YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 4 October 2012

జగన్ ఓ వ్యక్తి కాదు... సమ్మోహనశక్తి

ఆంధ్రుల ఆశాజ్యోతి మా జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినప్పుడు న్యాయవాదులు, సిబ్బంది క్యూలో నిలిచి మీకేం కాదు, కడిగిన ముత్యంలా బయటపడతారని పలకడం, కోట్లాదిమంది ఆత్మీయ అభిమానులు జనంకోసం పోరాడడానికి జగన్ విడుదల కావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకోవడం వృధా కాదు. అతి త్వరలో జగన్ విడుదల కావడం ఖాయం. వెంటనే ఈ నిరంకుశ ప్రజావ్యతిరేక ప్రభుత్వాలు జగన్ సునామీలో కొట్టుకుపోవడం ఖాయం.

నిజానికి నామరూపాలు లేకుండా పోతున్న కాంగ్రెస్‌ను తన రెక్కల కష్టంతో రెండుమార్లు అధికారంలోకి తెస్తే అణుమాత్రం విశ్వాసం లేకుండా తెలుగువారికి శాశ్వతంగా ‘మహానేత’ను దూరం చేసిన ఈ చెదలుపట్టిన కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొట్టుకుపోవడం ఖాయం. ఆ దివంగత నేత దూరం అయినాడని తెలిసిన మరుక్షణమే విశ్వసనీయతకు, మానవత్వానికి మరోపేరైన వైఎస్ కుటుంబానికి అండగా వుండాలని ఈ రాష్ట్రంలో దాదాపు 50 శాతం మనసున్న ఓటర్లు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. ఏ ఎన్నికలు పెట్టినా జనం ఓట్లన్నీ జగన్‌కే వేసి తమ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేస్తున్నారనే భయంతో ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని కలలో కూడా తలవడం లేదు. 

ఈ రాష్ట్రంలో ఎప్పుడు శాసనసభకు ఎన్నికలు జరిగినా ఓటర్లు వైఎస్ కుటుంబానికి అండగా నిలబడడానికి కంకణబద్ధులై ఉన్నారు. అందుకే ఈ నిజాన్ని గ్రహించిన ఇతర పార్టీ నేతలు తమ అనుచరులతోపాటు మునిగే పడవల నుంచి బయటపడి వైఎస్‌ఆర్ పార్టీకి క్యూ కడుతున్నారన్నది నగ్నసత్యం! జనం జగన్‌ను ప్రజాసింహాసనంపై కూర్చోబెట్టడం ఖాయం. అంతవరకు వైఎస్ కుటుంబ సభ్యులు జగన్ బయట లేని లోటును తీర్చాలి. తీరుస్తున్నారు కూడా. జగన్ బెయిలుపై విడుదలైన రోజు ఈ రాష్ట్ర ప్రజలు సర్వమతాలకు ముఖ్యమైన పర్వదినాలైన ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కలసి వచ్చినంత సంబరాలు అంబరాన్ని తాకుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లదు. 

జగన్‌బాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ జగమంత కుటుంబాన్ని తనసంక్షేమ పథకాలతో వైఎస్ లేని లోటును తీరుస్తూ, తెలుగువారిని తన కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నది అక్షరసత్యం. జగన్ జనంలోకి వస్తే ఓ ఉప్పెన, సునామీ వచ్చినట్టే. అందుకే జగన్ ఓ వ్యక్తి కాదు... సమ్మోహనశక్తి.

- జి.వి.ప్రసాద్, గొల్లపల్లి, మదనపల్లి మండలం, చిత్తూరు జిల్లా

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!