YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 7 June 2012

అడుగుతూనే ఉంటాం. పూటకో చోట కూచోబెట్టి అడుగుతాం. అడిగిందే అడుగుతాం అడగాల్సినవన్నీ అడుగుతాం. అడక్కూడనివీ అడుగుతాం.

అడుగుతూనే ఉంటాం. పూటకో చోట కూచోబెట్టి అడుగుతాం. అడిగిందే అడుగుతాం అడగాల్సినవన్నీ అడుగుతాం. అడక్కూడనివీ అడుగుతాం. అలా తొందరగా వదలబోం. మాకు తెల్సు ఎప్పటి దాకా అడగాలో, మిమ్మల్ని జనంలోకి పోకుండా ఎలా ఆపాలో... 

రెడీనా!
రెడీ!
అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి.
తెలిస్తే చెప్తాను.
అలా కుదరదు. చెప్పి తీరాల్సిందే!
తెలీకపోతే ఎలా చెప్తాను.
మాకు తెల్సు. మేం అడిగే ప్రశ్నలన్నింటికీ మీ దగ్గర సమాధానం ఉందని.
ఉంటే చెప్తాను. ఉన్నవాటికి చెప్తాను. సమాధానం తెల్సిన వాటికి తప్పక చెప్తాను.
చెప్పాలి. చెప్పితీరాలి. చెప్పకపోతే యింకా యింకా అడుగుతాం. అడుగుతూనే ఉంటాం. చెప్పేదాకా అడుగుతాం. అడగడం మా పని, చెప్పడం మీ పని.
మనం పని మొదలు పెడదామా?
అలా అడగద్దు. మాకు ఎప్పుడు ఏది అడగాలనిపిస్తే అది అడుగుతాం. అయిదూ పదీ ఇరవై ముప్పయి ఎన్ని గంటలయినా అడుగుతాం, ఎన్ని రోజులయినా అడుగు తాం. ఏదో ఒక మిష మీద అడగడం కంటిన్యూ చేసి మా మిషన్ కంప్లీట్ చేస్తాం.
ఇది అక్రమం. ఈ సమయంలో నన్ను ప్రజల దగ్గరికి పోకుండా చెయ్యడం అన్యాయం.
సరిగ్గా సమయం చూసి పట్టాం. ఒక పట్టాన వదిలి పెట్టం. జనంలోకి వెళితే ప్రమాదం.
ఎవరికి?
ప్రశ్నలడగాల్సింది మేం. మీ పత్రిక పీక నొక్కేద్దాం అనుకున్నాం. చానల్ కళ్లు పొడిచేద్దాం అనుకున్నాం.
ఇదంతా ఎవరి కోసం?
మేం ఎవరి కోసం పని చేస్తున్నామో మీకవసరం లేదు. మా డ్యూటీ మేం చేస్తాం. మా క్వశ్చనేర్లకీ క్వశ్చన్లకీ ఆన్సర్లు చెప్పడమే మీ పని.
అడగండి.
అడుగుతూనే ఉంటాం. పూటకో చోట కూచోబెట్టి అడుగుతాం. అడిగిందే అడుగుతాం అడగాల్సినవన్నీ అడుగుతాం. అడక్కూడనివీ అడుగుతాం.
అడుగుతాం అడుగుతాం అని యిప్పటికి ఎన్నో గంటలు గడచిపోయాయి. అడగండి.
అలా తొందరగా వదలబోం. మాకు తెల్సు ఎప్పటి దాకా అడగాలో, మిమ్మల్ని జనంలోకి పోకుండా ఎలా ఆపాలో... సరే మొదలెడతాం. అడుగుతున్నాం.
అడగండి.
మీకు జేబులు ఎన్ని ఉన్నాయి?
ఇదేం ప్రశ్న?
ప్రశ్నలడగడంలో మేం సిద్ధహస్తులం. జవాబులు రాబట్టడంలో మాకు మేమే సాటి. అర్థం కాని ప్రశ్నలు అడుగుతాం. మాకు అవసరమయిన సమాచారం రాబడ్తాం. అదే మా ప్రత్యేకత.
సరే! నాషర్టుకి ఒకే ఒక్క జేబుంది.
మేం అడిగింది జేబుల సంఖ్య. మొత్తంగా జేబుల సంఖ్య ఎంత?
ప్యాంటు జేబులు కూడానా?
ఆ సంగతి వేరే అడగాలా?
నాలుగు జేబులున్నాయి.
అలా అంటే కుదరదు. క్లియర్‌గా చెప్పాలి.
క్లియర్‌గానే చెప్పానే!
నోనో అది కరెక్టు కాదు. షర్టుకెన్ని జేబులు, ప్యాంటు కెన్ని జేబులు. విడివిడిగా చెప్పాలి.
షర్టుకి ఒకటి, ప్యాంటుకి మూడు.
ఇప్పుడు చెప్పండి... టోటల్‌గా అంటే ప్యాంటుకీ షర్టుకీ కలిపి ఎన్ని?
నాలుగు.
సరిగ్గా చూసి చెప్పాలి. ఏదో దాస్తున్నట్టు అనిపిస్తున్నది.
ఏమీ దాచలేదు. కరెక్టుగానే చెప్పాను.
మీరు కరెక్టుగా చెప్పానంటే సరిపోదు. మాకు కరెక్టుగా అనిపించాలి.
ఉన్న విషయం చెప్పా ను. మీకు కరెక్టుగా అనిపించడానికి నేనేం చెప్పాలో నాకు తెలీదు.
మాకు కరెక్టుగా అనిపించే సమాధానాలు ఎలా రాబట్టాలో మాకు తెల్సు. మీ జేబులో డబ్బు ఎంత వుంది?
ఏమో తెలీదు. పర్సు తీసి చూడాలి.
అంతవుందా! అనుకున్నాం. జేబులో వుందా? పర్సులో ఉందా? జేబులో ఎంత వుంది? పర్సులో ఎంత వుంది?
జేబులో వున్న పర్సులో ఖర్చులకి కొంత డబ్బు వుంది.
కొంత అంటే ఎంత? డినామినేషన్ చెప్పండి. ఏయే నోట్లు ఎన్నెన్ని వున్నాయో చెప్పండి?
పర్సు తీసి చూసి చెప్పనా?
అక్కర్లేదు. మాకు తెల్సు. సర్వం తెల్సు మాకు?
తెలిస్తే అడగడం ఎందుకు? తెలిసిందే అడగడం ఎందుకు? ఇంతకుముందే అడిగి వుండవచ్చుగదా! తర్వాతైనా అడగొచ్చు కదా?
ఉప ఎన్నికలయిపోయే వరకూ అడుగుతూనే వుంటాం. ఊపిరి పీల్చుకోనివ్వం.
నన్ను ఇలా వేధించమని ఎవరు చెప్పారు మీకు!
మీరు ప్రశ్నలగడగవద్దని మొదటే చెప్పాం. చిదం బర రహస్యం చిదంబరానికి వెళ్తే కాని తెలీదు.
- చింతపట్ల సుదర్శన్

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!