వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ అధికారులు 4వ రోజు విచారించడం ముగిసింది. ఈరోజు కూడా కోఠీలోని తమ కార్యాలయంలోనే విచారించారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో వారు జగన్ ని విచారించారు. ఉదయం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని కూడా విచారించారు. ఆయనని జనని ఇన్ ఫ్రాకు సంబంధించిన వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. ఆడిటర్ విజయసాయి రెడ్డిని కూడా ఈరోజు సిబిఐ అధికారులు విచారించారు.
విచారణ ముగిసిన అనంతరం సాయంత్రం 5 గంటలకు సిబిఐ అధికారులు జగన్ ని చంచల్ గూడ జైలుకు తరలించారు. జగన్ ని చూసేందుకు పలువురు చంచల్ గూడ జైలు వద్దకు వచ్చారు. ప్రకాశం జిల్లా చిలంకూరు నుంచి లక్ష్మీనరసయ్య అనే వృద్ధుడు జగన్ ని చూసేందుకు జైలు వద్దకు వచ్చి అయిదు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఈరోజు వరకు చూడలేకపోయారు. ఈరోజు ఆయన జగన్ ని చూశారు. తనకు చాలా సంతోషంగా ఉందని, ఇక తమ ఊరు వెళ్లిపోతానని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, రేపటితో జగన్ సిబిఐ కస్టడీ ముగుస్తుంది.

No comments:
Post a Comment