెప్తోందని ఆయన ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ వేస్తే, మార్చి 31 వరకూ జైల్లోనే ఉండమని ఎలా చెప్తారు? అని ఆయన ప్రశ్నించారు.
souce: sakshi
No comments:
Post a Comment