YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 9 June 2012

తిరుపతిలో నేడు విజయమ్మ సభ

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆదివారం తిరుపతిలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లీలామహల్ జంక్షన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆమె తన ఎన్నికల ప్రచారానికి ము గింపు పలకనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 1, 2 తేదీల్లో తిరుపతిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డిని గెలిపించాల ని ప్రజలను అభ్యర్థిస్తూ సభల్లో ప్రసంగించారు. టీటీడీ ఉద్యోగులు, తిరుపతివాసులకు అనేక వరాలు ఇచ్చారు.

ప్రచారం చివరిదశలో ఆయన మరోసారి తిరుపతికి రావాల్సి ఉండే ది. అయితే రాష్ట్రంలో అనూహ్య రాజ కీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచార భేరి మోగించిన విషయం తెలిసిందే. ఆమె పర్యటిం చిన 17 శాసనసభ, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రజల నుంచి ఊహించని భారీ స్పందన రావడంతో తిరుపతిలోని పార్టీ శ్రేణులకు కూడా చెప్పలేని ఉత్సాహం వచ్చింది. పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో తిరుపతిలో ఆమె తొలిసారి ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో పర్యటన విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ఉత్సాహపడుతున్నాయి.

విజయమ్మ పర్యటనతో పేద, మధ్య తరగతి వర్గాలు, ప్రత్యేకించి మహిళల్లో మార్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇతర జిల్లాల్లో జరిగిన సభలను బట్టి తిరుపతిలో కూడా జనం స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో సభకు తరలిరావచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయమ్మ పర్యటనకు తిరుపతివాసులు తరలివచ్చి ఆమెను ఆశీర్వదించాలని పార్టీ జిల్లా సమన్వయకర్త డీసీ గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడబలుక్కుని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మీద పాల్పడుతున్న కక్ష సాధింపు, వేధింపులకు జనం తమ మద్దతుతో బుద్ధి చెప్పాలని వారు కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!