మీడియా ద్వారా ఎన్నికల ప్రచారానికి అవకాశం కల్పించాలని కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం, జగన్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర హోం శాఖను ఆదేశించింది. తాను అండర్ ట్రయల్ ఖైదీనని, జైలు నిబంధనలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం జైల్లో ఉన్నా స్నేహితులు, బంధువులు, న్యాయవాదులతో మాట్లాడే అవకాశం తనకుందని అలాంటప్పుడు మీడియా ద్వారా ప్రచారానికి అభ్యంతరం ఉండదని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కళ్యాణ్ చంద్ర సర్కారు కేసులో సుప్రీంకోర్టు గతంలో ఈ వెసులుబాటు కల్పించిన విషయాన్ని న్యాయస్థానం ముందుకు తెచ్చారు.
అయితే జగన్ తరపు న్యాయవాదుల వాదనను అడ్వకేట్ జనరల్ తిరస్కరించారు. జగన్ 'ఎ' కేటగిరి ట్రయల్ ఖైదీగా ఉన్నారని, ఆయన రాజకీయ ఖైదీ కాదని అన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్‌కు తాత్కాలిక వెసులుబాటు కల్పించడం సాధ్యం కాదని వాదించారు. దీన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందని హైకోర్టుకు తెలిపారు.

No comments:
Post a Comment