వరంగల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం పరకాల ని యోజకవర్గంలో పర్యటించనున్నారు. తొలి సారి జిల్లాకు వస్తున్న విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. పరకాల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబానికి తొలినుంచి సన్నిహితంగా.. అండ గా నిలుస్తున్న మాజీ మంత్రి కొండా సురేఖ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. సురేఖ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో విజయమ్మ పాల్గొంటారు.
ఉదయం 9గంటలకు రైలు ద్వారా విజయమ్మ వరంగల్ స్టేషన్‌కు చేరుకుంటారు. హన్మకొండలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. 10గంటలకు గీసుకొండ మండలం కోనాయమాకుల వద్ద జరిగే రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5:30గంటలకు పరకాలలో జరిగే రోడ్‌షో, బహిరంగసభలో ప్రసంగిస్తారు. విజయమ్మ రాక సందర్భంగా కోనాయమాకుల, పరకాలలో రోడ్‌షో, సభలను విజయవంతం చేసేందుకు కొండా దంపతులు, పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:
Post a Comment