ఒంగోలు నియోజకవర్గంలో ఈ నెల 9న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ పార్టీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ‘న్యూస్‌లైన్’తో గురువారం ఈ విషయం చెప్పారు. ఎనిమిదో తేదీ రాత్రి ఖాజీపేట నుంచి బయలుదేరి తొమ్మిదో తేదీ ఉదయం ఒంగోలు చేరుకుంటారు.
నగరంలోని చర్చి సెంటర్‌లో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద ఉదయం పది గంటలకు సభ ప్రారంభమవుతుంది. సభలో ఓటర్లను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను వివరించడంతో పాటు బాలినేనికి ఓటేసి గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌లో కాంగ్రెస్ కుట్రను ఈ సందర్భంగా ఎండగడతారు.
ఒంగోలు ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం డిపాజిట్లు దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో పాటు సుమారు పది మంది మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించి వెళ్లారు. వచ్చిన మంత్రులంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకే పరిమితమయ్యారు.

No comments:
Post a Comment